ఇంద్రధనుస్సు (1978 సినిమా)

ఇంద్రధనుస్సు (1978 సినిమా)
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
తారాగణం కృష్ణ ,
శారద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ఉదయ లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

కథEdit

సంపన్నుడైన రాజశేఖరానికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడైన గోపాల్ ధనం ఉన్నదనే అహంతో వక్రమార్గాన పడతాడు. రెండవ కొడుకు ప్రతాప్ పోలో ఆటలో ఛాంపియన్. సామ్యవాది. ప్రతాప్ గుర్రాలకు పాలిష్ చేసేవాని కూతురు శాంతను ప్రేమిస్తాడు. ఇది తెలిసిన రాజశేఖరం మండిపడి నోట్లకట్టలను తీసుకుని శాంత తండ్రి మొఖాన కొట్టి శాంతకు వేరే పెళ్లి చేయమంటాడు. శాంత సవతి తల్లి ఆ డబ్బు తీసుకుని రాజశేఖరానికి భరోసా ఇస్తుంది. వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైన శాంత పెళ్లిరోజున మరణిస్తుంది. ప్రతాప్ ఇది భరించలేక మానసిక శాంతి కోసం ఎస్టేట్‌కు వెళతాడు. ఎస్టేట్‌లో అచ్చం శాంత మాదిరే వున్న మరో అమ్మాయి తారసపడుతుంది. శాంతను కోల్ఫోయి ప్రశాంతత కోసం వచ్చిన ప్రతాప్‌కు మళ్లీ అశాంతి ఏర్పడుతుంది[1].

తారాగణంEdit

సాంకేతికవర్గంEdit

గీతాలుEdit

  1. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక ఆశ్రమవాసివి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. ఇది మైకమా బింకమా ఇదే ఇదే నీకు అందమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. ఏడు రంగుల ఇంద్రధనుస్సు ఈడు వచ్చిన నా వయసు - పి.సుశీల
  4. తడసిన కోక కట్టుకుని కడవ సంకన పెట్టుకుని వస్తుంటే - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేనేలేదు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. మూసుకొ మూసుకొ తలుపులన్నీ మూసుకో గడియలన్నీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ­

మూలాలుEdit

  • వెంకట్రావ్ (21 January 1979). "చిత్రసమీక్ష ఇంద్రధనుస్సు". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 64, సంచిక 287). Retrieved 6 January 2018.