మిస్ మ్యాచ్

ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో 2019లో విడుదలైన తెలుగు సినిమా

మిస్ మ్యాచ్, 2019 డిసెంబరు 6న విడుదలైన తెలుగు సినిమా. అధీరో క్రియేటివ్ సైన్స్ బ్యానరులో జి. శ్రీరామరాజు, భరత్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ ముఖ్య పాత్రల్లో నటించగా, గిఫ్టన్ ఎలియాస్ సంగీతం సమకూర్చాడు.[1]

మిస్ మ్యాచ్
మిస్ మ్యాచ్ సినిమా పోస్టర్
దర్శకత్వంఎన్.వి. నిర్మల్ కుమార్
రచనమాటలు:
రాజేంద్ర కుమార్
మధు
స్క్రీన్ ప్లేభూపతి రాజా
కథభూపతి రాజా
నిర్మాతజి. శ్రీరామరాజు
భరత్ రామ్
తారాగణంఉదయ్ శంకర్
ఐశ్వర్య రాజేష్
ఛాయాగ్రహణంగణేష్ చంద్ర
కూర్పుఎస్.పి. రాజా సేతుపతి
సంగీతంగిఫ్టన్ ఎలియాస్
నిర్మాణ
సంస్థ
అధీరో క్రియేటివ్ సైన్స్
విడుదల తేదీs
6 డిసెంబరు, 2019
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

ఆటగదరా శివ సినిమాలో నటించిన ఉదయ్ శంకర్ సందేశాత్మక సినిమా చేయాలనుకున్నాడు. విజయ్ ఆంతోనీ నటించిన సలీం సినిమాకు ఎన్.వి. నిర్మల్ కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]

పాటలు

మార్చు
మిస్ మ్యాచ్
పాటలు by
గిఫ్టన్ ఎలియాస్
Released2019
Recorded2019
Genreసినిమా పాటలు
Length29:22
Labelలహరి మ్యూజిక్, టి-సిరీస్
Producerగిఫ్టన్ ఎలియాస్
గిఫ్టన్ ఎలియాస్ chronology
హవా
(2019)
మిస్ మ్యాచ్
(2019)
External audio
  Official Audio Jukebox యూట్యూబ్లో

ఈ సినిమాలోని పాటలను గిఫ్టన్ ఎలియాస్ స్వరపరిచాడు. 2019, నవంబరు 25న మొదటి సింగిల్, "అరేరే అరేరే" పాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదలచేశాడు.[2] తొలిప్రేమ సినిమాలోని ఈ మనసే పాటను రీమిక్స్ చేసి ఈ సినిమాలో ఉపయోగించారు.[3]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రాజాధిరాజా (రచన: సుద్దాల అశోక్ తేజ)"సుద్దాల అశోక్ తేజధనుంజయ్, సత్య యామిని, సాయిచరణ్ భాస్కరుని5:09
2."అరెరె (రచన: శ్రేష్ఠ)"శ్రేష్ఠఎంఎం మానసి5:13
3."ఈ మనసే (రిమిక్స్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిఎల్.వి. రేవంత్4:22
4."కన్నానులే కలలెన్నో (రచన: ధర్మతేజ)"ధర్మతేజహరిచరణ్6:33
5."ఈ మనసే (రిమిక్స్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" (ఫిమేల్ వర్షన్)సిరివెన్నెల సీతారామశాస్త్రిలిప్సిక, నోయల్ సియాన్4:48
6."చెర్రి జొగ్గింగు జంపింగు (రచన: చెర్రి జొగ్గింగు జంపింగు)"సుద్దాల అశోక్ తేజమోహన భోగరాజు3:17
మొత్తం నిడివి:29:22

స్పందన

మార్చు

అభిమానుల నుండి ఈ సినిమాకు అనుకూల సమీక్షలు, విమర్శకుల ప్రసంశలు వచ్చాయి.[4] హన్స్ ఇండియా పత్రిక ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చింది. "మంచి ఎంటర్టైనర్" అని పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2/5 రేటింగ్ ఇచ్చింది. "సాధారణ స్క్రిప్ట్ ను ఐశ్వర్య రాజేష్, ప్రదీప్ రావత్ తమ నటనతో సినిమాను నిలబెట్టారు" అని పేర్కొంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Mismatch is a message oriented film with healthy family content: Uday Shankar". The Times of India. 2019-12-05. Retrieved 2021-02-13.
  2. "Arere Arere, the lyrical video from MisMatch is out!". The Times of India. 2019-11-25. Retrieved 2021-02-13.
  3. https://www.newindianexpress.com/entertainment/telugu/2019/dec/05/aishwarya-rajesh-treated-me-like-a-friend-uday-shankar-2071550.html
  4. "Mis Match wins the match finally". Telangana Today. 2019-12-07. Retrieved 2021-02-13.