చిత్ర శుక్ల
చిత్ర శుక్ల భారతీయ సినిమా నటి, మోడల్.[1] డాన్స్ ఇండియా డాన్స్ పాల్గొన్న చిత్ర, 2017లో వచ్చిన మా అబ్బాయి సినిమాలో తొలిసారిగా హీరోయిన్‌గా నటించింది.
చిత్ర శుక్ల | |
---|---|
జననం | చిత్ర శుక్ల సెప్టెంబరు 5, 1996 ఇండోర్, మధ్య ప్రదేశ్, భారతదేశం |
విద్య | డిగ్రీ (బయో టెక్నాలజీ) |
తల్లిదండ్రులు | నరేంద్ర శుక్ల, మంజు శుక్ల |
బంధువులు | శుభ్ శుక్ల, యోగేంద్ర శుక్ల |
జననం - విద్యాభ్యాసం
మార్చుచిత్ర శుక్ల 1996, సెప్టెంబరు 5న నరేంద్ర శుక్ల, మంజు శుక్ల దంపతులకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో జన్మించింది. బయోటెక్నాలజీ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. పాఠశాల, కళాశాలల్లో చదివే రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ నృత్య కార్యక్రమాలలో పాల్గొన్నది. మధ్యప్రదేశ్ డాన్స్ ఐడల్ బిరుదును కూడా గెలుచుకుంది.[2]
సినిమారంగం
మార్చుటీవీ డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డాన్స్ కి ఎంపికైంది. మోడలింగ్ కూడా చేసింది. అనేక టెలివిజన్, వెబ్ ప్రకటనలలో నటించింది. 2016లో నేను శైలజ సినిమాలో క్రేజీ ఫీలింగ్ పాటలో తొలిసారిగా నటించింది.[3] ఆ పాట ద్వారా మా అబ్బాయి సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.[4] ఆ తరువాత రంగుల రాట్నం సినిమాలో రాజ్ తరుణ్, సిల్లీ ఫెలోస్ సినిమాలో అల్లరి నరేష్ పక్కన నటించింది.[5][6] ప్రస్తుతం కాదల్ అనే ప్రేమకథా చిత్రంలో, శశికుమార్ పక్కన నా నా అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.[7][8][9][10]
నటించిన సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమాపేరు | పాత్రపేరు | ఇతర వివరాలు |
---|---|---|---|
2016 | నేను శైలజ | చిత్ర శుక్ల | క్రేజీ ఫీలింగ్ పాటలో |
2017 | మా అబ్బాయి | అమ్ముడు | |
జానీ | చిత్ర శుక్ల | కన్నడ సినిమా; బంగాడే బంగాడే పాటలో | |
2018 | రంగుల రాట్నం | కీర్తి | |
సిల్లీ ఫెలోస్ | వాసంతి | ||
2021 | తెల్లవారితే గురువారం | డా. కృష్ణవేణి | |
2022 | ఉనికి | తెలుగు [11] | |
2023 | గీత సాక్షిగా | తెలుగు | |
2023 | హంట్ | ||
2024 | కలియుగం పట్టణంలో | తెలుగు | |
కాదల్ | (నిర్మాణంలో ఉంది) | ||
నా నా | తమిళ (నిర్మాణంలో ఉంది) |
మూలాలు
మార్చు- ↑ Timesofindia Indiatimes, Movies. "Chitra Shukla". timesofindia.indiatimes.com. Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
- ↑ CrunchWood, Celebrities (16 May 2018). "Chitra Shukla Wiki-Age-Bio-Boyfriend". www.crunchwood.com. Archived from the original on 14 July 2020. Retrieved 14 July 2020.
- ↑ "Sree Vishnu to romance Chitra Shukla in social drama 'Maa Abbayi' - Times of India". The Times of India.
- ↑ Goud, Nagaraj (28 February 2017). "Looking up to Murugadoss". The Hans India.
- ↑ "Raj Tarun and Chitra Shukla's 'Rangula Raatnam' to premier on television this Sunday - Times of India". The Times of India.
- ↑ "Chitra Shukla: I'm thrilled to share screen space with Allari Naresh - Times of India". The Times of India.
- ↑ Adivi, Sashidhar (13 May 2019). "Chitra Shukla to play a college-goer". Deccan Chronicle.
- ↑ "Chitra Shukla to star in a love story set in 2004 - Times of India". The Times of India.
- ↑ "Sasikumar gets to romance Chitra - Times of India". The Times of India.
- ↑ "Telugu actor Chitra Shukla to play the female lead in Sasikumar-starrer, Naa Naa". The New Indian Express. 25 July 2019. Retrieved 14 July 2020.
- ↑ Sakshi (14 December 2020). "థ్రిల్ చేస్తా!". Sakshi. Archived from the original on 12 జూలై 2021. Retrieved 12 July 2021.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చిత్ర శుక్ల పేజీ