మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఐటీ ట‌వ‌ర్

తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్ పట్టణంలో ఉన్న ఐటీ టవర్

మహబూబ్​నగర్ ఐటీ ట‌వ‌ర్ అనేది తెలంగాణ రాష్ట్రం మహబూబ్​నగర్​ జిల్లా లోని మహబూబ్​నగర్ పట్టణంలో ఉన్న ఐటీ టవర్.[1] రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో మహబూబ్​నగర్ పట్టణం సమీపంలోని దివిటీపల్లిలో నాలుగు ఎక‌రాల్లో ఐదు అంత‌స్తుల్లో 40 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఐటీ టవర్‌ను నిర్మించింది.[2]

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఐటీ ట‌వ‌ర్
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఐటీ టవర్ భవనం
సాధారణ సమాచారం
రకంఐటీ టవర్
ప్రదేశంమహబూబ్​నగర్, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2023, మే 6
వ్యయం40 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం174,240 sq ft (16,187 m2)

నిర్మాణం మార్చు

ఈ ఐటీ టవర్ నిర్మాణానికి దివిటిపల్లి గ్రామ పరిధిలో 2018 జూలై 7న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశాడు.[3][4]

44 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా పది కాన్ఫరెన్స్ హాళ్లు, ఒక ఇన్నోవేషన్ సెంటర్, నాలెడ్జ్ హబ్ తోపాటు ఆధునిక కెఫెటేరియా ఏర్పాటుచేయబడ్డాయి.

ప్రారంభం మార్చు

2023 మే 6న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ టవర్‌ను ప్రారంభించాడు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, టి-హబ్, వీ హబ్ ఫెసిలిటేషన్ సెంటర్‌లను ప్రారంభించడంతోపాటు ముల్లర్ డాట్‌కనెక్ట్, అమర రాజా గ్రూప్, జువెన్ టెక్నాలజీస్, ఇంటూట్స్ ఎల్‌ఎల్‌సి, ఉర్పాన్ టెక్నాలజీస్, ఇ-గ్రోవ్ సిస్టమ్స్, ఐటి విజన్ 360 ఇంక్, ఫోర్ ఓక్స్ ఇంక్ తోపాటు బిసిడిసి క్లౌడ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఇక్కడ పనిచేసేందుకు అవసరమైన అనుమతి పత్రాలను అందజేశాడు.[5]

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి. లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, గుర్కా జైపాల్ యాదవ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణ రెడ్డి, చల్లా వెంకట్రామ్ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]

మూలాలు మార్చు

  1. India, The Hans (2023-03-02). "Construction of IT Towers near completion". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2023-03-02. Retrieved 2023-05-06.
  2. Punnam, Venkatesh (2023-05-06). "దివిటిపల్లిలో ఐటి టవర్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్". Mana Telangana. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  3. Desk, HT Telugu (2023-05-05). "Mahabubnagar IT Park : మహబూబ్‌నగర్‌లోని 'ఐటీ టవర్' రెడీ... ప్రత్యేకతలివే". Hindustantimes Telugu. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-06.
  4. telugu, NT News (2023-05-05). "IT Tower | పాల‌మూరు జిల్లాలో రేపే ఐటీ ట‌వ‌ర్ ప్రారంభం.. ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". www.ntnews.com. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  5. Telugu, Tnews (2023-05-06). "మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". T News Telugu. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.
  6. ABN (2023-05-06). "వాళ్ల కల్లు మండుతున్నయ్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-05-06. Retrieved 2023-05-06.

వెలుపలి లంకెలు మార్చు