ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ లేదా ఇన్సాట్ అనేది టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్, వాతావరణ శాస్త్రం, శోధన, రెస్క్యూ కార్యకలాపాలలో తోడ్పడడానికి ఇస్రో ప్రారంభించిన బహుళార్ధసాధక భూస్థిర ఉపగ్రహాల శ్రేణి. 1983లో మొదలైన ఈ ఇన్సాట్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అతిపెద్ద దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఇండియా మెటీరోలాజికల్ డిపార్ట్‌మెంట్, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌ల సంయుక్త కార్యక్రమం. ఇన్సాట్ మొత్తం సమన్వయం, నిర్వహణ సెక్రటరీ-స్థాయి ఇన్సాట్ కోఆర్డినేషన్ కమిటీ చేస్తుంది.

INSAT 1B
ఇన్సాట్ 1బి

భారతదేశ టెలివిజన్, సమాచార ప్రసార అవసరాలను తీర్చడానికి ఇన్‌శాట్ ఉపగ్రహాలలో వివిధ బ్యాండ్‌లలో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. వాతావరణ ఇమేజింగ్ కోసం కొన్ని ఉపగ్రహాల్లో వెరీ హై రిజల్యూషన్ రేడియోమీటర్ (VHRR), CCD కెమెరాలు కూడా ఉన్నాయి. ISRO Cospas-Sarsat ప్రోగ్రామ్‌లో సభ్యులు కాబట్టి, దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శోధన, రెస్క్యూ మిషన్‌ల కోసం డిస్ట్రెస్ అలర్ట్ సిగ్నల్‌లను స్వీకరించడానికి కూడా ఈ ఉపగ్రహాల్లో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి.

ఇన్‌శాట్ వ్యవస్థ మార్చు

 
ఇన్‌శాట్-1B ఉపగ్రహం: భారతదేశంలో ప్రసార రంగం ఇన్‌శాట్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి ఉంది.

1983 ఆగస్టులో ఇన్‌శాట్-1B ప్రయోగంతో ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్‌శాట్) సిస్టమ్ మొదలైంది. మొదటి ఉపగ్రహం ఇన్‌శాట్-1A ను 1982 ఏప్రిల్లో ప్రయోగించినప్పటికీ, ఆ ప్రయోగం విఫలమైంది. ఇన్‌శాట్ వ్యవస్థ భారతదేశపు టెలివిజన్, రేడియో ప్రసారాలు, టెలికమ్యూనికేషన్స్, వాతావరణ రంగాలలో విప్లవానికి నాంది పలికింది. ఇది దూర ప్రాంతాలకు, ఆఫ్-షోర్ ద్వీపాలకు కూడా టీవీ, ఆధునిక టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను వేగంగా విస్తరించడానికి వీలు కల్పించింది. మొత్తంగా, వివిధ రకాల కమ్యూనికేషన్ సేవల కోసం ఈ వ్యవస్థలో C, ఎక్స్‌టెండెడ్ C, K u బ్యాండ్‌లలో ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. కొన్ని ఇన్సాట్‌లలో వాతావరణ పరిశీలన, వాతావరణ సేవలను అందించడానికి డేటా రిలే కోసం కూడా పరికరాలు ఉన్నాయి. కల్పన-1 ఒక ప్రత్యేకమైన వాతావరణ ఉపగ్రహం. హాసన్, భోపాల్‌లో ఉన్న మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీల ద్వారా ఈ ఉపగ్రహాలను పర్యవేక్షిస్తారు.

సేవలో ఉన్న ఉపగ్రహాలు మార్చు

ఇన్సాట్ ప్రోగ్రామ్‌లో ప్రయోగించబడిన 24 ఉపగ్రహాలలో 11 ఇప్పటికీ పనిచేస్తున్నాయి. [1]

జీశాట్ శ్రేణి మార్చు

జీశాట్ ఉపగ్రహాలు భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన సమాచార ఉపగ్రహాలు. ఇవి సైనిక, పౌర వినియోగదారుల కోసం డిజిటల్ ఆడియో, డేటా, వీడియో ప్రసారాలకు ఉపయోగపడతాయి. 2018 నవంబరు నాటికి, ఇస్రో 19 జీశాట్ ఉపగ్రహాలను ప్రయోగించగా, వాటిలో 15 ఉపగ్రహాలు ప్రస్తుతం సేవలో ఉన్నాయి.

వాణిజ్య సమాచార ఉపగ్రహం మార్చు

  • ExseedSat-1 అనేది శాటిలైజ్ సంస్థ (గతంలో ఎక్సీడ్ స్పేస్ అని పిలిచేవారు) తయారు చేసిన మొదటి భారతీయ వాణిజ్య ఉపగ్రహం. ఇది 2018 డిసెంబరు 6 న [2] SpaceX ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహం.
  • ExseedSat-2 (AISAT) పిఎస్‌ఎల్‌వి-C45 ద్వారా ప్రయోగించిన Amsat భారతదేశం కోసం నిర్మించిన రెండవ భారతీయ వాణిజ్య ఉపగ్రహం. [3]

భారతీయ కమ్యూనికేషన్ ఉపగ్రహాల లాంచ్ లాగ్ మార్చు

Serial No. ఉపగ్రహం ప్రయోగ తేదీ ప్రయోగ వాహనం స్థితి
1 ఇన్‌శాట్-1A 10 ఏప్రిల్ 1982 Delta కక్ష్యలో విఫలమైంది
2 ఇన్‌శాట్-1B 30 ఆగస్టు 1983 Shuttle PAM-D పని ముగించింది
3 ఇన్‌శాట్-1C 22 జూలై 1988 ఏరియేన్-3 కక్ష్యలో పాక్షికంగా విఫలమైంది
4 ఇన్‌శాట్-1D 12 జూన్ 1990 Delta పని ముగించింది
5 ఇన్‌శాట్-2A 10 జూలై 1992 ఏరియేన్-4 పని ముగించింది
6 ఇన్‌శాట్-2B 23 జూలై 1993 ఏరియేన్-4 పని ముగించింది
7 ఇన్‌శాట్-2C 7 డిసెంబరు 1995 ఏరియేన్-4 పని ముగించింది
8 ఇన్‌శాట్-2D 4 జూన్ 1997 ఏరియేన్-4 కక్ష్యలో విఫలమైంది
9 ఇన్‌శాట్-2E 3 ఏప్రిల్ 1999 ఏరియేన్-4 పని ముగించింది
10 ఇన్‌శాట్-3B 22 మార్చి 2020 ఏరియేన్-5 పని ముగించింది
11 జీశాట్-1 18 ఏప్రిల్ 2001 జిఎస్‌ఎల్‌వి పని ముగించింది
12 ఇన్‌శాట్-3C 24 జనవరి 2002 ఏరియేన్-5 పని ముగించింది
13 KALPANA-1 12 సెప్టెంబరు 2002 పిఎస్‌ఎల్‌వి పని ముగించింది
14 ఇన్‌శాట్-3A 10 ఏప్రిల్ 2003 ఏరియేన్-5 పని ముగించింది
15 జీశాట్-2 8 మే 2003 జిఎస్‌ఎల్‌వి
16 ఇన్‌శాట్-3E 28 సెప్టెంబరు 2003 ఏరియేన్-5
17 EDUSAT 20 సెప్టెంబరు 2004 జిఎస్‌ఎల్‌వి పని ముగించింది
18 HAMSAT 5 మే 2005 పిఎస్‌ఎల్‌వి
19 ఇన్‌శాట్-4A 22 డిసెంబరు 2005 ఏరియేన్-5
20 ఇన్‌శాట్-4C 10 జూలై 2006 జిఎస్‌ఎల్‌వి ప్రయోగం సఫలం
21 ఇన్‌శాట్-4B 12 మార్చి 2007 ఏరియేన్-5 పని ముగించింది
22 ఇన్‌శాట్-4CR 2 సెప్టెంబరు 2007 జిఎస్‌ఎల్‌వి
23 జీశాట్-4 15 ఏప్రిల్ 2010 జిఎస్‌ఎల్‌వి ప్రయోగం సఫలం
24 జీశాట్-5P 25 డిసెంబరు 2010 జిఎస్‌ఎల్‌వి-F06 ప్రయోగం సఫలం
25 జీశాట్-8 21 మే 2011 ఏరియేన్-5
26 జీశాట్-12 15 జూలై 2011 పిఎస్‌ఎల్‌వి-C17
27 జీశాట్-10 29 సెప్టెంబరు 2012 ఏరియేన్-5
28 జీశాట్-7 30 ఆగస్టు 2013 ఏరియేన్-5
29 జీశాట్-14 5 జనవరి 2014 జిఎస్‌ఎల్‌వి-D5
30 జీశాట్-16 7 డిసెంబరు 2014 ఏరియేన్-5
31 జీశాట్-6 27 ఆగస్టు 2015 జిఎస్‌ఎల్‌వి-D6
32 జీశాట్-15 11 నవంబరు 2015 ఏరియేన్-5
33 జీశాట్-18 6 అక్టోబరు 2016 ఏరియేన్-5
34 జీశాట్-9 5 మే 2017 జిఎస్‌ఎల్‌వి-F09
35 జీశాట్-19 5 జూన్ 2017 జిఎస్‌ఎల్‌వి MkIII - D1
36 జీశాట్-17 29 జూన్ 2017 ఏరియేన్-5
37 జీశాట్-6A 29 మార్చి 2018 జిఎస్‌ఎల్‌వి-F08 Failed in Orbit
38 జీశాట్-29 14 నవంబరు 2018 జిఎస్‌ఎల్‌వి MkIII-D2
39 జీశాట్-11 5 డిసెంబరు 2018 ఏరియేన్-5
40 జీశాట్-7A 19 డిసెంబరు 2018 జిఎస్‌ఎల్‌వి-F11
41 జీశాట్-31 6 February 2019 ఏరియేన్-5 VA-247
42 జీశాట్-30 17 జనవరి 2020 ఏరియేన్-5 VA-251
43 CMS-01 17 డిసెంబరు 2020 పిఎస్‌ఎల్‌వి-C50
44 CMS-02 23 జూన్ 2022 ఏరియేన్-5 VA-257

మూలాలు మార్చు

  1. GSAT-F06
  2. Laxman, Srinivas; Singh, Surendra (5 December 2018). "Exseed Sat 1: Mumbai startup first Indian private firm to have satellite in space". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-01-13.
  3. "India in Space through 2019: From RISAT, ASAT and Chandrayaan 2 to big wins for private space- Technology News, Firstpost". Tech2. 2019-12-25. Retrieved 2021-01-13.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇన్‌శాట్&oldid=3848623" నుండి వెలికితీశారు