మొకొక్‌ఛుంగ్

నాగాలాండ్ రాష్ట్రంలోని మొకొక్‌ఛుంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

మొకొక్‌ఛుంగ్, నాగాలాండ్ రాష్ట్రంలోని మొకొక్‌ఛుంగ్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. మున్సిపాలిటీగా కూడా మార్చబడింది. ఏవో తెగ ప్రజల సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉన్న ఈ పట్టణం ఉత్తర నాగాలాండ్ లోని అతి ముఖ్యమైన పట్టణ కేంద్రంగా నిలుస్తోంది. ఈ పట్టణంలో 16 వార్డులు ఉన్నాయి.

మొకొక్‌ఛుంగ్
మొకొక్‌ఛుంగ్ is located in Nagaland
మొకొక్‌ఛుంగ్
మొకొక్‌ఛుంగ్
భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి
Coordinates: 26°19′N 94°30′E / 26.32°N 94.50°E / 26.32; 94.50
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లామొకొక్‌ఛుంగ్
Government
 • Typeమున్సిపాలిటీ
 • Bodyమొకొక్‌ఛుంగ్ మున్సిపల్ కౌన్సిల్
Elevation
1,325 మీ (4,347 అ.)
జనాభా
 (2011)
 • Total35,913[1]
భాషలు
 • అధికారికఇంగ్లీష్
 • మాండలికాలుఏవో
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
798601
టెలిఫోన్ కోడ్91 (0)369
Vehicle registrationఎన్ఎల్ - 02

భౌగోళికం

మార్చు

మొకొక్‌ఛుంగ్ పట్టణం 26°20′N 94°32′E / 26.33°N 94.53°E / 26.33; 94.53 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] ఇది సముద్రమట్టానికి 1325 మీటర్ల ఎత్తులో ఉంది. మొకొక్‌ఛుంగ్ పట్టణం ఏడాది పొడవునా తేలికపాటి వాతావరణం కలిగి ఉంటుంది. సంవత్సరంలో పది నెలలపాటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షకాలంలో చాలా పొగమంచును కురుస్తుంది.

జనాభా

మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] మొకొక్‌ఛుంగ్ పట్టణంలో 31,204 జనాభా (మెట్రోపాలిటన్ సముదాయంలో 60,161 జనాభా) ఉంది. ఈ జనాభాలో 55% మంది పురుషులు, 45% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 84% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84% కాగా, స్త్రీల అక్షరాస్యత 83% గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

పట్టణ జనాభాలో ఏవో తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈ పట్టణం ఏవో తెగకు సంబంధించిన చరిత్ర, సాంస్కృతిక కేంద్రంగా ఉంది. మొకొక్‌ఛుంగ్ పట్టణం నాగాలాండ్ రాష్ట్ర్ర సాంస్కృతిక రాజధానిగా నిలుస్తోంది. 19 వ శతాబ్దం చివరి నుండి ఇప్పటివరు ఈ పట్టణవాసులు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు.

 
మొకొక్‌ఛుంగ్, నాగాలాండ్

ఈ పట్టణంలో క్రైస్తవ, హిందూ, సిక్కు, ఇస్లాం మతాలు ఉన్నాయి.

క్రీడలు

మార్చు

మొకొక్‌ఛుంగ్ పట్టణంలో ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, బ్యాట్‌మింటన్, క్రికెట్ మొదలైన క్రీడలు ఆడుతారు. ఈ పట్టణంలో రెండు బాస్కెట్‌బాల్ కోర్టులు, రెండు ఫుట్‌బాల్ మైదానాలు, ఒక బ్యాట్‌మింటన్ స్టేడియం, ఒక క్రికెట్ మైదానం ఉన్నాయి.

రవాణా

మార్చు

ఈ పట్టణం నుండి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు రోడ్డుమార్గం ఉంది.

మొకొక్‌ఛుంగ్ మీదుగా వెళ్ళే ప్రధాన రహదారులు:

మూలాలు

మార్చు
  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 6 January 2021.
  2. Falling Rain Genomics, Inc - Mokokchung
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 6 January 2021.

వెలుపలి లంకెలు

మార్చు