మా ఇంటి మహరాజు (1988 తెలుగు సినిమా)

మా ఇంటి మహరాజు గోపీకృష్ణా కంబైన్స్ పతాకంపై కృష్ణంరాజు, జయసుధ జంటగా నటించిన సినిమా. యు.శివకుమారి నిర్మించిన ఈ సినిమా 1988, ఫిబ్రవరి 27వ తేదీన విడుదలయ్యింది.[1]

మా ఇంటి మహరాజు
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ బాపినీడు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
నూతన్ ప్రసాద్,
కోట శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ గోపీకృష్ణా కంబైన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

మాధవయ్య ఒక లారీ డ్రైవర్. అతని భార్య సావిత్రి. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరూ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటారు. మాధవయ్యకు తన కుటుంబమే తన ప్రపంచం. అతడు తన బాస్ సహాయంతో ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారంలో ఎదగగలుగుతాడు.

మాధవయ్య పెద్ద కొడుకు తన యజమాని కుమార్తె తులసిని వివాహం చేసుకుంటాడు. కానీ, సంపన్న కుటుంబం నుండి వచ్చిన ఆమె తల్లి తన అత్తవారి ఇంటి వద్ద ఎదుర్కొనే పరిస్థితుల గురించి హెచ్చరిస్తుంది.

మాధవయ్య కూతురు మరో సంపన్నుడైన శంకరం కొడుకుతో ప్రేమలో పడుతుంది. శంకరం వడ్డీవ్యాపారి. తన కుమారుడి వివాహాన్ని శంకరం వ్యతిరేకించినా, మాధవయ్య తన కుమార్తెను శంకరం కొడుకుతో వివాహం చేస్తాడు. దానితో శంకరం ఆగ్రహానికి మాధవయ్య లోనవుతాడు. ఏదో ఒకరోజు తాను అనుభవించిన బాధను మాధవయ్య కూడా తన కొడుకులు దూరమై బాధను తాను అనుభవిస్తాడని శంకరం శపిస్తాడు. మాధవయ్య మాత్రం తన కుటుంబం ఎన్నటికీ విడిపోరనే నమ్మకంతో ఉంటాడు.

అయితే, మాధవయ్య ఇంట్లోని స్త్రీల మధ్యలో అపోహలు మొదలౌతాయి. మాధవయ్య కొడుకుల మధ్య కుటుంబ ఆస్తుల విషయంలో గొడవపడేలా శంకరం జోక్యం చేసుకుంటాడు. ఈ విభేదాలు తీవ్రమై, ఇద్దరు కొడుకులు తమ తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. మాధవయ్య, సావిత్రి కృంగిపోతారు.

కొడుకుల మధ్య గొడవ ఎక్కువ కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు ఆసుపత్రి పాలౌతారు. మాధవయ్యకు, అతని కుటుంబానికి మరింత బాధ కలిగించడానికి శంకరం ఆసుపత్రికి వచ్చినప్పుడు, మాధవయ్య శంకరాన్ని, అతని అనుచరులను చితకబాదుతాడు. చివరకు మాధవయ్య కుటుంబం కలిసిపోవడంతో కథ సుఖాంతమౌతుంది.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు నిడివి
అందాల హరివిల్లు మా బొమ్మరిల్లు భువనచంద్ర సాలూరి వాసు రావు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 04:42
కసిరికొట్టి పొమ్మన్నా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 04:01
వొట్టి మాయమాటలాడి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల బృందం 04:12
ఈశ్వరా పరమేశ్వరా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 03:54

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Maa Inti Maharaju Vijayabapineedu". ఇండియన్ సినిమా. Retrieved 27 December 2023.

బయటిలింకులు

మార్చు