మూలగుంటపాడు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండల జనగణన పట్టణం

మూలగుంటపాడు, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం లోని జనగణన పట్టణం.[2]

మూలగుంటపాడు
పటం
మూలగుంటపాడు is located in ఆంధ్రప్రదేశ్
మూలగుంటపాడు
మూలగుంటపాడు
అక్షాంశ రేఖాంశాలు: 15°17′52.800″N 80°2′2.400″E / 15.29800000°N 80.03400000°E / 15.29800000; 80.03400000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంసింగరాయకొండ
విస్తీర్ణం3.38 కి.మీ2 (1.31 చ. మై)
జనాభా
 (2011)[1]
7,145
 • జనసాంద్రత2,100/కి.మీ2 (5,500/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,650
 • స్త్రీలు3,495
 • లింగ నిష్పత్తి958
 • నివాసాలు1,858
ప్రాంతపు కోడ్+91 ( 08598 Edit this on Wikidata )
పిన్‌కోడ్523101
2011 జనగణన కోడ్591552

సమీప గ్రామాలు

మార్చు

సోమరాజుపల్లి 3.9 కి.మీ, పొందూరు 4 కి.మీ, పాకాల 4.2 కి.మీ, కలికివాయ 4.4 కి.మీ, ఎడ్లూరుపాడు 5.2 కి.మీ.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామ పంచాయతీ, రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడ్కలలో భాగంగా, 2017, ఏప్రిల్-24న విజయవాడలో నిర్వహించు ఒక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఈ పురస్కారం అందజేసెదరు.

దేవాలయాలు

మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మూలగుంటపాడు పట్టణంలో మొత్తం 1,858 కుటుంబాలు నివసిస్తున్నాయి. మూలగుంటపాడు పట్టణ మొత్తం జనాభా 7,145 అందులో పురుషులు 3,650 మంది ఉండగా, స్త్రీలు 3,495 మంది ఉన్నారు.[3] సగటు లింగ నిష్పత్తి 958.పట్టణంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 677, ఇది మొత్తం జనాభాలో 9%. 0-6 సంవత్సరాల మధ్య 365 మంది మగ పిల్లలు, 312 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 855, ఇది సగటు లింగ నిష్పత్తి (958) కంటే తక్కువ.అక్షరాస్యత రేటు 81.2%. అవిభాజ్య ప్రకాశం జిల్లాలో 63.1% అక్షరాస్యతతో పోలిస్తే మూలగుంటపాడు అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. మూలగుంటపాడులో పురుషుల అక్షరాస్యత రేటు 88.25%, స్త్రీల అక్షరాస్యత రేటు 73.92%.

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,726. ఇందులో పురుషుల సంఖ్య 2,894, మహిళల సంఖ్య 2,832, గ్రామంలో నివాస గృహాలు 1,370 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 338 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. "Villages and Towns in Singarayakonda Mandal of Prakasam, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.
  3. "Mulaguntapadu Population, Caste Data Prakasam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.

వెలుపలి లింకులు

మార్చు