మెరుపు కలలు రాజీవ్ మీనన్ దర్శకత్వంలో నిర్మితమై 1997లో విడుదలైన తమిళ డబ్బింగ్ ముక్కోణపు ప్రేమకథాచిత్రం. చిత్రంలో అరవింద్ స్వామి, ప్రభుదేవా, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా, గిరీష్ కర్నాడ్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వి.కె.రామస్వామి, నాజర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమాకు పాటలు, నేపథ్యసంగీతం ఎ.ఆర్.రెహమాన్ సమకూర్చారు.

మెరుపుకలలు
మెరుపు కలలు చిత్ర ప్రచార చిత్రం
దర్శకత్వంరాజీవ్ మీనన్
స్క్రీన్ ప్లేరాజీవ్ మీనన్
వి.సి. గుహనాథన్
కథరాజీవ్ మీనన్
నిర్మాత
  • ఎం.శరవణన్
  • ఎం.బాలసుబ్రహ్మణ్యన్
  • ఎం.ఎస్.గుహన్
తారాగణం
ఛాయాగ్రహణంవేణు
రవి.కె.చంద్రన్
కూర్పుసురేష్ అర్స్
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
14 జనవరి 1997 (1997-01-14)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రియా అమల్ రాజ్ (కాజోల్) చాలా చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోతుంది. అయినా కూడా అందరితో చాలా కలివిడిగానూ, స్నేహంగానూ ఉంటుంది. ఆమెను కన్నతండ్రి అమల్ రాజ్ (గిరీష్ కర్నాడ్) కంటికి రెప్పలా పెంచుతాడు. చిన్నప్పటి నుండి ప్రియకు సంగీతంలోనూ, పాటలు పాడటంలోనూ, చర్చికి సంబంధించిన వ్యవహారాలలోనూ చాలా ఆసక్తి.

ధామస్ తంగదురై (అరవింద్‌ స్వామి) ఒక ఒద్దికైన, గౌరవప్రదమైన యువ వ్యాపారవేత్త. తన తండ్రి జేమ్స్ తంగదురై (ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) వ్యాపార వ్యవహారాలను చూసుకోవడానికి అమెరికా నుండి భారత్ తిరిగి వస్తాడు. గతంలో జేమ్స్ తంగదురై, అమల్ రాజ్ లు వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు. తర్వాత విడిపోయి అమల్‌రాజ్ కర్మాగారమునకు ఎదురుగానే జేమ్స్ తంగదురై తన స్వంత కర్మాగారాన్ని ప్రారంభిస్తాడు. తన కుమారుడు ధామస్ తంగదురై సాధించిన విజయాలను అతడు గొప్పగా చెబుతుంటాడు. ఈ వైఖరి అమల్ రాజ్ కు నచ్చదు. ధామస్, ప్రియలు చిన్నప్పుడే ఒకరి కొకరు పరిచయమౌతారు. కానీ పెద్దయ్యాక వారిమధ్య చిన్నప్పటి చనువు ఉండదు.

మేనత్త మదర్ సుపీరియర్ (అరుంధతీ నాగ్) ను కలవడానికి ఉమెన్స్ హాస్టల్ వెళ్ళిన ధామస్ అక్కడ ప్రియను చూస్తాడు. తన మేనత్త పుట్టినరోజు వేడుకను ఆమెకు తెలియకుండా జరిపే క్రమంలో ప్రియ సహాయాన్ని తీసుకుంటాడు. ఈ క్రమంలో అమెను ఆరాధించడం ప్రారంభిస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరచడానికి భయపడుతాడు. తన ప్రేమ వలన ప్రియ స్నేహం కూడా దూరమవుతుందని లోలోపల మధనపడుతుంటాడు.

ప్రియ చిన్నప్పటి నుండి కాన్వెంట్ పాఠశాలలో చదవడం వల్ల క్రైస్తవ మతం పట్ల ఆసక్తిని పెంచుకుంటుంది. తను పెద్దయ్యాక సన్యాసినిగా మారి సమాజానికి సేవ చేయాలని అభిలషిస్తుంది. ఇది ప్రియ తండ్రికి ఇష్టం ఉండదు. ఎలాగైనా తన కుమార్తె మనసును వివాహ బంధం వైపు మరల్చాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని సంబంధాలు (ప్రకాష్ రాజ్, రణ్‌వీర్ సింగ్) కూడా చూస్తాడు. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. ఇది ఇలా ఉండగా ధామస్ స్నేహితుడు శివ, ధామస్ ని తన స్నేహితుడు, కేశాలంకరణ నిపుణుడైన దేవా (ప్రభుదేవా) ని పరిచయం చేస్తాడు. దేవాకు ఆడవారి మనసులను చదివి వారి అభీష్టాలను, ఇష్టాఇష్టాలను మార్చే నైపుణ్యం ఉన్నదని తెలుసుకున్న ధామస్, ఎలాగైనా అతడిని ప్రియ మనసు మార్చి వివాహం పట్ల ఆసక్తిని కలిగింఛమని, అందులు తను డబ్బు సహాయం చేస్తానని కోరతాడు.

ఒక సందర్భంలో ప్రియ , దేవా సంగీత బృందంతో కలిసి పాడుతుంది. ఆ ప్రదర్శనకు మంచి పేరు రావడంతో తమ బృందంతో కలిసి పనిచేయమని ప్రియని దేవా అభ్యర్థిస్తాడు. సినిమా లకు ఎంపికవ్వాలనే తమ సంగీతబృందం కోరిక తీరాలంటే ప్రియ సహకారం అవసరమని దేవా అభ్యర్థించడంతో వారితో కలిసి పని చేయడానికి ప్రియ అంగీకరిస్తుంది. అప్పటి నుండి దేవా, అతని బృంద సభ్యులు (నాజర్) కలిసి ఎలాగైనా ధామస్ పట్ల ప్రియ ని ఆకర్షితులు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తమకు తెలియకుండానే దేవా, ప్రియ పరస్పరం ప్రేమలో పడిపోతారు.

ఈ సందర్భంలో ధామస్ తన ప్రేమను ప్రియకు వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా ప్రియ మనసును గెలుచుకోవడానికి దేవా సహాయం తీసుకున్నట్లుగా కూడా చెబుతాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియ మనస్సు విరిగిపోతుంది. సన్యాసం తీసుకోవడానికి సిద్దపడి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. చివరికి విషయం తెలుసుకున్న ధామస్ , ప్రియ ప్రేమ కోసం తన ప్రేమను త్యాగం చేస్తాడు. మేనత్త సహకారంతో ప్రియ ను దేవాతో వివాహానికి ఒప్పిస్తాడు. తను మాత్రం జీవితాంతం బ్రహ్మచారిగా సన్యాసం తీసుకుని ఫాదర్ గా కొత్త బాధ్యతలు తీసుకుంటాడు.

తారాగణం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్ర సంగీతం మంచి విజయం సాధించింది. విడుదలైన అన్ని భాషలలో ఈ చిత్ర గీతాలు శ్రోతల అభిమానాన్ని చూరగొన్నాయి. ముఖ్యంగా వెన్నెలవే వెన్నెలవే అన్న పాట, ఓ వాన పడితే.. ఆ కొండ కోన హాయి... ఈరోజుకు కూడా అత్యంత ఆదరణ పొందినవి.

అన్ని పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి, ఈ చిత్రం లోని అన్ని పాటలు స్వరపరిచి సంగీతం అందించింది ఎ. ఆర్. రెహమాన్.

క్రమసంఖ్య పేరుపాడినవారు నిడివి
1. "వెన్నెలవే వెన్నెలవే"  హరిహరన్, సాధనా సర్గం 5:58
2. "వెన్నెలవే వెన్నెలవే (రెండవ భాగము)"  శంకర్ మహదేవన్, కవితా పౌడ్వాల్ 1:45
3. "ఓ వాన పడితే.. ఆ కొండ కోన హాయి..."  సుజాత, మలేసియా వాసుదేవన్ 6:47
4. "ఊ లలల్లా... మచిలీ పట్నం మావిడి"  ఉన్ని మీనన్, కె. ఎస్. చిత్ర, శ్రీనివాస్ (గాయకుడు) 5:53
5. "తల్లో తమర"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాల్గుడి శుభ 4:58
6. "స్ట్రాబెరీ కనులే"  కెకె, ఫెబి మణి 4:25
7. "అపరంజి మదనుడి"  అనురాధ శ్రీరామ్ 3:33

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు