మీర్‌పేట్-జిల్లెలగూడ

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతం

మీర్‌పేట్-జిల్లెలగూడ అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతం, రంగారెడ్డి జిల్లాలోని ఒక నగరపాలక సంస్థ.[2][3] మీర్‌పేట్, జిల్లెలగూడ మున్సిపాలిటీల విలీనంతో మీర్‌పేట నగరపాలక సంస్థ ఏర్పడింది.[3]

మీర్‌పేట్-జిల్లెలగూడ
జిల్లెలగూడ వెంకటేశ్వర దేవాలయం
జిల్లెలగూడ వెంకటేశ్వర దేవాలయం
మీర్‌పేట్-జిల్లెలగూడ is located in Telangana
మీర్‌పేట్-జిల్లెలగూడ
మీర్‌పేట్-జిల్లెలగూడ
తెలంగాణలో ప్రాంతం
మీర్‌పేట్-జిల్లెలగూడ is located in India
మీర్‌పేట్-జిల్లెలగూడ
మీర్‌పేట్-జిల్లెలగూడ
మీర్‌పేట్-జిల్లెలగూడ (India)
Coordinates: 17°19′N 78°31′E / 17.32°N 78.52°E / 17.32; 78.52
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Typeనగరపాలక సంస్థ
 • Bodyమీర్‌పేట నగరపాలక సంస్థ
విస్తీర్ణం
 • Total4.2 కి.మీ2 (1.6 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total66,982
 • జనసాంద్రత16,000/కి.మీ2 (41,000/చ. మై.)
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
500097 (మీర్‌పేట)
500079 (జిల్లెలగూడ)
టెలిఫోన్ కోడ్040
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమహేశ్వరం శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ

వ్యుత్పత్తి శాస్త్రం

మార్చు

కుతుబ్ షాహీ రాజవంశ ఐదవ రాజైన ముహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన మీర్ మూమిన్ అస్టర్‌బాడి నిర్మించిన మీర్ మోమిన్ మసీదు కారణంగా ఈ ప్రాంతానికి మీర్‌పేట అనే పేరు వచ్చింది.

గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] మీర్‌పేటలో 12,940 జనాభా ఉంది. జనాభాలో పురుషులు 51% మంది, స్త్రీలు 49% మంది ఉన్నారు. మీర్‌పేట్ సగటు అక్షరాస్యత రేటు 63% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 71% గా, స్త్రీల అక్షరాస్యత 54%గా ఉంది. మీర్‌పేట జనాభాలో 12% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం, మీర్‌పేట్-జిల్లెలగూడలో 66,982 జనాభా ఉంది. ఇందులో 34,009 మంది పురుషులు, 32,973 మంది స్త్రీలు ఉన్నారు. ఇక్కడి మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 18,000.

పరిపాలన

మార్చు

2016 ఏప్రిల్ 11న గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా మీర్‌పేట్ మున్సిపాలిటీ, జిల్లెలగూడ మున్సిపాలిటీలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. గతంలో మీర్‌పేట్ గ్రామపంచాయతీ జిల్లెల్‌గూడ గ్రామపంచాయతీలో భాగంగా ఉండేది, తర్వాత పరిపాలనాపరంగా వేరు చేయబడింది.[5]

2019లో రెండు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పోరేషన్‌గా విలీనం చేయబడ్డాయి.[3]

రవాణా

మార్చు

తెంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం నుండి హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. దిల్ సుఖ్ నగర్, మిధాని బస్ డిపోల నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి సమీపంలోని మలక్‌పేటలో ఎంఎంటిఎస్, ఎల్బీ నగర్‌లో మెట్రో స్టేషన్లు ఉన్నాయి.

దేవాలయాలు

మార్చు

500 సంవత్సరాల నాటి మత్స్య అవతార కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Basic Information". Meerpet Corporation. Archived from the original on 2020-07-02. Retrieved 2022-12-09.
  2. "District Census Handbook – Rangareddy" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 14, 58. Retrieved 2022-12-09.
  3. 3.0 3.1 3.2 "Telangana Election Commissioner directs officials to be prepared for municipal polls". The New Indian Express. Retrieved 2022-12-09.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2022-12-09.
  5. "Five New Civic Bodies Carved out". The New Indian Express. 12 April 2016. Archived from the original on 2016-04-24. Retrieved 2022-12-09.

వెలుపలి లంకెలు

మార్చు