ముషీరాబాద్

(ముషీరాబాదు నుండి దారిమార్పు చెందింది)

ముషీరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ఒక వాణిజ్య కేంద్రం. ఇది సెంట్రల్ జోన్, హైదరాబాదు తొమ్మిదవ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇట్టెహాదుల్ ముస్లిమీన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన నవాబ్ బహదూర్ యార్ జంగ్ ను ఈ ముషీరాబాద్‌లో ఖననం చేశారు.

ముషీరాబాద్
నగరంలోని ప్రాంతం
ముషీరాబాద్ is located in Telangana
ముషీరాబాద్
ముషీరాబాద్
Location in Telangana, India
ముషీరాబాద్ is located in India
ముషీరాబాద్
ముషీరాబాద్
ముషీరాబాద్ (India)
Coordinates: 17°25′32″N 78°30′14″E / 17.425544°N 78.503795°E / 17.425544; 78.503795
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోహైదరాబాదు
Named forనవాబ్ అరస్తు జా, ముషీర్-ఉల్-ముల్క్
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్
500020
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

చరిత్ర

మార్చు

ముషీరాబాదు మసీదుకు సంబంధించిన పాతభాగం కుతుబ్ షాహి కాలంలో నిర్మించబడింది.[1] తరువాత మసీదు, పరిసర ప్రాంతాలను నవాబ్ అరస్తు జా, ముషీర్-ఉల్-ముల్క్ (అప్పటి హైదరాబాద్ ప్రధానమంత్రి) కు ఇవ్వడంతోపాటు అతని గౌరవార్థం ముషీరాబాద్ అని పేరు పెట్టారు.[2]

2003 వరకు ఈ ప్రాంతంలో ముషీరాబాద్ జైలు ఉండేది. దానిని కూల్చివేసి అదే ప్రాంతంలో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటైన గాంధీ ఆసుపత్రి, గాంధీ వైద్య కళాశాల, నిర్మించబడ్డాయి.[3][4]

సమీప ప్రాంతాలు

మార్చు

ముషీరాబాద్ చుట్టుపక్కల చిక్కడపల్లి, రామ్‌నగర్, కవాడిగూడ, దోమల్ గూడ, అశోక్‌నగర్, బాగ్ లింగంపల్లి, గాంధీనగర్, పార్సిగుట్ట, పద్మారావునగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

నివాస - వాణిజ్య ప్రాంతం

మార్చు

ఇక్కడ అధిక సంఖ్యలో వైద్య విద్యార్థులు నివసిస్తున్నందువల్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లు, రెస్టారెంట్లు, అపార్ట్‌మెంట్లు నిర్మించబడ్డాయి. ఆసుపత్రి ఉండటం వల్ల ఇక్కడ అనేక డయాగ్నొస్టిక్ ల్యాబ్‌లు, ఫార్మసీలు తమతమ శాఖలను ఏర్పాటుచేశాయి. హైదరాబాద్ మెట్రో రైలు నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో గాంధీ వైద్య కళాశాల సమీపంలో ప్రత్యేక స్టేషన్‌ నిర్మించబడింది.

తెలంగాణ శాసనసభలోని ఎన్నికల నియోజకవర్గాలలో ఒకటైన ఈ ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం[5] ప్రాంతంలో ప్రధానంగా పట్టు చీరల వ్యాపారాలు, తోళ్ళ శుద్ధి కర్మాగారములు ఉన్నాయి.[6][7] ప్రతి ఆదివారం రోడ్డు పక్కన పాత పుస్తకాలు దుకాణాలు ఏర్పాటుచేస్తారు.[8]

ప్రసిద్ధిచెందిన నిర్మాణాలు

మార్చు

రవాణా వ్యవస్థ

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్ మీదుగా నగరంలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషను, విద్యానగర్ రైల్వే స్టేషను, జామియా ఉస్మానియా రైల్వే స్టేషనుల నుండి ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. "Hyderabad: The grandeur of Qutb mosque". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2018-06-03. Retrieved 30 June 2020.
 2. Administrator. "A History behind Street Names of Hyderabad & Secunderabad". www.knowap.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 19 జూన్ 2018. Retrieved 30 June 2020.
 3. "Gandhi Hospital begins a new era". The Hindu. 14 June 2004. Archived from the original on 18 జూన్ 2004. Retrieved 30 June 2020.
 4. V, Geetanath (9 November 2003). "No official sanction for new Gandhi Hospital complex?". The Hindu. Archived from the original on 1 జనవరి 2004. Retrieved 30 June 2020.
 5. "No delimitation to confusion". The Times of India. 20 March 2009. Archived from the original on 26 జనవరి 2013. Retrieved 30 June 2020.
 6. V. S., Krishna (15 March 2004). "Usher in the summer with cool khadis". The Hindu. Archived from the original on 7 మే 2005. Retrieved 30 June 2020.
 7. V, Geetanath (26 May 2005). "Animal skin trade rampant despite ban". The Hindu. Archived from the original on 5 జూన్ 2005. Retrieved 30 June 2020.
 8. The Hindu article on old book vending in Hyderabad.
 9. Iyer, Lalita (3 June 2018). "Hyderabad: The grandeur of Qutb mosque". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 30 June 2020.
 10. "Jamia Masjid Musheerabad, Musheerabad Mosque Hyderabad – Temples In India Information". templesinindiainfo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 July 2018. Retrieved 30 June 2020.
 11. Nanisetti, Serish (19 August 2017). "There lies a forgotten story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 30 June 2020.