మైకేల్ ఫారడే

ఆంగ్ల శాస్త్రవేత్త
(మైకేల్ ఫెరడే నుండి దారిమార్పు చెందింది)

మైఖేల్ ఫారడే FRS (1791 సెప్టెంబరు 22 - 1867 ఆగస్టు 25) విద్యుదయస్కాంతత్వం, విద్యుత్ రసాయనశాస్త్రం అధ్యయనానికి కృషి చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త . అతని ప్రధాన ఆవిష్కరణలలో విద్యుదయస్కాంత ప్రేరణ, డయామాగ్నెటిజం, విద్యుద్విశ్లేషణ వంటి అంతర్లీన సూత్రాలు ఉన్నాయి.

మైఖేల్ ఫారడే
థామస్ ఫిలిప్స్ గీచిన ఫారడే చిత్రం (1842)
థామస్ ఫిలిప్స్ గీచిన ఫారడే చిత్రం (1842)
జననం (1791-09-22)1791 సెప్టెంబరు 22
న్యూయింగ్‌టన్ బట్ట్స్, ఇంగ్లాండ్
మరణం1867 ఆగస్టు 25(1867-08-25) (వయసు 75)
హాంప్టన్ కోర్ట్, మిడ్డిల్ సెక్స్, ఇంఘ్లాండ్
నివాసంయునైటెడ్ కింగ్ డమ్‌
జాతీయతబ్రిటిష్
ప్రాముఖ్యతపారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం
విద్యుత్ రసాయన శాస్త్రం
ఫారడే ఫలితం
ఫారడే కేజ్
ఫారడే స్థిరాంకం
ఫారడే కప్
ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమం
ఫారడే పారడాక్స్
ఫారడే రొటేటర్
ఫారడే దక్షత ప్రభావం
ఫారడే తరంగం
ఫారడే వీల్
బలరేఖలు
రబ్బరు బెలూన్
రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో ఫారడే ప్రయోగశాల (1870 చెక్కడం)

ఫారడే పెద్దగా చదువుకోనప్పటికీ, చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రవేత్తలలో ఒకనిగా నిలిచాడు. ఏకముఖ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తున్న విద్యుత్ వాహకం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రంపై చేసిన పరిశోధనల ద్వారా భౌతిక శాస్త్రంలో విద్యుదయస్కాంత క్షేత్రం అనే భావనకు ఆధారాన్ని స్థాపించాడు. అయస్కాంతత్వం కాంతి కిరణాలను ప్రభావితం చేస్తుందని, ఆ రెండు దృగ్విషయాల మధ్య అంతర్లీన సంబంధం ఉందనీ ఫారడే నిరూపించాడు. [1] విద్యుదయస్కాంత ప్రేరణ, డయా అయస్కాంత సూత్రాలను, విద్యుద్విశ్లేషణ నియమాలను కనుగొన్నాడు. అతడు చేసిన విద్యుదయస్కాంత రోటరీ పరికరాల ఆవిష్కరణలు విద్యుత్ మోటారు సాంకేతికతకు పునాది వేశాయి. ప్రజోపయోగం కోసం విద్యుత్తు ఆచరణాత్మకంగా మారింది. [2]

రసాయన శాస్త్రవేత్తగా ఫారడే, బెంజీన్‌ను కనుగొన్నాడు. క్లోరిన్ యొక్క క్లాథ్రేట్ హైడ్రేట్‌ను పరిశోధించాడు, బున్సెన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని, ఆక్సీకరణ సంఖ్యల వ్యవస్థనూ కనుగొన్నాడు. "యానోడ్ ", "కాథోడ్ ", "ఎలక్ట్రోడ్" , "అయాన్" వంటి ప్రాచుర్యం పొందిన పరిభాషను కనుగొన్నాడు. ఫారడే రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో రసాయన శాస్త్రానికి మొదటి, మొట్టమొదటి ఫుల్లెరియన్ ప్రొఫెసర్ అయ్యాడు.

ఫారడే అద్భుతమైన ప్రయోగాత్మక శాస్త్రవేత్త. అతను తన తన ఆలోచనలను స్పష్టమైన, సరళమైన భాషలో తెలియజేశాడు; అతని గణిత సామర్ధ్యాలు త్రికోణమితి వరకు విస్తరించలేదు. సరళమైన బీజగణితం వరకే పరిమితం చేయబడ్డాయి. పారడే, ఇతరులు చేసిన ప్రయోగ ఫలితాలను జేమ్స్ క్లార్క్ మాక్స్వెల్ తీసుకుని వాటిని సమీకరణాలలో సంగ్రహించాడు. ఇది విద్యుదయస్కాంత దృగ్విషయం యొక్క అన్ని ఆధునిక సిద్ధాంతాలకు ఆధారం. పారడే బలరేఖలను ఉపయోగించడంపై మాక్స్‌వెల్ ఫారడేను "వాస్తవానికి చాలా ఉన్నత శ్రేణికి చెందిన గణిత శాస్త్రజ్ఞుడని, వీరి నుండి భవిష్యత్ గణిత శాస్త్రజ్ఞులు విలువైన, ఫలవంతమైన పద్ధతులను పొందవచ్చుననీ" రాసాడు. కెపాసిటెన్స్ యొక్క SI ప్రమాణాన్ని అతని గౌరవార్థం "ఫారడ్" అని పేరు పెట్టారు.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ తన అధ్యయన గోడపైన, ఐజాక్ న్యూటన్, జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ చిత్రాలతో పాటు ఫారడే చిత్రాన్ని కూడా పెట్టుకున్నాడు. [3] భౌతిక శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ "అతని ఆవిష్కరణల పరిమాణాన్ని, పరిధినీ, సైన్సు పరిశ్రమల పురోగతిపై వాటి ప్రభావాన్నీ పరిశీలిస్తే, అత్యంత గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకడైన ఫారడేను గౌరవించేందుకు ఏ పురస్కారమూ సరిపోదు." అని అన్నాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

జీవితం తొలి దశలో

మార్చు

ఖేల్ ఫారడే 1791 సెప్టెంబరు 22 న న్యూయింగ్టన్ బట్స్ లో జన్మించాడు. ఇది ఇప్పుడు లండన్ బోరో ఆఫ్ సౌత్‌వార్క్‌లో భాగం. అప్పట్లో సర్రే సబర్బన్ లో భాగంగా ఉండేది. [4] అతనిది బీద కుటుంబం. అతని తండ్రి జేమ్స్, క్రైస్తవ మతానికి చెందిన గ్లాసైట్ విభాగంలో సభ్యుడు. 1790 శీతాకాలంలో వెస్ట్‌మోర్లాండ్‌లోని ఓత్‌గిల్ నుండి జేమ్స్ ఫారడే తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని లండన్‌కు తరలి పోయాడు. అక్కడ అతను గ్రామంలోని ఒక కమ్మరి వద్ద అప్రెంటిస్‌గా పనిచేశాడు. [5] అదే సంవత్సరం శరదృతువులో మైఖేల్ జన్మించాడు. అతను నలుగురు పిల్లలలో మైఖేల్ మూడవవాడు. ప్రాథమిక పాఠశాల విద్య వరకు మాత్రమే చదివిన యువ మైఖేల్ ఫారడే, ఆ తరువాత స్వయంగా చదువుకోవాల్సి వచ్చింది. [6]

14 సంవత్సరాల వయస్సులో అతను బ్లాండ్‌ఫోర్డ్ వీధి‌లోని స్థానిక బుక్‌బైండర్, పుస్తక విక్రేత జార్జ్ రీబావుకు అప్రెంటిస్ గా చేరాడు. తన ఏడు సంవత్సరాల అప్రెంటిస్‌షిప్‌లో ఫారడే, ఐజాక్ వాట్స్ రాసిన ది ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ ది మైండ్‌తో సహా అనేక పుస్తకాలను చదివాడు. అందులో ఉన్న సూత్రాలు, సలహాలను ఉత్సాహంగా అమలు చేశాడు. [7] దీని ఫలితంగా అతను విజ్ఞానశాస్త్రంపై, ముఖ్యంగా విద్యుత్తుపై, ఆసక్తిని పెంచుకున్నాడు. ఫారడే ముఖ్యంగా జేన్ మార్సెట్ రాసిన కాన్వర్సేషన్స్ ఆన్ కెమిస్ట్రీ పుస్తకం నుండి ప్రేరణ పొందాడు.

వయోజన జీవితం

మార్చు
 
ముప్పైల్లో ఫారడే చిత్రం, సా.శ. 1826

1812 లో తన 20 సంవత్సరాల వయస్సులో తన అప్రెంటిస్‌ కాలం ముగింపు సందర్భంలో అతను రాయల్ ఇన్స్టిట్యూషన్, రాయల్ సొసైటీకి చెందిన ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ, సిటీ ఫిలాసఫికల్ సొసైటీ వ్యవస్థాపకుడు జాన్ టాటం ఉపన్యాసాలకు హాజరయ్యాడు. రాయల్ ఫిలార్మోనిక్ సొసైటీ వ్యవస్థాపకులలో ఒకరైన విలియం డాన్స్ ఈ ఉపన్యాసాల టిక్కెట్లను ఫారడేకు ఇచ్చాడు. పారడే తదనంతరం ఈ ఉపన్యాసాల నుండి గమనించిన వివరాలతో తయారుచేసిన 300 పేజీల పుస్తకాన్ని డేవీకి పంపాడు. డేవీ దాన్ని మెచ్చుకుంటూ వెంటనే దానికి సమాధానం రాసాడు. 1813 లో నత్రజని ట్రైక్లోరైడ్‌తో జరిగిన ప్రమాదం వలన డేవీ కంటి చూపుకు యిబ్బంది కలిగినపుడు, అతను ఫారడేను తన సహాయకుడిగా నియమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. యాదృచ్చికంగా అదే సమయానికి రాయల్ ఇనిస్టిట్యూషన్ సహాయకులలో ఒకరైన జాన్ పేన్ ను తొలగించారు. అతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయమని సర్ హంఫ్రీ డేవీని కోరారు. దాంతో అతను ఫారడేను 1813 మార్చి 1 న రాయల్ ఇనిస్టిట్యూషన్‌లో కెమికల్ అసిస్టెంట్‌గా నియమించాడు. అతి త్వరలోనే డేవీ ఫారడేకు నత్రజని ట్రైక్లోరైడ్ నమూనాల తయారీ పనిని అప్పగించాడు. చాలా చురుకైన పదార్ధం యొక్క పేలుడులో వారిద్దరూ గాయపడ్డారు. [8]

 
మైఖేల్ ఫారడే, 1861 లో, 70 ఏళ్ళ వయసులో

ఫారడే 1821 జూన్ 12 న సారా బర్నార్డ్ (1800–1879) ను పెళ్ళి చేసుకున్నాడు. [9] వారిద్దరూ సాండేమానియన్ చర్చిలో వారి కుటుంబాల ద్వారా కలుసుకున్నారు. వారు పెళ్ళి చేసుకున్న నెల తరువాత అతను సాండేమానియన్ సమాజంపై తన విశ్వాసాన్ని అంగీకరించాడు. వారికి పిల్లలు లేరు.

ఫారడే క్రైస్తవ భక్తుడు. అతని విశ్వసిస్తున్న సాండెమానియన్ తెగ స్కాట్లాండ్ చర్చిలో ఒక శాఖ. పెళ్ళి తరువాత, అతను డీకన్ (క్రైస్తవ మతంలో డీకోనెట్ లో సభ్యుడు)‌ గా, సమావేశ మందిరంలో ఎల్డర్ గా రెండుసార్లు పనిచేశాడు. అతని చర్చి బార్బికన్ లోని పాల్స్ అల్లే వద్ద ఉంది. ఈ సమావేశ మందిరం 1862 లో ఇస్లింగ్టన్ లోని బార్న్‌స్‌బర్రీ గ్రోవ్ కు మార్చబడింది; ఈ ఉత్తర లండన్ ప్రదేశం, ఫారడే తన రెండవ పదవీకాలం యొక్క చివరి రెండు సంవత్సరాలు, ఎల్డర్ గా తన పదవికి రాజీనామా చేయడానికి ముందు, పనిచేశాడు. [10] [11] "దేవుడు, ప్రకృతిల ఏకత్వ భావన ఫారడే జీవితంలోను, పని లోనూ విస్తరించింది" అని అతని జీవితచరిత్ర రచయితలు భావించారు. [12]

తరువాత జీవితంలో

మార్చు
 
రాయల్ సొసైటీకి చెందిన ముగ్గురు సభ్యులు 1857 లో ఫారడేకు అధ్యక్ష పదవిని అందిస్తున్నారు

జూన్ 1832 లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఫారడేకు గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని మంజూరు చేసింది. తన జీవితకాలంలో, విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అతనికి నైట్‌హుడ్ పురస్కారం ఇవ్వజూపారు. కానీ మతపరమైన కారణాలతో అతడు దాన్ని తిరస్కరించాడు. ధనసంపాదన, లౌకికమైన బహుమతులను పొందడం బైబిల్కు వ్యతిరేకమని నమ్మి, తాను కేవలం "మిస్టర్ ఫారడేగా మాత్రమే మిగిలిపోవాలని" కోరుకున్నాడు. 1824 లో రాయల్ సొసైటీ సభ్యునిగా ఎన్నికైన ఫారడే, రెండుసార్లు సొసైటీ అధ్యక్ష పదవిని నిరాకరించాడు. [13] అతను 1833 లో రాయల్ ఇనిస్టిట్యూషన్ లో రసాయనశాస్త్ర మొదటి ఫుల్లెరియన్ ప్రొఫెసర్ అయ్యాడు. [14]

1832 లో, ఫారడే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కు విదేశీ గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు. [15] అతను 1838 లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు విదేశీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1844 లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు ఎన్నికైన ఎనిమిది మంది విదేశీ సభ్యులలో అతనొకడు. [16] 1849 లో అతను రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెదర్లాండ్స్‌కు అనుబంధ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రెండు సంవత్సరాల తరువాత ఈ సంస్థ రాయల్ నెదర్లాండ్స్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అయ్యింది. తరువాత అందులో అతను విదేశీ సభ్యుడయ్యాడు. [17]

 
లండన్లోని హైగేట్ శ్మశానవాటికలో మైఖేల్ ఫారడే సమాధి

ఫారడే 1839 లో నరాల బలహీనతకు గురయ్యాడు. దాన్నుండీ కోలుకుని విద్యుదయస్కాంతత్వంపై పరిశోధనలను తిరిగి మొదలుపెట్టాడు. 1848 లో, ఇంగ్లాండు రాణి యొక్క భర్త చేసిన రికమెండేషను ఫలితంగా, ఫారడేకు మిడిల్‌సెక్స్‌లోని హాంప్టన్ కోర్టులో ఒక గృహం బహుమతిగా లభించింది. ఈ ఇంటినే తరువాత ఫారడే హౌస్ అని పిలిచారు. అదే ఇప్పుడు 37, హాంప్టన్ కోర్ట్ రోడ్ లో ఉంది. 1858 లో పదవీ విరమణానంతరం ఫారడే అక్కడే నివసించాడు. [18]

బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక సేవా ప్రాజెక్టులను అందించాడు. క్రిమియన్ యుద్ధంలో (1853–1856) ఉపయోగించేందుకు రసాయన ఆయుధాల ఉత్పత్తిపై సలహా ఇవ్వమని ప్రభుత్వం కోరినప్పుడు, ఫారడే నైతిక కారణాలను చూపుతూ ఆ పని చేసేందుకు నిరాకరించాడు. [19]

ఫారడే 1867 ఆగస్టు 25 న 75 సంవత్సరాల వయస్సులో హాంప్టన్ కోర్టులోని తన ఇంట్లో మరణించాడు. మరణానికి కొన్నేళ్ళ ముందు అతన్ని వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే వద్ద సమాధి చేసేందుకు వచ్చిన ప్రతిపాదనను అతడూ తిరస్కరించాడు. దాంతో అతనికి అక్కడీ ఐజాక్ న్యూటన్ సమాధి దగ్గర ఒక స్మారక ఫలకం నిర్మించారు. [20]

శాస్త్రీయ విజయాలు

మార్చు

రసాయన శాస్త్రం

మార్చు
 
లండన్లోని రాయల్ ఇనిస్టిట్యూషన్ లో ఫారడే గాజు తయారీకి ఉపయోగించిన పరికరాల ప్రదర్శన

రసాయన శాస్త్ర పరిశోధనలలో ఫారడే మొదట హంఫ్రీ డేవీకి సహాయకుడిగా చేరాడు. అతను ముఖ్యంగా క్లోరిన్ ను అధ్యయం చేయడంలో పాల్గొన్నాడు. అతను క్లోరిన్ , కార్బన్ యొక్క రెండు కొత్త సమ్మేళనాలను కనుగొన్నాడు. వాయువుల వ్యాపనంపై మొదటిసారి కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. ఈ వ్యాపన దృగ్విషయం గురించి అప్పటికే జాన్ డాల్టన్ చెప్పి ఉన్నాడు. ఈ దృగ్వియపు భౌతిక ప్రాముఖ్యతను ధామస్ గ్రాహం, జోసెఫ్ లోష్‌మిడ్ట్ లు మరింత సమగ్రంగా వెల్లడించారు. ఫారడే అనేక వాయువులను ద్రవీకరించడంలో విజయవంతమయ్యాడు. ఉక్కు మిశ్రమ లోహాలను పరిశోధించాడు. దృశా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన అనేక కొత్త రకాల గాజులను ఉత్పత్తి చేశాడు. ఈ భారీ గాజు లలో ఒకదాని నమూనా తరువాత చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత పొందింది; గాజును అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు ఫారడే కాంతి ధృవణపు తలం భ్రమణాన్ని నిర్ణయించాడు. ఈ నమూనా అయస్కాంత ధ్రువాలచే వికర్షించబడిన మొదటి పదార్థం.

ఫారడే బున్సెన్ బర్నర్ ప్రారంభ రూపాన్ని కనుగొన్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలలో ఆచరణాత్మకంగా ఉష్ణాన్ని అందించడానికి వాడుకలో ఉంది. [21] [22] ఫారడే రసాయన శాస్త్ర రంగంలో విస్తృతంగా పనిచేశాడు. అతను బెంజీన్ (అతను దాన్ని హైడ్రోజన్ యొక్క బైకార్బురేట్ అని అన్నాడు) వంటి పదారథాలను కనుగిన్నాడు. క్లోరిన్ వంటి వాయువలను ద్రవీకరించాడు. వాయువుల ద్రవీకరణ అనేది వాయువులు చాలా తక్కువ మరుగు స్థానం కలిగిన ద్రవాల బాష్పాలు అని నిర్ధారించడానికి సహాయపడ్డాయి. 1820 లో, ఫారడే కార్బన్, క్లోరిన్ లతో మొదటి సారి C2Cl6, C2Cl4 వంటి సమ్మేళనాలను సంశ్లేషించాడు. మరుసటి సంవత్సరం తన ఫలితాలను ప్రచురించాడు. [23] [24] [25] 1810 లో హంఫ్రీ డేవీ కనుగొన్న క్లోరిన్ క్లాథ్రేట్ హైడ్రేట్ కూర్పును కూడా ఫారడే నిర్ణయించాడు. [26] [27] విద్యుద్విశ్లేషణ నియమాలను కనుగొనడానికి అతను కృషి చేసాడు. అంతే కాకుండా విలియం వీవెల్ ప్రతిపాదించిన పదాలైన యానోడ్, కాథోడ్, ఎలక్ట్రోడ్, అయాన్ వంటి పరిభాషలను ప్రాచుర్యం పొందడంలో ఫారడే కృషి చేసాడు. [28]

తరువాత మెటాలిక్ నానోపార్టికల్స్ అని పిలువబడే వాటిని ఫారడే మొదటిసారి నివేదించాడు. 1847 లో, బంగారు కొల్లాయిడ్ల యొక్క దృశా లక్షణాలు సంబంధిత మొత్తం లోహానికి భిన్నంగా ఉన్నాయని అతను కనుగొన్నాడు. ఇది బహుశా క్వాంటం పరిమాణం యొక్క ప్రభావాలను నివేదించిన మొదటి పరిశీలన, ఇది నానోసైన్స్ కు పుట్టుకగా పరిగణించబడుతుంది. [29]

విద్యుత్తు, అయస్కాంతత్వం

మార్చు

ఫారడే విద్యుత్, అయస్కాంతత్వానికి సంబంధించిన పరిశోధనకు పేరు పొందాడు. అతని మొట్టమొదటి గుర్తింపదగ్గ ప్రయోగం, ఒక వోల్టాయిక్ పైల్ నిర్మాణం. ఇందులో ఏడు బ్రిటిష్ హాఫ్ పెన్నీ నాణేలను ఏడు జింక్ రేకులను, ఉప్పు నీటిలో తడిసిన ఆరు కాగితాలనూ కట్టగా పేర్చాడు. ఈ కట్టతో అతను మెగ్నీషియం సల్ఫేట్‌ను వియోగం చెందించాడు. (1812 జూలై 12 న అబోట్‌కు రాసిన మొదటి లేఖలో).

 
ఫారడే యొక్క విద్యుదయస్కాంత భ్రమణ ప్రయోగం, 1821 [30]

1821 లో డానిష్ భౌతిక శాస్త్రవేత్త, రసాయన శాస్త్రవేత్త హన్స్ క్రిస్టియన్ ఆయిర్‌స్టడ్ విద్యుదయస్కాంతత్వ దృగ్విషయాన్ని కనుగొన్న వెంటనే, డేవీ, బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం హైడ్ వోలాస్టన్ ఎలక్ట్రిక్ మోటారును రూపొందించడానికి ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. [1] వారిద్దరితో ఈ సమస్యను చర్చించిన తరువాత ఫారడే, "విద్యుదయస్కాంత భ్రమణం" అనే రెండు పరికరాలను ఉత్పత్తి చేసాడు. వీటిలో ఒకటి ఇప్పుడు హోమోపోలార్ మోటారుగా పిలువబడుతుంది. ఒక పాదరసం గల పాత్రలో అయస్కాంతం ఉంచి దానిపై ఒక తీగను వ్రేలాడదీసినపుడు దాని చుట్టూ వృత్తాకార అయస్కాంత బలం కారణంగా అది వృత్తాకారంగా తిరగడానికి కారణమైంది. రసాయన విద్యుత్ ఘటం అందించిన విద్యుత్ కారణంగా అయస్కాంతం చుట్టూ తీగ భ్రమణం చేస్తుంది. ఈ ప్రయోగాలు, ఆవిష్కరణలు ఆధునిక విద్యుదయస్కాంత సాంకేతికతకు పునాది వేశాయి. తన ఉత్సాహంలో ఫారడే, వోలాస్టన్, డేవీలకు చెప్పకుండా తన ప్రయోగ ఫలితాలను ప్రచురించాడు. దీంతో రాయల్ సొసైటీలో ఏర్పడిన వివాదం, డేవీతో అతని గురు శిష్య సంబంధాన్ని దెబ్బతీసింది. ఫారడేను వేరే పరిశోధనలకు మార్చడానికి అది కారణమై ఉండవచ్చు, తత్ఫలితంగా అతను విద్యుదయస్కాంత పరిశోధనలో చాలా సంవత్సరాలు పాల్గొనలేక పోయాడు. [31] [32]

1821 లో తన ప్రారంభ ఆవిష్కరణ నుండి, ఫారడే తన ప్రయోగశాల పరిశోధనలను కొనసాగించాడు, పదార్థాల విద్యుదయస్కాంత లక్షణాలను అన్వేషించి, అవసరమైన అనుభవాన్ని అభివృద్ధి చేశాడు. 1824 లో, ఫారడే ఒక అయస్కాంత క్షేత్రం, దాని ప్రక్కనే ఉన్న తీగలో విద్యుత్తు ప్రవాహాన్ని నియంత్రించగలదా అని అధ్యయనం చేయడానికి ఒక సర్క్యూట్‌ను ఏర్పాటు చేశాడు. కాని అతను అలాంటి సంబంధమేదీ గుర్తించలేదు. [33] ఈ ప్రయోగం మూడు సంవత్సరాల క్రితం కాంతి , అయస్కాంతాలతో నిర్వహించిన ప్రయీగం లాగానే ఉంది. అది కూడా ఇలాంటి ఫలితాలనే ఇచ్చింది. [34] [35] తరువాతి ఏడు సంవత్సరాలలో, ఫారడే తన ఎక్కువ సమయాన్ని ఆప్టికల్ క్వాలిటీ (హెవీ) గ్లాస్, బోరోసిలికేట్ ఆఫ్ లెడ్, [36] కోసం వెచ్చించాడు. [37] తన ఖాళీ సమయంలో ఫారడే, ఆప్టిక్స్, విద్యుదయస్కాంతత్వంపై తన ప్రయోగాత్మక రచనలను ప్రచురించడం కొనసాగించాడు; అతను డేవీతో కలిసి యూరప్ అంతటా చేసిన ప్రయాణాలలో పరిచయమైన శాస్త్రవేత్తలతోటీ, విద్యుదయస్కాంతత్వంపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలతోటీ ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించాడు. [38] 1831 లో, డేవీ మరణించిన రెండు సంవత్సరాల తరువాత, అతను తన ప్రయోగాలను ప్రారంభించాడు, దీనిలో అతను విద్యుదయస్కాంత ప్రేరణను కనుగొన్నాడు, 1831 అక్టోబరు 28 న తన ప్రయోగశాల డైరీలో ఇలా రాశాడు; "రాయల్ సొసైటీ లోని గొప్ప అయస్కాంతంతో అనేక ప్రయోగాలు చేస్తున్నాను".

 
ఫారడే యొక్క ఐరన్ రింగ్-కాయిల్ ఉపకరణం యొక్క రేఖాచిత్రం
 
1831 లో నిర్మించిన ఫారడే డిస్క్ మొదటి విద్యుత్ జనరేటర్ . గుర్రపునాడా ఆకారపు అయస్కాంతం (ఎ) డిస్క్ (డి) ద్వారా అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించింది. చక్రం తిరిగినపుడు, ఇది కేంద్రం నుండి అంచు వైపుకు రేడియల్‌గా బయటికి, విద్యుత్ ప్రవాహాన్ని ప్రేరేపించింది. ప్రవాహం స్లైడింగ్ స్ప్రింగ్ కాంటాక్ట్ m ద్వారా, బాహ్య సర్క్యూట్ ద్వారా, తిరిగి ఇరుసు ద్వారా డిస్క్ మధ్యలో ప్రవహించింది.

ఇనుప చుట్ట చుట్టూ రెండు ఇన్సులేటు చేసిన తీగలను చుట్టినప్పుడు ఫారడేకు ఫలితం చేకూరింది. ఒక తీగ ద్వారా విద్యుత్ ను ప్రవహింపజెసినప్పుడు, రెండవ చుట్టలో క్షణికంగా విద్యుత్ ప్రవాహం ప్రేరేపించబడిందని కనుగొన్నాడు. [1] ఈ దృగ్విషయాన్ని ఇప్పుడు అన్యోన్య ప్రేరణ అంటారు. అతడి ఇనుప చుట్ట-తీగ ఉపకరణం ఇప్పటికీ రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో ప్రదర్శనలో ఉంది. తరువాతి ప్రయోగాలలో, అతను ఒక అయస్కాంతాన్ని వైర్ లూప్ గుండా కదిలిస్తే ఆ తీగలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని అతను కనుగొన్నాడు. స్థిరమైన అయస్కాంతంపై లూప్ కదిలితే కరెంట్ కూడా ప్రవహిస్తుంది. మారుతున్న అయస్కాంత క్షేత్రం విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని అతని ప్రదర్శనలు నిర్ధారించాయి; ఈ సంబంధాన్ని గణితశాస్త్రపరంగా జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ ఫారడే ప్రేరణ నియమం అనే పేరుతో రూపొందించాడు. ఇది తరువాత నాలుగు మాక్స్వెల్ సమీకరణాలలో ఒకటిగా మారింది. తరువాతి కాలంలో ఇదే క్షేత్ర సిద్ధాంతం (ఫీల్డ్ థియరీ) అని పేరుతో పరిణామం చెందాయి. [39] ఫారడే తరువాత అతను కనుగొన్న సూత్రాలను ఎలక్ట్రిక్ డైనమో, ఆధునిక విద్యుత్ జనరేటర్ తయారీకి, ఎలక్ట్రిక్ మోటారును నిర్మించటానికి ఉపయోగించాడు. [40]

 
ఎలెక్ట్రోకెమిస్ట్రీ వ్యవస్థాపకులు ఫారడే (కుడి) , జాన్ డేనియల్ (ఎడమ).

1832 లో, విద్యుత్తు యొక్క ప్రాథమిక స్వభావాన్ని పరిశోధించడానికి ఉద్దేశించిన ప్రయోగాల శ్రేణిని పూర్తి చేశాడు; ఎలెక్ట్రోస్టాటిక్ ఆకర్షణ, విద్యుద్విశ్లేషణ, అయస్కాంతత్వం మొదలైన దృగ్విషయాలను ఉత్పత్తి చేయడానికి ఫారడే " స్టాటిక్ ", బ్యాటరీలు, "జంతు విద్యుత్ " ను ఉపయోగించాడు. అప్పటి శాస్త్రీయ అభిప్రాయమైన వివిధ "రకాలైన" విద్యుత్తుల భావన భ్రమ అని అతను తేల్చిచెప్పాడు. "విద్యుత్" ఒక్కటే నని ఫారడే ప్రతిపాదించాడు. పరిమాణం , తీవ్రత యొక్క మారుతున్న విలువలు (విద్యుత్ ప్రవాహం, వోల్టేజ్) విభిన్న సమూహ దృగ్విషయాలను ఉత్పత్తి చేస్తాయి. [1]

తన కెరీర్ చివరలో ఫారడే, విద్యుదయస్కాంత శక్తులు విద్యుద్వాహకం చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశంలోకి విస్తరిస్తాయని ప్రతిపాదించాడు. [39] ఈ ఆలోచనను అతని తోటి శాస్త్రవేత్తలు తిరస్కరించారు. తన ఈ ప్రతిపాదనను చివరికి శాస్త్రీయ సమాజం అంగీకరించేసరికి అతను జీవించి లేడు. విద్యుదావేశ వస్తువులు, అయస్కాంతాల నుండి వెలువడే అభివాహ రేఖల గురించి ఫారడే చేసిన భావన విద్యుత్, అయస్కాంత క్షేత్రాలను దృశ్యమానం చేయడానికి ఒక మార్గాన్ని అందించింది; 19 వ శతాబ్దం యొక్క మిగిలిన భాగంలో ఇంజనీరింగ్, పరిశ్రమలపై ప్రభావం చూపిన ఎలక్ట్రోమెకానికల్ పరికరాల అభివృద్ధికి ఆ సంభావిత నమూనాయే కీలకంగా మారింది.

డయామాగ్నెటిజం

మార్చు
 
విద్యుద్వాహక పదార్థంలో కాంతిని ప్రభావితం చేస్తుందని నిరూపించేందుకు వాడిన ఒక రకమైన గాజు పట్టీతో ఫారడే, 1845 లో [41]

1845 లో, ఫారడే అనేక పదార్థాలు అయస్కాంత క్షేత్రం నుండి బలహీనమైన వికర్షణను ప్రదర్శిస్తాయని కనుగొన్నాడు: ఈ దృగ్విషయాన్ని అతను డయామాగ్నెటిజం అని పిలిచాడు .

తరువాత అతని జీవితంలో, 1862 లో, ఫారడే స్పెక్ట్రోస్కోప్‌ను ఉపయోగించి కాంతి యొక్క భిన్నమైన మార్పును, అనువర్తిత అయస్కాంత క్షేత్రం ద్వారా వర్ణపట రేఖల మార్పును శోధించాడు. అప్పటికి అందుబాటులో ఉన్న పరికరాలు వర్ణపట మార్పు యొక్క ఖచ్చితమైన నిర్ణయానికి సరిపోవు. పీటర్ జీమాన్ తరువాత అదే దృగ్విషయాన్ని అధ్యయనం చేయడానికి మెరుగైన ఉపకరణాన్ని ఉపయోగించాడు. 1897 లో అతను తన ఫలితాలను ప్రచురించాడు. ఈ కృషికి గాను అతను 1902 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. తన 1897 పరిశోధనా పత్రాలు[42], అతని నోబెల్ అంగీకార ప్రసంగం రెండింటిలోనూ [43] జీమాన్, ఫారడే చేసిన కృషిని ప్రస్తావించాడు.

ఫారడే పంజరం

మార్చు

స్థిర విద్యుత్తుపై తన పరిశోధనలో ఫారడే ఐస్ పైల్ ప్రయోగం నిర్వహించాడు. ఈ ప్రయోగంలో, ఆవేశం చేయబడ్డ విద్యుత్ వాహకం లోని ఆవేశం వాహకం వెలుపలి భాగంలో మాత్రమే ఉందనీ, ఈ బాహ్య ఆవేశం విద్యుత్ వాహకంలోపల ఉన్న దేనిపైనా ప్రభావం చూపదనీ నిరూపించాడు. ఎందుకంటే బాహ్య ఆవేశాలు వాటి నుండి వెలువడే అంతర్గత క్షేత్రాలు ఒకదానికొకటి రద్దు చేసే విధంగా పునః పంపిణీ చేస్తాయి. ఈ షీల్డింగ్ ప్రభావాన్నే ఇప్పుడు ఫారడే కేజ్ అని పిలుస్తారు. [39] 1836 జనవరిలో, ఫారడే 12 అడుగుల పొడవు వెడల్పులున్న చదరపు చెక్క చట్రాన్ని, నాలుగు గాజు ఆధారాలపై ఉంచాడు. దానికి కాగితపు గోడలు, వైర్ మెష్లను జోడించాడు. అతడు దాని లోపలికి వెళ్ళి దానికి విద్యుత్తును పంపించాడు. ఆ విద్యుదీకరించిన పంజరం నుండి బయటికి వచ్చినప్పుడు, ఫారడే విద్యుత్తు ఒక శక్తి అని, అప్పట్లో భావిస్తున్నట్లుగా అది అనూఖ్యమైన ద్రమేమీ కాదనీ అతడు నిరూపించాడు. [2]

రాయల్ ఇన్స్టిట్యూషన్, ప్రజా సేవ

మార్చు
 
మైఖేల్ ఫారడే ఫాదర్ థేమ్స్ ను కలవడం పంచ్ పత్రిక (1885 జూలై 21)

ఫారడేకు రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్‌తో సుదీర్ఘ సంబంధం ఉంది. అతను 1821 లో హౌస్ ఆఫ్ ది రాయల్ ఇన్స్టిట్యూషన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా నియమించబడ్డాడు. [44] అతను 1824 లో రాయల్ సొసైటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1825 లో, అతను రాయల్ ఇన్స్టిట్యూషన్ ప్రయోగశాలకు డైరెక్టర్ అయ్యాడు. ఆరు సంవత్సరాల తరువాత, 1833 లో, ఫారడే రాయల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్లో మొదటి ఫుల్లెరియన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయ్యాడు, ఈ పదవికి ఉపన్యాసాలు ఇవ్వవలసిన నిబంధనేమీ లేకుండా జీవితకాలం పాటు నియమించబడ్డాడు. అతని స్పాన్సర్, గురువు జాన్ 'మాడ్ జాక్' ఫుల్లర్, ఫారడే కోసం ప్రత్యేకంగా రాయల్ ఇన్స్టిట్యూషన్‌లో ఈ పదవిని సృష్టించాడు. [45]

ఫారడే గౌరవార్థం అందించే పురస్కారాలు

మార్చు

విజ్ఞాన శాస్త్ర రంగంలో ఫారడే చేసిన సేవలకు గుర్తించి అతని గౌరవార్థం, జ్ఞాపకార్థం అనేక సంస్థలు అతని పేరుమీద బహుమతులు, పురస్కారాలను అందజేస్తున్నాయి. వాటిలో కొన్ని:

  • IET ఫారడే మెడల్
  • రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ మైఖేల్ ఫారడే ప్రైజ్ [46]
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ మైఖేల్ ఫారడే మెడల్ అండ్ ప్రైజ్ [47]
  • రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫారడే లెక్చర్షిప్ ప్రైజ్ [48]


చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 "Archives Michael Faraday biography – The IET". theiet.org.
  2. 2.0 2.1 "The Faraday cage: from Victorian experiment to Snowden-era paranoia". The Guardian. 22 May 2017.
  3. Gleeson-White, Jane (10 November 2003). "Einstein's Heroes (book review)". The Sydney Morning Herald. Retrieved 24 October 2017.
  4. For a concise account of Faraday's life including his childhood, see pp. 175–183 of Every Saturday: A Journal of Choice Reading, Vol III published at Cambridge in 1873 by Osgood & Co.
  5. The implication is that James discovered job opportunities elsewhere through membership of this sect. James joined the London meeting house on 20 February 1791, and moved his family shortly thereafter. See Cantor, pp. 57–58.
  6. "Michael Faraday." History of Science and Technology. Houghton Mifflin Company, 2004. Answers.com 4 June 2007
  7. Jenkins, Alice (2008). Michael Faraday's Mental Exercises: An Artisan Essay-Circle in Regency London. Oxford University Press. p. 213.
  8. Thomas, p. 17
  9. The register at St. Faith-in-the-Virgin near St. Paul's Cathedral, records 12 June as the date their licence was issued. The witness was Sarah's father, Edward. Their marriage was 16 years prior to the Marriage and Registration Act of 1837. See Cantor, p. 59.
  10. Cantor, pp. 41–43, 60–64, and 277–280.
  11. Paul's Alley was located 10 houses south of the Barbican. See p. 330 Elmes's (1831) Topographical Dictionary of the British Metropolis.
  12. Baggott, Jim (2 September 1991). "The myth of Michael Faraday: Michael Faraday was not just one of Britain's greatest experimenters. A closer look at the man and his work reveals that he was also a clever theoretician". New Scientist. Retrieved 6 September 2008.
  13. Todd Timmons (2012). "Makers of Western Science: The Works and Words of 24 Visionaries from Copernicus to Watson and Crick". p. 127.
  14. "Faraday appointed first Fullerian Professor of Chemistry". The Royal Institution. 16 October 2017. Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 23 అక్టోబరు 2020.
  15. "Book of Members, 1780–2010: Chapter F" (PDF). American Academy of Arts and Sciences. p. 159. Archived from the original (PDF) on 27 మే 2016. Retrieved 15 September 2016.
  16. Gladstone, John Hall (1872). Michael Faraday. London: Macmillan and Company. p. 53. Faraday French Academy.
  17. "M. Faraday (1791–1867)". Royal Netherlands Academy of Arts and Sciences. Retrieved 17 July 2015.
  18. Twickenham Museum on Faraday and Faraday House Archived 2014-12-14 at the Wayback Machine; accessed 14 August 2014.
  19. Croddy, Eric; Wirtz, James J. (2005). Weapons of Mass Destruction: An Encyclopedia of Worldwide Policy, Technology, and History. ABC-CLIO. p. 86. ISBN 978-1-85109-490-5.
  20. 'The Abbey Scientists' Hall, A.R. p59: London; Roger & Robert Nicholson; 1966
  21. Jensen, William B. (2005). "The Origin of the Bunsen Burner" (PDF). Journal of Chemical Education. 82 (4): 518. Bibcode:2005JChEd..82..518J. doi:10.1021/ed082p518. Archived from the original (PDF) on 30 May 2005.
  22. Faraday (1827), p. 127.
  23. Faraday, Michael (1821). "On two new Compounds of Chlorine and Carbon, and on a new Compound of Iodine, Carbon, and Hydrogen". Philosophical Transactions. 111: 47–74. doi:10.1098/rstl.1821.0007.
  24. Faraday, Michael (1859). Experimental Researches in Chemistry and Physics. London: Richard Taylor and William Francis. pp. 33–53. ISBN 978-0-85066-841-4.
  25. Williams, L. Pearce (1965). Michael Faraday: A Biography. New York: Basic Books. pp. 122–123. ISBN 978-0-306-80299-7.
  26. Faraday, Michael (1823). "On Hydrate of Chlorine". Quarterly Journal of Science. 15: 71.
  27. Faraday, Michael (1859). Experimental Researches in Chemistry and Physics. London: Richard Taylor and William Francis. pp. 81–84. ISBN 978-0-85066-841-4.
  28. Ehl, Rosemary Gene; Ihde, Aaron (1954). "Faraday's Electrochemical Laws and the Determination of Equivalent Weights" (PDF). Journal of Chemical Education. 31 (May): 226–232. Bibcode:1954JChEd..31..226E. doi:10.1021/ed031p226.
  29. "The Birth of Nanotechnology". Nanogallery.info. 2006. Archived from the original on 5 డిసెంబరు 2019. Retrieved 25 July 2007. Faraday made some attempt to explain what was causing the vivid coloration in his gold mixtures, saying that known phenomena seemed to indicate that a mere variation in the size of gold particles gave rise to a variety of resultant colors.
  30. Faraday, Michael (1844). Experimental Researches in Electricity. Vol. 2. ISBN 978-0-486-43505-3. See plate 4.
  31. Hamilton, pp. 165–171, 183, 187–190.
  32. Cantor, pp. 231–233.
  33. Thompson, p. 95.
  34. Thompson, p. 91. This lab entry illustrates Faraday's quest for the connection between light and electromagnetic phenomenon 10 September 1821.
  35. Cantor, p. 233.
  36. Thompson, pp. 95–98.
  37. Thompson, p. 100.
  38. Faraday's initial induction lab work occurred in late November 1825. His work was heavily influenced by the ongoing research of fellow European scientists Ampere, Arago, and Oersted as indicated by his diary entries. Cantor, pp. 235–244.
  39. 39.0 39.1 39.2 Lives and Times of Great Pioneers in Chemistry (lavoisier to Sanger). World Scientific. 2015. pp. 85, 86.
  40. "Michael Faraday's generator". The Royal Institution. 15 October 2017.
  41. "Detail of an engraving by Henry Adlard, based on earlier photograph by Maull & Polyblank ca. 1857". National Portrait Gallery, UK: NPR.
  42. Zeeman, Pieter (1897). "The Effect of Magnetisation on the Nature of Light Emitted by a Substance". Nature. 55 (1424): 347. Bibcode:1897Natur..55..347Z. doi:10.1038/055347a0.
  43. "Pieter Zeeman, Nobel Lecture". Retrieved 29 May 2008.
  44. "Michael Faraday (1791–1867)". The Royal Institution. Retrieved 20 February 2014.
  45. Jones, Roger (2009). What's Who?: A Dictionary of Things Named After People and the People They are Named After. Troubador Publishing Ltd. p. 74.
  46. "Michael Faraday Prize and Lecture | Royal Society". royalsociety.org.
  47. "Gold Medals". Gold Medals | Institute of Physics. Archived from the original on 2019-04-25. Retrieved 2020-10-23.
  48. "RSC Faraday Lectureship Prize". www.rsc.org.

వనరులు

మార్చు

మరింత చదవడానికి

మార్చు

జీవిత చరిత్రలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు

జీవిత చరిత్రలు

మార్చు

ఇతరులు

మార్చు