మెరుపు వీరుడు

మెరుపు వీరుడు 1970, మార్చి 6వ తేదీ విడుదలైన తెలుగు జానపద చిత్రం. దీనిలో కాంతారావు మొదటిసారి ద్విపాత్రాభినయం చేశాడు.

మెరుపు వీరుడు
(1970 తెలుగు సినిమా)
Merupu veerudu.jpg
దర్శకత్వం బి.హరినారాయణ
తారాగణం కాంతారావు,
రాజశ్రీ
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ అజంతా మూవీస్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • నిర్మాతలు: బి.వి.కృష్ణమూర్తి, కె.మహేంద్ర
 • దర్శకత్వం, కూర్పు: బి.హరినారాయణ
 • ఛాయాగ్రహణం: ఎస్.జె.థామస్
 • సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
 • పాటలు: దాశరథి, కొసరాజు, జి.కృష్ణమూర్తి, నల్లరామమూర్తి
 • కథ, మాటలు: జి.కృష్ణమూర్తి
 • నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి, నల్లరామమూర్తి, స్వర్ణలత, గిరిజ
 • పోరాటాలు: ఎ.ఆర్.బాషా
 • కళ: అనంతరాం, కె.నరసింహారావు
 • నృత్యం: వెంపటి సత్యం

కథాసంగ్రహంసవరించు

మెరుపువీరుడు కవలల కథ. ఒకడు రాజుగారి తమ్ముడి దగ్గర, మరొకడు అడవిలో పెరుగుతారు. పెద్దయ్యాక అడవిలోని తమ్ముడు అనుకోకుండా రాజమందిరంలోని అన్న స్థానాన్ని ఆక్రమించుకుని దుష్టుడైన పినతండ్రి, పినతండ్రి కొడుకుల ఆటలు కట్టిస్తాడు. కవలలలో ఒకడు కొండజాతి అమ్మాయిని, ఇంకొకడు మేనమామ కూతుర్ని పెళ్లాడుతారు[1].

పాటలుసవరించు

 • సైరా నారాజా కాసుకో మన దెబ్బ జోరు చూస్తావా?
 • పడుసు పిల్ల పస చూడు
 • చెంచులక్ష్మి వీధి భాగవతం - రచన, గానం:నల్లరామమూర్తి

మూలాలుసవరించు

 1. వీరాజీ (13 March 1970). "చిత్రసమీక్ష:మెరుపువీరుడు". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 6 August 2020.[permanent dead link]

బయటిలింకులుసవరించు