మేఘా-ట్రోపిక్స్
శీతోష్ణస్థితి మార్పుల నేపథ్యంలో, ఉష్ణమండల వాతావరణంలో నీటి చక్రాన్ని అధ్యయనం చేసే ఉపగ్రహం, మేఘా-ట్రోపిక్స్.[3] భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), ఫ్రెంచి అంతరిక్ష సంస్థ సెంటర్ నేషనల్ డి ఎటూడ్స్ స్పేషియల్స్ (సిఎన్‌ఇఎస్) లు ఉమ్మడిగా చేపట్టిన అధ్యయనం ఇది. మేఘా-ట్రోపిక్స్‌ను 2011 అక్టోబరులో పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
మిషన్ రకం | వాతావరణ పరిశీలన |
---|---|
ఆపరేటర్ | ఇస్రో/CNES |
COSPAR ID | 2011-058A |
SATCAT no. | 37838 |
మిషన్ వ్యవధి | అంచనా: 3 ఏళ్ళు అంతిమంగా: 10 ఏళ్ళ, 5 నెలలు |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 1,000 కిలోగ్రాములు (2,205 పౌ.) |
శక్తి | 1325 W[1] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 12 October 2011 |
రాకెట్ | PSLV-CA C18 |
లాంచ్ సైట్ | సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం |
కాంట్రాక్టర్ | ఇస్రో |
మిషన్ ముగింపు | |
పారవేయడం | జీవితాంతాన పనిలోంచి తప్పించారు |
డియాక్టివేట్ చేయబడింది | 2022 ఏప్రిల్ |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
సెమీ మేజర్ ఆక్సిస్ | 7,238.45 కిలోమీటర్లు (4,497.76 మై.)[2] |
విపరీతత్వం | 0.0009922[2] |
Perigee altitude | 860 కిలోమీటర్లు (530 మై.)[2] |
Apogee altitude | 874 కిలోమీటర్లు (543 మై.)[2] |
వాలు | 19.98 డిగ్రీలు[2] |
వ్యవధి | 102.15 నిమిషాలు[2] |
ఎపోచ్ | 2015 జనవరి 25, 01:35:41 UTC[2] |
మేఘా-ట్రోపిక్స్ ప్రణాళిక అనుకున్నాక, 2003 లో దాన్ని రద్దు చేసారు. అయితే, భారతదేశం తన వాటా సహకారాన్ని పెంచడం, మొత్తం ఖర్చులు తగ్గించడం వంటివి చేసుకుని 2004 లో దీన్ని పునరుద్ధరించారు.[4][5] GEWEX (గ్లోబల్ ఎనర్జీ అండ్ వాటర్ సైకిల్ ఎక్స్‌పెరిమెంట్) సాధించిన పురోగతితో, ఉష్ణమండల వాతావరణం లోని నీరు, శక్తిల బడ్జెట్‌పై విశ్వసనీయమైన గణాంకాలను సేకరించాక, ఉష్ణమండల వాతావరణ శీతోష్ణస్థితి ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి మేఘా-ట్రోపిక్స్‌ను రూపొందించారు.[6] మేఘా-ట్రోపిక్స్ అప్పటికే ఉన్న ప్రాంతీయ రుతుపవన ప్రాజెక్టులైన మహాశ్రీ (MAHASRI), గేమ్ (GAME) ప్రాజెక్టులకు అదనంగా చేరింది.[7][8] ప్రధాన ఉష్ణమండల వాతావరణ వ్యవస్థల పరిణామాన్ని వివరించడానికి కూడా మేఘా-ట్రోపిక్స్ ప్రయత్నించింది.[9]
ప్రారంభం
మార్చుమేఘా-ట్రోపిక్స్ ఉపగ్రహాన్ని ఇస్రో, 2011 అక్టోబరు 12 న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C18) ద్వారా భూమధ్యరేఖకు 20 డిగ్రీల వంపుతో, 867 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్య లోకి విజయవంతంగా ప్రక్షేపించింది.[10] PSLV-C18ని ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఉదయం 11:00 గంటలకు మరో మూడు సూక్ష్మ ఉపగ్రహాలతో పాటు కక్ష్యలో చేర్చారు. ఈ సూక్ష్మ ఉపగ్రహాలు: చెన్నైలోని SRM విశ్వవిద్యాలయంచే నిర్మించిన 10.9 కేజీల SRMSAT, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ (IIT కాన్పూర్) వారి 3 కేజీల రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం జుగ్ను, సముద్రంలో ఓడలను గుర్తించడానికి ఉపయోగించే లక్సెంబర్గ్‌కు చెందిన 28.7 కేజీల వెసెల్‌శాట్-1[11][12]
మిషన్ ముగింపు
మార్చుమేఘా ట్రోపిక్స్ అసలు జీవిత కాలం మూడు సంవత్సరాలు. 2015 మే 26 న దీన్ని రెండు సంవత్సరాల పాటు పొడిగించారు.[13] 2016 అక్టోబరు 7 న మరో నాలుగు సంవత్సరాలు పొడిగించారు.[14]
2022 ఏప్రిల్లో, యాటిట్యూడ్ కంట్రోల్ సబ్-సిస్టమ్‌లో సమస్యల కారణంగా ఉపగ్రహం జీవిత కాలాన్ని ముగిస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. మేఘా-ట్రోపిక్స్ ప్రస్తుతం 870 కి.మీ కక్ష్యలో ఉంది. భూమిపైకి కూల్చివేయడానికి అనువుగా ఉపగ్రహం ఎత్తును 300 కి.మీ.కి తగ్గిస్తారు.[15]
కూల్చివేత
మార్చుఇస్రో, మేఘా-ట్రోపిక్స్‌ను కక్ష్య నుండి తప్పించి భూ వాతావరణం లోకి ప్రవేశపెట్టి, భూమిపై కూలిపోయేలా నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. 2023 మార్చి 7 న సాయంత్రం 4:30 - 7 :30 మధ్య, పసిఫిక్ మహాసముద్రంలో దాన్ని కూల్చివేసేలా ఇస్రో నియంత్రిస్తోంది.[16] అనుకున్న విధంగానే ఈ ఉపగ్రహం భూ వాతావరణం లోకి ప్రవేశించి పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. [17] ఉపగ్రహం లోని థ్రస్టర్లను మండించి కక్ష్యను మరింత తగ్గించి అది భూవాతావరణం లోకి ప్రవేశించేలా చేసారు. అక్కడ అది విచ్ఛిన్నమై పోయి, ఆ శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయాయి. భూమిని తాకే సమయానికి పెద్ద శకలాలేమీ మిగల్లేదని ఇస్రో ప్రకటించింది.[18]
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Megha-Tropiques (Meteorological LEO Observations in the Intertropical Zone)". eoPortal. ESA. 2020. Retrieved 8 April 2022.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "MEGHA-TROPIQUES Satellite details 2011-058A NORAD 37838". N2YO. 25 January 2015. Retrieved 25 January 2015.
- ↑ Mission description Archived 2012-02-13 at the Wayback Machine. MEGHA-TROPIQUES: water cycle in the tropical atmosphere in the context of climate change.(Access date 06-21-2008)
- ↑ India and France Resurrect, Redesign Megha-Tropiques Mission Archived 2009-04-05 at the Wayback Machine, PETER B. de SELDING And K.S. JAYARAMAN. 24 February 2004
- ↑ ISRO and French Space Agency, CNES, Sign MOU on Megha-Tropiques Satellite Mission Archived 2008-05-17 at the Wayback Machine November 12, 2004
- ↑ "About GEWEX". Gewex.org. Archived from the original on 2015-04-07. Retrieved 2010-12-05.
- ↑ "Monsoon Asian Hydro-Atmosphere Scientific Research and Prediction Initiative". Mahasri.cr.chiba-u.ac.jp. Archived from the original on 2011-07-22. Retrieved 2010-12-05.
- ↑ "GEWEX Asian Monsoon Experiment". Hyarc.nagoya-u.ac.jp. Retrieved 2010-12-05.
- ↑ "Launch Info". Spacemart.com. Retrieved 2010-12-05.
- ↑ "Welcome to ISRO :: Satellites :: Earth Observation Satellite :: Megha-Tropiques". Archived from the original on 2011-10-15. Retrieved 2011-10-17.
- ↑ "ISRO launches Megha-Tropiques satellite to study monsoon".
- ↑ "PSLV-C18 carrying weather satellite launched - The Times of India". The Times Of India.
- ↑ "Mission Megha-Tropiques". Megha-tropiques (in ఇంగ్లీష్). 2015-05-26. Retrieved 2022-04-08.
- ↑ "France-India space cooperation - Four more years for emblematic Megha-Tropiques climate space mission". presse.cnes.fr (in ఇంగ్లీష్). 2016-10-07. Retrieved 2022-04-08.
- ↑ Kumar, Chethan (7 April 2022). "After over 10 years, it's end of mission for Indo-French sat Megha-Tropiques". The Times of India. Retrieved 8 April 2022.
- ↑ "Isro: మరికొద్ది గంటల్లో ఆకాశంలో ఉత్కంఠ దృశ్యం.. పెను సవాల్‌కు ఇస్రో సై." EENADU. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
- ↑ "మరోసారి ఇస్రో సత్తా". EENADU. Archived from the original on 2023-03-08. Retrieved 2023-03-08.
- ↑ "Megha-Trqopiques-1 (MT1) Controlled Re-entry Successful and impacted on the Pacific Ocean". www.isro.gov.in. Archived from the original on 2023-03-08. Retrieved 2023-03-08.