సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం
ఇది సిద్దిపేట జిల్లాలోని అసెంబ్లీ శాసనసభ స్థానాలలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు సవరించు
- సిద్దిపేట రూరల్
- చిన్నకోడూర్
- నంగునూర్
- నరాయణరావుపేట్
- సిద్దిపేట అర్బన్
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు సవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి బి.అంజయ్య కాంగ్రెస్ పార్టీ 2014 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి టి.శ్రీనివాస గౌడ్ కాంగ్రెస్ పార్టీ 2018 టి. హరీశ్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి మరికంటి భవాని రెడ్డి తెలంగాణ జన సమితి
శాసనసభ సభ్యులు సవరించు
సిద్ధిపేట నియోజకరవర్గమునకు ప్రాతినిధ్యం వహించిన శాసనసభ సభ్యుల పట్టిక
సంవత్సరము | పేరు | రాజకియ పార్టీ | |
---|---|---|---|
1952 | అడ్ల గురవా రెడ్డి | పి.డి.ఎఫ్. పార్టీ | |
1957 | పి.వి.రాజేశ్వర్ రావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | సోమేశ్వర్ రావు | స్వతంత్ర | |
1967 | వి. బి. రాజు | కాంగ్రెస్ పార్టీ | |
1970 (By-Poll)
అనంతుల మదన్ మోహన్ |
స్వతంత్ర | ||
1972 | అనంతుల మదన్ మోహన్ | కాంగ్రెస్ పార్టీ | |
1978 | అనంతుల మదన్ మోహన్ | కాంగ్రెస్ పార్టీ | |
1983 | అనంతుల మదన్ మోహన్ | కాంగ్రెస్ పార్టీ | |
1985 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలుగుదేశం పార్టీ | |
1989 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలుగుదేశం పార్టీ | |
1994 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలుగుదేశం పార్టీ | |
1999 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలుగుదేశం పార్టీ | |
2001 (By-Poll) | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2004 | కల్వకుంట్ల చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2004 (By-Poll) | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2008 (By-Poll) | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2009 | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2010 (By-Poll) | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2014 | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి | |
2018 | టి. హరీశ్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
2004 ఎన్నికలు సవరించు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జిల్లా శ్రీనివాస్‌పై 44668 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కె.చంద్ర శేఖరరావుకు 74287 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు 29616 ఓట్లు లభించాయి.
2004 ఉపఎన్నికలు సవరించు
2004 శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు లోక్‌సభ ఎన్నికలలో కూడా విజయం సాధించడంతో రాజీనామా చేయుటవల్ల జరిగిన ఉపఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున కె.చంద్రశేఖరరావు అల్లుడు హరీశ్ రావు పోటీచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన చెరుకు ముత్యంరెడ్డిపై 24827 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1] హరీశ్ రావుకు 64374 ఓట్లు రాగా, ముత్యంరెడ్డి 39547 ఓట్లు సాధించాడు.
2008 ఉపఎన్నికలు సవరించు
తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజానామాలతో ఏర్పడిన ఖాళీ వల జరిగిన ఉప ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెరాస తరఫున మళ్ళీ హరిశ్ రావు పోటీచేసి 58935 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజయ్యపై విజయం సాధించాడు. హరీశ్ రావుకు 76270 ఓట్లు రాగా, అంజయ్యకు 17335 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలు సవరించు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన టి.హరీష్ రావు పోటీచేయగా, భారతీయ జనతా పార్టీ నుండి విద్యాసాగర్ రావు పోటీపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున అంజయ్య, ప్రజారాజ్యం పార్టీ టికెట్టుపై నరసింహాచారి, లోక్‌సత్తా తరఫున టి.శ్రీనివాస్ పోటీచేశారు.[2]