మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్

(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ నుండి దారిమార్పు చెందింది)

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) తెలుగు సినిమా న‌టీన‌టుల సంక్షేమం కోసం అక్టోబర్ 4న 1993లో ఏర్పాటైన సంస్థ. మా అసోసియేష‌న్ ఏర్ప‌డిన కొత్త‌లో 150 మంది స‌భ్యులతో ఏర్పాటైంది. మా అసోసియేష‌న్‌ 2021 ఎన్నికల నాటికీ 900 మందికి పైగా శాశ్వ‌త స‌భ్యులు ఉండ‌గా, 29 మంది అసోసియేట్ స‌భ్యులు, 18 మంది సీనియ‌ర్ సిటిజ‌న్లు ఉన్నారు. వీరిలో 850 మంది యాక్టివ్ స‌భ్యులుగా ఉన్నారు.[1]

మా
(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్)
ఆవిర్భావం1993
రకంనాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్
ప్రధానకార్యాలయాలుఫిల్మ్ నగర్, హైదరాబాద్, తెలంగాణ
స్థానంఇండియా
సభ్యత్వం900+
అధికార భాషలుతెలుగు
ప్రెసిడెంట్మంచు విష్ణు
జనరల్ సెక్రటరీరఘుబాబు
వైస్ ప్రెసిడెంట్మాదాల రవి
కోశాధికారిశివ బాలాజీ
జాలగూడుhttp://maa.asia/

మా ఉద్దేశము

మార్చు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (ఆంగలం: Movie Artists Association) ఏర్పాటైన ప్రధాన కారణం నటీనటులకు సంబంధించిన పారితోషికాలు, దర్శక నిర్మాతలతో వివాదాలు, సభ్యుల సంక్షేమాన్ని చూసుకోవడం. నిర్మాతలెవరైనా నటీనటులకు పారితోషకం ఇవ్వకపోయినా, దర్శక నిర్మాతలకు నటీనటులకు గొడవలు జరిగినా మా జోక్యం చేసుకుని వాటిని పరిష్కరిస్తుంది. నిరుపేద కళాకారులు, వృద్ధ కళాకారుల ఆరోగ్యం కోసం సహాయం చేయడం, అవకాశాలు లేని వారికి సినిమా అవకాశాలు ఇప్పించడం కోసం ఏర్పాటైంది.

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షులు

మార్చు

ఇవి కూడా చదవండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Namasthe Telangana (10 October 2021). "మా ఎప్పుడు ఏర్పాటైంది? గ‌తంలో ఎన్నిక‌లు ఇలాగే జ‌రిగేవా?". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  2. The Hindu (18 April 2015). "Rajendra Prasad is MAA president" (in Indian English). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  3. The Times of India (11 March 2019). "Movie Artists Association (MAA) Elections Results 2019: Naresh gets a clear majority, defeats Sivaji Raja-led panel" (in ఇంగ్లీష్). Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.
  4. TV9 Telugu (10 October 2021). "'మా' అధ్యక్షుడుగా విష్ణు గెలుపు.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. BBC News తెలుగు (10 October 2021). "మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం". Archived from the original on 11 October 2021. Retrieved 11 October 2021.