యమలీల (ధారా వాహిక)
యమలీల అనేది ఈటీవీలో ప్రసారమైన సీరియల్. ఇది 1994లో వచ్చిన యమలీల సినిమాకు సీక్వెల్. ఈ సీరియల్‌లో, అలీ మంజు భార్గవి సోనియా సింగ్ నికిత భావన నటించారు.
యమలీల | |
---|---|
సృష్టించిన వారు | ఎస్వీ కృష్ణారెడ్డి |
దర్శకులు | ఎస్వీ కృష్ణారెడ్డి |
తారాగణం | |
Country of origin | భారతదేశం |
Original language(s) | తెలుగు |
No. of seasons | 1 |
ఎపిసోడ్లు సంఖ్య | (List of episodes) |
నిర్మాణము | |
Producer(s) | కొమ్మినేని సురేష్ గణపతి రావు |
నిడివి | 21 నిమిషాలు |
ప్రసారము | |
Original channel | ఈటీవీ |
Original run | 2020 సెప్టెంబర్ 21 – 2022 ఏప్రిల్ 2 |
కథ
మార్చుసూరజ్ (ఆలీ) అతని భార్య నిఖిత ఒక అడవి గుండా కారులో వెళ్తున్నారు. వెళ్లేటప్పుడు వారు ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు. ఆ క్లిష్ట సమయంలో వారికి ఒక్క పాప పుడుతుంది. అదృష్టవశాత్తూ, ఒక గ్రామ మహిళ ఆ పాపను చూస్తుంది. ఆ పాప పేరు చిన్ని. ఇంతలో, ఆమె అమ్మమ్మ శారదాంబ (మంజు భార్గవి) తన మనవరాలి కోసం వెతుకుతూ ఉంటుంది.సూరజ్ ఆత్మ ఎప్పుడూ చిన్నిపై ఓ కన్నేసి ఉంచుతుంది.
తారాగణం
మార్చునటుడు, నటి | పాత్ర |
---|---|
ఆలీ | సూరజ్ |
మంజు భార్గవి | శారదాంబ |
సుమన్ | యముడు |
నిఖితా | సూరజ్ భార్య |
భావన | చిన్ని పెంపుడు తల్లి |
సోనియా సింగ్ | చిన్ని |
నిర్మాణం
మార్చుయమలీల సీక్వెల్, ఆధారంగా దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డిఈ సీరియల్ ను తెరకెక్కించాడు. అలీ, మంజు భార్గవి వరుసగా సూరజ్ అతని తల్లి శారదాంబగా వారి పాత్రలను తిరిగి సీరియల్ లో పోషించారు. సూరజ్ భార్య పాత్ర నిఖితకు దక్కింది. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ స్థానంలో యమగా సుమన్ నటించారు. యూట్యూబర్ సోనియా సింగ్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ కార్యక్రమం 21 సెప్టెంబరు 2020న ప్రారంభించబడింది.
ప్రసారం
మార్చుఈ కార్యక్రమం ఈటీవీ తెలుగులో సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 8:00 గంటలకు ప్రసారం మైంది. ఎపిసోడ్ ఈటీవీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ [1] ఈటీవీ తెలుగు యూట్యూబ్ [2] ఛానెల్‌లో కూడా ప్రసారమైంది. [3] ఈ సీరియల్ 21 సెప్టెంబరు 2020 నుండి ప్రసారం చేయడం ప్రారంభించింది. 2 2022 ఏప్రిల్ 2న ముగిసింది.
మూలాలు
మార్చు- ↑ "ETVWin". Retrieved 2023-03-05.
- ↑ "etvteluguindia - YouTube". www.youtube.com. Retrieved 2021-08-06.
- ↑ "Yamaleela Full Episodes : - YouTube". www.youtube.com. Retrieved 2021-08-06.