మొహమ్మద్ ఫరీదుద్దీన్

మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ - తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన 2004లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశాడు.[1]

మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌
మొహమ్మద్ ఫరీదుద్దీన్


మాజీ మంత్రి
నియోజకవర్గం జహీరాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం 14 అక్టోబరు 1957
హోతి (బి) , జహీరాబాద్ మండలం , సంగారెడ్డి జిల్లా , తెలంగాణ రాష్ట్రం
మరణం 29 డిసెంబర్, 2021
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహమ్మద్ ఫక్రుద్దీన్, ఫాతిమునిస బేగం
సంతానం 3
నివాసం హైదరాబాద్, జహీరాబాద్, తెలంగాణ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

మార్చు

మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ 1957 అక్టోబరు 14లో తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, హోతి (బి) గ్రామంలో మహమ్మద్ ఫక్రుద్దీన్, ఫాతిమునిస బేగం దంపతులకు జన్మించాడు. ఈయన హైదరాబాద్ యాకుత్ పురలోని ధర్మవంత్ డిగ్రీ కాలేజీలో బీకాం విద్య పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి హోతి (బి) గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మైనారిటీ సంక్షేమ శాఖ & సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2][3] అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎస్.సి రిసర్వ్డ్ కావడంతో ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఆయన 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఫ‌రీదుద్దీన్‌ను 2016లో తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2016 అక్టోబరు 20న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[5] ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 2021 జూన్ 3న ముగిసింది.

మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2021 డిసెంబరు 29న గుండెపోటుతో మరణించాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  2. "AP: 24 ministers in YSR's team". Rediff. 22 May 2004. Retrieved 2017-07-18.
  3. "Portfolios of the newly inducted ministers". Business Standard. 27 April 2007. Archived from the original on 2018-08-31. Retrieved 2017-07-18.
  4. Sakshi (4 October 2016). "ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఏకగ్రీవం!". Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  5. Sakshi (20 October 2016). "ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ప్రమాణస్వీకారం". Sakshi. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 June 2021.
  6. Namasthe Telangana (29 December 2021). "మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 29 డిసెంబరు 2021. Retrieved 29 December 2021.
  7. Sakshi (30 December 2021). "మాజీ మంత్రి ఫరీదుద్దీన్‌ కన్నుమూత". Archived from the original on 30 డిసెంబరు 2021. Retrieved 30 December 2021.