మాల్గాడి శుభ
మాల్గాడి శుభగా ప్రసిద్ధి చెందిన మాల్గుడి శుభ ఒక పాప్ గాయని, భారతీయ సినిమా నేపథ్య గాయని. 2000లో విడుదలైన చిక్‌పక్ చిక్‌భం అనే ప్రైవేటు ఆల్బమ్‌లో ఈమె పాడిన "మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడ వచ్చినా" పాట బంపర్ హిట్ కావడంతో ఈమె పేరు మాల్గాడి శుభగా స్థిరపడి పోయింది.
శుభ | |
---|---|
నివాస ప్రాంతం | చెన్నై |
వృత్తి | భారతీయ చలనచిత్ర నేపథ్య గాయని |
క్రియాశీలక సంవత్సరాలు | 1992 నుండి ప్రస్తుతం |
మతం | హిందూ మతం |
విశేషాలు
మార్చుతమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరుకు చెందిన శుభ ముంబాయిలో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. ఢిల్లీ లోని హోటల్ అశోకాలో పాటలు పాడటం ద్వారా పాప్ గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది. ఉషా ఉతుప్ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను కోల్‌కాతాకు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో చెన్నైలో స్థిరపడింది.[1] దక్షిణ భారత నటి ప్రియమణి ఈవిడ మేనకోడలు.
గాయనిగా
మార్చుఈమె సెట్ మీ ఫ్రీ, చిక్ పక్ చిక్ భం, సునేరె నాచేరె, ఆటం కొండాట్టం మొదలైన ప్రైవేటు ఆల్బమ్‌లు చేసింది. తెలంగాణ యాసలో రాజ్ కోటి సంగీతంలో వెలువడిన చిక్ పక్ చిక్ బం ఆల్బం పదహారు లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఈమె ఇంకా భక్తి గీతాలు, నర్సరీ రైమ్స్ పాడింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల చలనచిత్రాలలో 3000కు పైగా పాటలు పాడింది.
తెలుగు సినిమా పాటల జాబితా
మార్చుఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
సంవత్సరం | సినిమా పేరు | పాట | సంగీతం | సాహిత్యం | సహ గాయకులు |
---|---|---|---|---|---|
1992 | అలెగ్జాండర్ | వల వేసి పట్టేది వాడే గురి చూసి కొట్టేది వాడే | రాజ్ కోటి | భువనచంద్ర | |
1992 | అలెగ్జాండర్ | హేపీ హేపీ హేపీ హేపీ తేరా పాపి | రాజ్ కోటి | భువనచంద్ర | |
1993 | అక్కాచెల్లెళ్లు | కొక్కోకోలా కొక్కో కోలా నీకోడి నా డిస్కో కోలా | శ్రీ | వేటూరి | మనో |
1993 | జెంటిల్ మేన్ | ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా | ఎ.ఆర్.రెహమాన్ | రాజశ్రీ | సాహుల్ హమీద్, స్వర్ణలత |
1993 | రక్షణ | నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను | ఎం.ఎం.కీరవాణి | సిరివెన్నెల సీతారామశాస్త్రి | |
1994 | గోవిందా గోవిందా | అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో... | రాజ్ కోటి | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
1996 | అప్పాజి | మమ్ము సాప్ప మమ్ము సాప్ప | ఎం.ఎం.కీరవాణి | వెన్నెలకంటి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
1996 | ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..? | ఇప్పసారా తాగి ఈడు | తేజ | భారతీబాబు | |
1997 | గోకులంలో సీత | తళక్ తళక్ అని తళకుల తార | కోటి | వేటూరి | చిత్ర |
1997 | గోకులంలో సీత | హే పాప దిల్ దేదే పాప | కోటి | వేటూరి | మనో |
1997 | చిన్నబ్బాయి | వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట | ఇళయరాజా | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
1998 | పెళ్ళి కానుక | సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల | ఎం.ఎం.కీరవాణి | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
1999 | హలో ప్రేమిస్తావా | క్యాంపన్‌లో ర్యాగింగ్ | వి.మనోహర్ | భారతీబాబు | బృందం |
2010 | కొమరం పులి | పిచ్చి కుచ్చి | ఎ.ఆర్.రెహమాన్ | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, మధుశ్రీ |
2012 | జులాయి | పకడో... ఓ... పకడో... ఓ... పకడో పకడో పకడో పకడో | దేవిశ్రీ ప్రసాద్ | రామజోగయ్య శాస్త్రి | దేవీశ్రీ ప్రసాద్ |
2013 | అత్తారింటికి దారేది | ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే | దేవిశ్రీ ప్రసాద్ | రామజోగయ్య శాస్త్రి | డేవిడ్ సిమోన్ బృందం |
మూలాలు
మార్చు- ↑ సుధీష్, కామత్ (7 October 2001). "'Aatam Kondattam' is her style". ది హిందూ. Retrieved 25 March 2017.
బయటిలింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాల్గాడి శుభ పేజీ