మురళి తమిళ, కన్నడ సినీ నటుడు. ఆయనను అక్కడి ప్రజలు 'పురట్చి నాయకన్' గా ముద్దుగా పిలుచుకుంటారు. మురళి నాన్న సీనియర్ డైరెక్టర్ ఎస్. సిద్ధలింగయ్య. మురళి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో 70కి పైగా సినిమాల్లో నటించాడు.

మురళి
జననం
ఎస్.డి.మురళి

(1964-05-19)1964 మే 19
మరణం2010 సెప్టెంబరు 8(2010-09-08) (వయసు 46)
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1982–2010
ఎత్తు5 అ. 6 అం. (168 cమీ.)
జీవిత భాగస్వామిశోభా
(m.1987–2010)
పిల్లలుకావ్య (1988)
అథర్వ మురళీ (1989)
ఆకాష్‌ మురళి (1992)
తల్లిదండ్రులుఎస్. సిద్ధలింగయ్య
ధనలక్ష్మి
బంధువులుఎస్.డి.సురేష్ (తమ్ముడు),డేనియల్ బాలాజీ (పెద్దనాన్న కొడుకు)

జీవిత విషయాలు

మార్చు

మురళి 1964, మే 19న బెంగుళూరు లో జన్మించాడు. ఆయన తండ్రి సీనియర్ డైరెక్టర్ ఎస్. సిద్ధలింగయ్య, అమ్మ తమిళ కుటుంబానికి చెందిన వ్యక్తి. మురళికి తమ్ముడు సురేష్, చెల్లి శాంతి ఉన్నారు. ఆయన 5వ తరగతి వరకు చెన్నైలో, 6 - 10వరకు బెంగుళూరులో చదివాడు. 14 ఏళ్ల వయసులో తన తండ్రి ఎస్. సిద్ధలింగయ్య వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. కొన్నాళ్ళు ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాడు.

మురళికి ముగ్గురు పిల్లలు అథర్వ మురళి, కావ్య, ఆకాష్‌ మురళి[2]

సినీ నటుడిగా

మార్చు

మురళి 1982లో కన్నడ సినిమా "గెలువినా హిజ్జే" చిత్రం ద్వారా నటుడిగా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన కన్నడంలో ప్రేమ పర్వ, బిల్లీ గులాబీ, అజేయ, ప్రేమ గంగే, ఠాయికొట్ట తలి, సంభవామి యుగే యుగే, అజయ్ -విజయ్ చిత్రాల్లో నటించిన అనంతరం తమిళంలో తొలిసారిగా 1983లో "పూవిళ్లంగా"[3] సినిమాలో నటించాడు. ఆయన చిత్రం "పగల్ నిలవు" ద్వారా మణిరత్నం దర్శకుడిగా, రేవతి నటిగా పరిచయమయ్యారు.

ఫిల్మోగ్రఫీ

మార్చు

మురళి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

ఆయన 2010, సెప్టెంబరు 8న గుండెపోటుతో మరణించాడు.[4][1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "dinakaran". 10 February 2001. Archived from the original on 10 ఫిబ్రవరి 2001. Retrieved 20 ఏప్రిల్ 2021.
  2. Sakshi, హోం » సినిమా (19 April 2021). "హీరోగా మరో వారసుడు". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
  3. "Murali passes away". Indiaglitz. 2010-09-08. Archived from the original on 2010-09-10. Retrieved 2010-09-09.
  4. Ramya Kannan, S. R. Ashok Kumar. "Tamil actor Murali dies of heart attack". The Hindu.