యజ్ఞం (2004 సినిమా)

2004 సినిమా

యజ్ఞం 2004 లో రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈతరం ఫిలింస్ బ్యానరుపై పోకూరి బాబురావు నిర్మించగా, గోపిచంద్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ సినిమా. ఫ్యాక్షనిజం నేపథ్యంలో కథ నడుస్తుంది.

యజ్ఞం
దర్శకత్వంఎ. ఎస్. రవి కుమార్ చౌదరి
నిర్మాతపోకూరి బాబూరావు
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
స్క్రీన్ ప్లేరవి కుమార్ చౌదరి
కథఈతరం ఫిలింస్ విభాగం
నటులుగోపీచంద్
సమీరా బెనర్జీ
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంసీహెచ్ రమణ రాజు
కూర్పుగౌతం రాజు
నిర్మాణ సంస్థ
ఈతరం ఫిలింస్
విడుదల
2 జూలై 2004 (2004-07-02)
నిడివి
145 నిమిషాలు
దేశంభారత్
భాషతెలుగు

కథసవరించు

శీను (గోపీచంద్) ఫ్యాక్షన్ లీడరైన రెడ్డెప్ప (దేవరాజ్) కి కుడిభుజం లాంటి వాడు. శీను, రెడ్డెప్ప కూతురు శైలజ (సమీరా బెనర్జీ) ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. రెడ్డెప్పకూ నాయుడమ్మకూ (విజయ రంగరాజు) మధ్య బద్ధవిరోధం ఉంటుంది. వీరిద్దరి మధ్య గొడవల వల్ల చాలా మంది మరణించి ఉంటారు. వారి కుటుంబాలు వీధిన పడి ఉంటాయి. శైలజ, శీను ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. శీను తక్కువ జాతివాడని రెడ్డెప్ప అందుకు అంగీకరించడు. మిగతా కథంతా శీను తమ ప్రేమకు అడ్డుపడే వారిని అడ్డుతొలగించి జనాలలో చైతన్యం కలిగించడం చుట్టూ తిరుగుతుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించగా సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు.[1]

మూలాలుసవరించు

  1. "Telugu cinema Review - Yagnam - Gopichand, Sameera Benarjee - Pokuri Babu Rao". www.idlebrain.com. Retrieved 2020-12-11.