ముత్యమంత ముద్దు

ముత్యమంత ముద్దు 1989 లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి యండమూరి వీరేంద్రనాధ్ రచించిన ముత్యమంత ముద్దు నవల ఆధారం. ప్రేమ కంటే పెద్ద స్వార్ధం లేదని బలంగా నమ్మే విద్యాధరి, ప్రేమ కన్నా గొప్ప శక్తి లేదని నిరూపించడానికి తపస్సు చేసిన అనుదీప్. ఇలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య ప్రేమకి, ప్రేమ రాహిత్యానికి జరిగిన సంఘర్షణే సినిమా కథాంశం.

ముత్యమంత ముద్దు
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిసెట్టి
నిర్మాణం కె.ఎస్.బెనర్జీ,
కె.ఎస్.రామారావు
కథ యండమూరి వీరేంద్రనాధ్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
సీత,
మాగంటి మురళీమోహన్,
బ్రహ్మానందం,
బేతా సుధాకర్,
అన్నపూర్ణ,
దివ్యవాణి,
గొల్లపూడి మారుతీరావు,
ప్రసాద్ బాబు,
రంగనాథ్,
కాంతారావు,
నారాయణరావు
సంగీతం హంసలేఖ
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
గీతరచన వేటూరి సుందరరామమూర్తి
ఛాయాగ్రహణం లోక్‌సింగ్
నిర్మాణ సంస్థ ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విద్యాధరి (సీత) చిన్నతనంలో తన తండ్రి తల్లిని హింసించటం చూసి మగవాళ్ళ ప్రేమను నమ్మకూడదనే భావంతో ఉంటుంది. ప్రస్తుతం తను నివసించే ఇంటి యజమాని (గొల్లపూడి మారుతీరావు), అతని కొడుకు (నారాయణరావు) ప్రవర్తన కూడా తనకి మగవాళ్ళ ప్రేమ పై నమ్మకం సన్నగిల్లుతుంది. దీనికితోడు విద్యాధరి పనిచేసే ఆఫీసు యజమాని బేతా సుధాకర్ తనకు పెళ్ళి అయిన విషయం దాచి విద్యాధరిని పెళ్ళికి ప్రతిపాదిస్తాడు. ముందే యజమాని పెళ్ళి గురించి తెలిసిన విద్యాధరి సుదాకర్ను నిరాకరిస్తుంది. దేనితో బేతా సుధాకర్ విద్యాదరి పై కోపం పెంచుకుంటాడు. ఈ పరిస్థితులలో అనుదీప్ (రాజేంద్ర ప్రసాద్) అనే అపరిచితుడు విద్యదరికి బేతా సుధాకర్ పన్నిన కుట్ర నుండి సహాయం చేస్తాడు. అనుదీప్ విద్యాధరిని 7 సంవత్సరాల ముందు చూసి ప్రేమించానని, తన ప్రేమను గురుంచి పూర్తిగా తెలుసుకోవటం కోసం 7 సంవత్సరాలు వింధ్య పర్వతాలపై తపస్సు చేసానని, తద్వారా తనకి ప్రత్యేక శక్తులున్నాయని చెబుతాడు. విద్యాదరి ఈ మాటలు నమ్మదు. అనేక సందర్భాలలో అనుదీప్ తన ప్రేమ నిజమైనదని ఋజువు చేస్తాడు. అయితే విద్యదరి తన శ్రేయోభిలాషి అయిన పోలిస్ ఆఫీసర్ రంగనాథ్ మాటలతో ఏకీభవించి ఈ శక్తులన్నీ "మెస్మరిజం" అని నమ్మదు. చివరికి అనుదీప్ ఈ శక్తులు తనకు అవసరంలేదని శక్తులను వదులుకుంటాడు. తన యజమాని బేతా సుధాకర్, అతని వ్యాపార భాగస్వామి చేసే మోసాలు భయపెట్టడానికి పోలీసు ఆఫీసర్ రంగనాథ్కు సహాయంచేయటం కోసం బేతా సుధాకర్ ఇంటికివెళ్ళి ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్తులలో బేతా సుధాకర్ మరణిస్తాడు, పొలిసు కస్టడీలో ఉంటుంది. అయితే అనుదీప్ పొలిసు ఆఫీసర్ కు విద్యాదరి నిర్దోషి అని చెబుతాడు. బేతా సుధాకర్ను చంపిన అతని వ్యాపార భాగస్వామి ప్రసాద్ బాబు విద్యాదరిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. విద్యాదరిని కాపాడే క్రమంలో అనుదీప్ తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవుతాడు. అయితే విషయం తెలుసుకున్న విద్యాదరి అనుదీప్ ప్రేమ నిజమని గ్రహించి అప్పుడే మరణించాడు అనుకున్న అనుదీప్ కి ఏడుస్తూ "ఐ లవ్ యు" చెప్పి ముత్యమంత ముద్దు ఇవ్వటంతో అనుదీప్ కళ్ళు తెరుస్తాడు.

పాటలు

మార్చు
  • ప్రేమ లేఖ రాశా, నీకంది ఉంటదీ - - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • ఇచ్చుకో..ముద్దిచ్చి పుచ్చుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  • ఓ అందమా తెలుగింటి దీపమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • గొప్పింటి గోపమ్మ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,

బయటి లింకులు

మార్చు

ముత్యమంత ముద్దు పూర్తి సినిమా యుట్యూబ్ లో