మిషన్ ఇంపాజిబుల్

మిషన్ ఇంపాజిబుల్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహించాడు. తాప్సీ, హ‌రీశ్ పేర‌డీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 1న విడుదలైంది.[1][2]

మిషన్ ఇంపాజిబుల్
దర్శకత్వంస్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
రచనస్వరూప్‌ ఆర్‌ఎస్‌జే
నిర్మాతనిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణందీప‌క్ య‌ర‌గ‌ర
కూర్పుర‌వితేజ గిరిజ‌ల
సంగీతంమార్క్ కె రాబిన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీs
2022 ఏప్రిల్ 1 (థియేటర్ విడుదల)
2022 ఏప్రిల్ 29(ఓటిటీ విడుదల)
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

మిషన్ ఇంపాజిబుల్ సినిమా షూటింగ్ ను 2020 డిసెంబర్ 12న ప్రారంభించారు.[3]ఈ సినిమా షూటింగ్ లో తాప్సి 2021 జులై 6 నుండి పాల్గొనగా సినిమాలోని 'ఏద్దాం గాలం..సేసేద్దాం గందరగోళం' పాటను విడుదల చేశారు.[4][5]

కథ మార్చు

శైలజ అలియాస్‌ శైలు(తాప్సీ) ఓ ఇన్వెస్టిగేటీవ్ జ‌ర్న‌లిస్ట్‌. ఛైల్డ్ ట్రాఫికింగ్‌పై ప‌రిశోధ‌న‌లు చేస్తుంటుంది. రామ్‌శెట్టి (హరీశ్‌ పేరడీ) అనే మాఫియా డాన్‌ బెంగళూరు నుంచి భారీ ఎత్తున పిల్ల‌ల్ని దుబాయ్ త‌ర‌లించడానికి ప్లాన్ చేస్తాడు. దీని గురించి తెలుసుకున్న శైలజ, రామ్ శెట్టిని పోలీసుల‌కు పట్టించి, పిల్లలను రక్షించాలని బయలుదేరుతుంది.

తిరుపతికి చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం(ఆర్‌.ఆర్.ఆర్‌) అనే ముగ్గురు కుర్రాళ్లకు ఈ విషయం తెలిసి ఇంట్లో చెప్పాపెట్ట‌కుండా ముంబై బ‌య‌ల్దేర‌తారు. ఆ ముగ్గురు ముంబైకి వెళ్లి దావూద్‌ని పట్టుకున్నారా? మాఫియా డాన్‌ని పోలీసులకు పట్టించాలని చూస్తున్న శైలుకీ, దావూద్‌ని పట్టించి రూ.50 లక్షలు ప్రైజ్‌ మనీ పొందాలనుకున్న రఘుపతి, రాఘవ, రాజారాంలకు లింకు ఏంటి? అందులో వీళ్లు విజ‌యం సాధించారా, లేదా? అనేది మిగిలిన సినిమా క‌థ‌.[6]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. Eenadu (28 February 2022). "తాప్సీ 'మిషన్‌ ఇంపాజిబుల్‌'.. విడుదల ఆరోజే". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  2. Andhra Jyothy (1 April 2022). "సినిమా రివ్యూ : మిషన్ ఇంపాజిబుల్". www.andhrajyothy.com. Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
  3. The Times of India. "Swaroop RSJ's next after 'Agent Sai Srinivasa Athreya' titled as 'Mishan Impossible'". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  4. Eenadu (23 February 2022). "సేసేద్దాం గందరగోళం". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  5. Suryaa (24 February 2022). ""మిషన్ ఇంపాజిబుల్" నుంచి 'ఏద్దాం గాలం..సేసేదాం గందరగోళం' లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  6. Eenadu (1 April 2022). "రివ్యూ: మిషన్‌ ఇంపాజిబుల్‌". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
  7. Mana Telangana (7 July 2021). "'మిషన్ ఇంపాజిబుల్'తో రీ ఎంట్రీ". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  8. Andhra Jyothy (4 August 2021). "తాప్సీ `మిష‌న్ ఇంపాజిబుల్‌`లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  9. Sakshi (4 August 2021). "`మిష‌న్ ఇంపాజిబుల్‌'లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  10. Eenadu (23 June 2021). "ద్వితీయ యజ్ఞం.. దాటేరా విఘ్నం?". www.eenadu.net. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.