మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ (1936 సినిమా)

ఫ్రాంక్ కాప్రా దర్శకత్వంలో 1936లో విడుదలైన అమెరికా రొమాంటిక్ కామెడీ సినిమా.

మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ 1936లో విడుదలైన అమెరికా రొమాంటిక్ కామెడీ సినిమా. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గారీ కూపర్, జీన్ ఆర్థర్ నటించారు.

మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్
Mr. Deeds Goes to Town Movie Poster.jpg
మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ 1936 సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రాంక్ కాప్రా
దృశ్య రచయితరాబర్ట్ రిస్కిన్
నిర్మాతఫ్రాంక్ కాప్రా
తారాగణంగారీ కూపర్, జీన్ ఆర్థర్
ఛాయాగ్రహణంజోసెఫ్ వాకర్
కూర్పుజీన్ హావ్లిక్
సంగీతంహోవార్డ్ జాక్సన్
నిర్మాణ
సంస్థలు
కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్, కాలిఫోర్నియా, లిమిటెడ్.
పంపిణీదారుకొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్
విడుదల తేదీ
1936 ఏప్రిల్ 16 (1936-04-16)
సినిమా నిడివి
115 నిముషాలు
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$845,710
బాక్స్ ఆఫీసుmore than $1 million[1]

కథానేపథ్యంసవరించు

1935లో ది అమెరికన్ మాగజైన్ కోసం క్లారెన్స్ బుడింగ్టన్ కెలండ్ రాసిన ఒపెరా హాట్ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది.[2][3]

నటవర్గంసవరించు

 • గ్యారీ కూపర్ (లాంగ్ ఫెలో డీడ్స్)
 • జీన్ ఆర్థర్ (లూయిస్ "బేబ్" బెన్నెట్/మేరీ డాసన్)
 • జార్జ్ బాన్‌క్రాఫ్ట్ (మాక్‌వేడ్)
 • లియోనెల్ స్టాండర్ (కార్నెలియస్ కాబ్)
 • డగ్లస్ డంబ్రిల్లే (జాన్ సెడర్)
 • రేమండ్ వాల్బర్న్ (వాల్టర్, బట్లర్)
 • హెచ్. బి. వార్నర్ (జడ్జి మే)
 • రూత్ డోన్నెల్లీ (మాబెల్ డాసన్)
 • వాల్టర్ కాట్లెట్ (మోరో, కవి)
 • జాన్ వ్రే (తీరని రైతు)
 • మార్గరెట్ సెడాన్ (జేన్)
 • మార్గరెట్ మెక్‌వేడ్ (అమీ)
 • గుస్తావ్ వాన్ సెఫెర్టిట్జ్ (డాక్టర్ ఎమిలే వాన్ హాలర్)
 • ఎమ్మా డన్ (శ్రీమతి మెరెడిత్, డీడ్స్ హౌస్ కీపర్)
 • చార్లెస్ లేన్ (హాలర్, క్రూక్ లాయర్)
 • జేమ్సన్ థామస్ (మిస్టర్ సెంపెల్)
 • మాయో మెతోట్ (శ్రీమతి సెంపెల్)
 • గ్లాడెన్ జేమ్స్ (కోర్ట్ క్లర్క్)
 • పాల్ హర్స్ట్ (1వ డిప్యూటీ)
 • వారెన్ హైమర్ (బాడీగార్డ్)

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాత, దర్శకత్వం: ఫ్రాంక్ కాప్రా
 • స్క్రీన్ ప్లే: రాబర్ట్ రిస్కిన్
 • ఆధారం: క్లారెన్స్ బుడింగ్టన్ కెలండ్ రాసిన ఒపెరా హాట్ కథ
 • సంగీతం: హోవార్డ్ జాక్సన్
 • ఛాయాగ్రహణం: జోసెఫ్ వాకర్
 • కూర్పు: జీన్ హావ్లిక్
 • నిర్మాణ సంస్థ: కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్, కాలిఫోర్నియా, లిమిటెడ్.
 • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్ కార్పొరేషన్

అవార్డులుసవరించు

సంవత్సరం అవార్డు కార్యక్రమం విభాగం నామిని ఫలితం
1937 9వ ఆస్కార్ పురస్కారాలు[4] ఉత్తమ చిత్రం కొలంబియా నామినేట్
ఉత్తమ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా విజేత
ఉత్తమ నటుడు గారీ కూపర్ నామినేట్
ఉత్తమ స్క్రీన్ ప్లే రాబర్ట్ రిస్కిన్ నామినేట్
సౌండ్ రికార్డిండ్ జాన్ పి. లివాడరి నామినేట్
1936 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్ సర్కిల్ అవార్డ్స్[5] ఉత్తమ చిత్రం మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ విజేత
ఉత్తమ నటుడు గారీ కూపర్ నామినేట్
1936 1936 నేషనల్ బోర్డ్ ఆప్ రివ్యూ అవార్డ్స్ ఉత్తమ చిత్రం మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ విజేత
ఉత్తమ పది చిత్రాలు మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ విజేత
4వ వెనీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ విదేశి చిత్రం (ముస్సోలినీ కప్) మిస్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ నామినేట్
స్పెషల్ రికమండేషన్ ఫ్రాంక్ కాప్రా విజేత

చిత్ర విశేషాలుసవరించు

 1. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం డూడ్లర్‌ గురించి చెడుగా న్యాయమూర్తి వివరిస్తారు. ఆ చిత్రంలో డూడ్లర్‌ అయిన సాక్షి మూగ. ఆ సాక్షిని తోసిపుచ్చుతూ... డూడ్లర్లు ఆలోచిస్తూ... ఇడియాటిక్‌ చిత్రాల్ని గీస్తారని, వారు అవివేకులని లాయర్‌ వాదిస్తారు. అందుకు భిన్నంగా ఆ సాక్షి తాను చూసిన దృశ్యాల్ని గీసి న్యాయస్థానంలో పెడతాడు. ఆ చిత్రాన్ని డైరెక్టర్‌ కాలిఫోర్నియాకు చెందిన ఒక డూడ్లర్‌ చేత గీయించడం విశేషం.[6]
 2. ఈ చిత్ర కథ ఆధారంగా 1964లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకునిగా దాగుడుమూతలు సినిమా రూపొందింది.

మూలాలుసవరించు

 1. "The All Time Best Sellers", International Motion Picture Almanac 1937-38 (1938)." Quigley Publishing Company. Retrieved: 19 February 2019.
 2. Poague 1975, p. 17.
 3. McBride 1992, pp. 332
 4. "The 9th Academy Awards (1937) Nominees and Winners."oscars.org. Retrieved: 23 April 2020.
 5. McBride 1992, p. 349.
 6. ప్రజాశక్తి, స్నేహ (21 September 2019). "డూడ్లర్ డూడ్స్‌..!". www.prajasakti.com. వర్థిని. Archived from the original on 23 April 2020. Retrieved 23 April 2020.

ఇతర లంకెలుసవరించు

Streaming audio

ఆధార గ్రంథాలుసవరించు