మైసూరు వాసుదేవాచార్య

కర్ణాటక రచయిత

మైసూరు వాసుదేవాచార్య భారతీయ సంగీతకారుడు, కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు, త్యాగరాజ శిష్య పరంపరలో నేరుగా ఉన్నవాడు. వాసుదేవాచార్య కృతులు దాదాపు 200 వరకూ ఉన్నాయి, ఇవి ఎక్కువగా తెలుగులో, సంస్కృతంలో ఉన్నాయి. బ్రోచేవారెవరురా, దేవాది దేవ శ్రీ వాసుదేవ, మామవతు శ్రీ సరస్వతి, భజరే రే మనసా, రారా రాజీవలోచన రామ ఇతను రచించిన కృతులలో బాగా ఎక్కువగా వినిపించేవి.[1] ఇతనికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం బహూకరించింది. [2] ఇతని పేరున కన్నడంలో రెండు రచనలు లభ్యమవుతున్నాయి. ఒకటి ఇతని ఆత్మకథ, పేరు నెనపుగళు(జ్ఞాపకాలు), రెండవది నా కండ కళావిదరు(నేను చూసిన కళాకారులు). రెండవ పుస్తకం ఆయా వ్యక్తుల ఆత్మకథల సంకలనం. ఇతను రుక్మిణి దేవి అరుండాలె నిర్వహించే కళాక్షేత్ర లో సంగీత బోధన చేసాడు. కళాక్షేత్రలో ముఖ్య సంగీతజ్నుడిగా వ్యవహరిస్తూ, రామయణాన్ని సంగీతంలో మలిచాడు. 1961లో 96 ఏళ్ళ వయస్సులో మరణించాడు.

మైసూరు వాసుదేవాచార్య
వ్యక్తిగత సమాచారం
జననం(1865-05-28)1865 మే 28
కర్ణాటక, భారత దేశం
మరణం1961 మే 17(1961-05-17) (వయసు 95)
సంగీత శైలికర్ణాటక సంగీతము
వృత్తివాగ్గేయకారుడు
వాయిద్యాలుగానం


తొలి జీవితం

మార్చు

వాసుదేవాచార్య సంప్రదాయ మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో మైసూరులో జన్మించాడు. వీణ పద్మనాభయ్య వద్ద సంగీతం నేర్చుకున్నాడు. మైసూరు మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత భాష, అందులోని కావ్య, వ్యాకరణ, నాటక, అలంకార, తర్క, ఇతిహాస, పురాణాది భాగాలను అభ్యసించి, నిష్ణాతుడయ్యాడు. ప్రైవేటుగా సంగీతం నేర్చుకున్నాడు. [3] ఆపై ఇతను ప్రముఖ వాగ్గేయకారుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గర మైసూరు మహారాజు ఇచ్చిన ధనసహాయంతో సంగీతం నేర్చుకున్నాడు. తరువాతి కాలంలో తంజావూరు-కావేరి ప్రాంత సంగీతజ్నులకు సరిపోలే సంగీతాన్ని గ్రహించి మైసూరు రాజు ఆస్థానంలో ఆస్థాన విద్వాన్ గా వ్యవహరించాడు. ఇతను తన గురువు వద్ద నేర్చుకున్న మధ్యమకాల తాళంలో పాడతాడని తెలుస్తోంది. కర్ణాటక సంగీతంలోని ముఖ్యమైన భాగాలైన ఆలాపన, తానం, పల్లవి, నిరావళ, కల్పన స్వరం అంశాల్లో నిష్ణాతుడు అని తెలుస్తోంది. [4]

ఉద్యోగం

మార్చు

ఇతని కృతులలో చాలా వరకు వాసుదేవ కీర్తన మంజరి అనే పుస్తకంలో ఇతను ప్రచురించుకున్నాడు. ఇతనికి భాష మీద ఉన్న పట్టును ఈ కీర్తనలు తెలుపుతాయి. తెలుగులో భాషా నైపుణ్యాన్ని ఇతను త్యాగరాజ భిక్షగా చెప్పుకుంటాడు. ఇతని కీర్తనల్లో పరమపురుష వాసుదేవ, వాసుదేవ పదాలు మకుటంగా కనిపిస్తాయి.[5] ఇతని కీర్తనలు చాలా వరకు రాముడిని కీర్తిస్తూ ఉంటాయి. కీర్తనలు, కృతులతో పాటుగా ఇతను పలు వర్ణాలను, తిల్లానాలను, జావళీలను, శ్లోకాలను రచించాడు. సంగీతత్రయంలోని త్యాగరాజును, ముద్దుస్వామి దీక్షితయ్యను, శ్యామశాస్త్రిని కీర్తిస్తూ వాసుదేవాచార్య కొన్ని కీర్తనలు రాసాడు. [6]

కృతులు

మార్చు
కృతి రాగం తాళం రకం భాష ఆడియోకి లంకె
నన్నుబ్రోవ రాదా మధ్యమావతి రాగం ఆది తెలుగు
మమ హృదయే రీతిగౌళ రాగం ఖండ జాతి త్రిపుట సంస్కృతం
మరచితివే పూర్వకళ్యాణ రాగం ఆది Telugu
భజాన సేయరాదా శ్రీరాముని ధర్మవతి రాగం రూపక తెలుగు

వైరమంగళం లక్ష్మీనారాయణ (భాగం 1) - https://www.youtube.com/watch?v=X5WNYzUXbe4
వైరమంగళం లక్ష్మీనారాయణ (భాగం 2) - https://www.youtube.com/watch?v=WcS0nExnwHk

బ్రోచేవారెవరు రా ఖమస్ రాగం ఆది తెలుగు

ఎం. ఎస్. సుబ్బలక్ష్మి - https://www.youtube.com/watch?v=Aqd9Pmksx8s
మంగళంపల్లి బాలమురళీకృష్ణ - https://www.youtube.com/watch?v=w2QkYh9Eesc
బాంబే సిస్టర్స్ - https://www.youtube.com/watch?v=eHwqrpXxHms
జి.ఎన్. బాలసుబ్రహ్మణ్యం - https://www.youtube.com/watch?v=ulwdujl433U

'’వనజాక్షా - వర్ణం మందరి ఆది తెలుగు
లంబోదరం అవలంబే కాంభోజి తూపమరోస్ తెలుగు
గిరిజా రమణ నటజన శరణ గంభీరనాట రాగం ఆది సంస్కృతం

వాణీ సతీష్ - https://www.youtube.com/watch?v=4TpEJtzi-aw

గోకుల నిలయ ఆభేరి ఆది సంస్కృతం

టి ఎం కృష్ణ - https://www.youtube.com/watch?v=3fHEVqhre7o

మామవతు శ్రీ సరస్వతి హిందోళ రాగం ఆది సంస్కృతం

ప్రియా సిస్టర్స్ - https://www.youtube.com/watch?v=bnvGV7GtKlM
సుధా రఘునాథన్ - https://www.youtube.com/watch?v=a_-UV1mLZug

మరి మరి వచ్చునా మానవజన్మ కాంభోజి ఆది తెలుగు
నీకేల దయరాదు కదనకుతూహల రాగం ఆది తెలుగు
నిమిషమైనా సామ రాగం ఆది తెలుగు
నిన్నే నమ్మితినయ్యా శ్రీరామ సింహేంద్రమధ్యమ రాగం మిశ్ర చాపు తెలుగు
రా రా రాజీవ లోచనా మోహన రాగం ఆది తెలుగు
వరలక్ష్మి నమోస్తుతే గౌరీమనోహరి రాగము రూపక సంస్కృతం
శ్రీ చాముండేశ్వరి బిలహరి ఆది సంస్కృతం
దేవీ కమలాలయే గరుడధ్వని రాగం ఆది సంస్కృతం
భజరే రే మనసా ఆభేరి ఆది సంస్కృతం సౌమ్య - https://www.youtube.com/watch?v=Dy7iP-8fSKU

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ప్రాణేష్, మీరా రాజారాం(2003), వొడయార్ సంస్థాన సంగీత వాగ్గేయకారులు(1638-1947 A.D.), వీ ఎం ప్రచురణలు, బెంగుళూరు
  2. "పద్మ పురస్కారాలు" (PDF). గృహ మంత్రిత్వశాఖ, భారతదేశ ప్రభుత్వం. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
  3. "మ్యూజికల్ నిర్వాణ జాలస్థలిలో సమాచారం". Archived from the original on 2012-02-05. Retrieved 2019-08-17.
  4. "A slice of musical history". The Hindu. Archived from the original on 2008-04-14. Retrieved 2019-08-17.
  5. "The Hindu : Magic of the Mysore musician". Archived from the original on 2008-03-23. Retrieved 2019-08-17.
  6. "Rare composer". The Hindu. Archived from the original on 2009-06-08. Retrieved 2019-08-17.