భావన(నటి)
భావన (జననం 6 జూన్ 1986), ప్రముఖ దక్షిణ భారత సినీ నటి. ఆమె అసలు పేరు కార్తికా మీనన్. మలయాళంలో దర్శకుడు కమల్ తీసిన నమ్మళ్(2002) సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు భావన. ఈ సినిమాలోని నటనకు ఆమె మంచి ప్రశంసలు అందుకున్నారు. దశబ్దం పాటు కొనసాగిన ఆమె కెరీర్ లో దాదాపు 70 సినిమాల్లో నటించిన భావన, రెండు కేరళ రాష్ట్ర సినీ పురస్కారాలు అందుకున్నారు.
భావన | |
---|---|
![]() భావన | |
జననం | త్రిస్సూర్, కేరళ, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2002 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | నవీన్ (m. 2018) |
తొలినాళ్ళ జీవితం మార్చు
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో జన్మించారు భావన. ఆమె తండ్రి జి.బాలచంద్రన్ సినిమాల్లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్, తల్లి పేరు పుష్ప. ఆమె త్రండ్రి2015 సెప్టెంబరు 24న మరణించారు. ఆమెకు ఒక అన్నయ్య జయదేవ్.[3] త్రిస్సూర్ లోని చెంబుక్కవులో హోలీ ఫ్యామిలీ గర్ల్స్ హై స్కూల్ లో చదువుకున్నారు ఆమె. భావన అన్నయ్య జయదేవ్ తమిళ సినిమా పట్టినప్పాక్కంతో దర్శకుడిగా పరిచయమయ్యారు.[4]
తనకు చిన్నప్పటినుంచీ నటి కావాలని కోరిక ఉండేదని భావన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.[5] తన ఐదేళ్ళ వయసు నుంచి అమలకు అభిమాని అని, మలయాళ చిత్రం ఎంటె సూర్యపుత్రిక్కులో అమల నటనను అద్దంలో చూస్తూ అనుకరిస్తుండేవారని తెలిపారు. ఆ సినిమాలో అమల ఒక సీన్ లో బిల్డింగ్ పైనుంచీ దూకడం చూసి, భావన కూడా అలాగే దూకి, చేయి విరగ్గొట్టుకున్నారని చెప్పారు.[5]
కెరీర్ మార్చు
ఆమె 16వ ఏట[5] మలయాళ చిత్రం నమ్మాళ్ తో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా సమయంలోనే తన పేరు భావనగా మార్చుకున్నారు ఆమె. ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాక, ఆమె నటనకు కూఆ ప్రశంసలు లభించాయి. ఈ విజయంతో ఆమెకు ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. కేరళ రాష్ట్ర స్పెషల్ జ్యూరీ పురస్కారం కూడా అందుకున్నారు భావన. ఆ సినిమాలో నటించేప్పుడు ఆమె 11వ తరగతి చదువుతున్నారు. మలయాళ సినీ రంగంలో ఆ సమయంలో ఉన్న దాదాపు అందరి నటులతోనూ ఆమె నటించారు. తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. తమిళ ప్రముఖ హీరోలైన అజిత్ కుమార్, మాధవన్, జయం రవి, భరత్, జీవా, శ్రీకాంత్ వంటి వారి పక్కన హీరోయిన్ గా నటించారు భావన.[6]
2010లో పునీత్ రాజ్‌కుమార్ సరసన జాకీ అనే కన్నడ సినిమాలో నటించారు భావన. ఇది ఆమె మొట్టమొదటి కన్నడ చిత్రం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయవంతం కావడంతో తెలుగు, మలయాళ భాషల్లోకి కూడా డబ్ చేశారు.[7] ఇమ్రన్ హష్మీ, అమితాబ్ బచ్చన్ ల బాలీవుడ్ సినిమాలో ఆమె నటిస్తారని కూడా అన్నారు.[8] విష్ణువర్ధన్, సుదీప్ లతో కలసి ఆమె తన రెండో కన్నడ సినిమాలో నటించారు. ఈ సినిమాకు మంచి స్పందన లభించింది.[9] 2012లో హనీ బీ, 2013లో ఎళమతే వరవు అనే మలయాళ చిత్రాల్లో నటించారు ఆమె. తరువాత శ్యాంప్రసాద్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ఇవిడేలో ఐటీ కంపెనీలో పనిచేసే సింగిల్ మదర్ పాత్రలో నటించారు భావన. ఈ సినిమాలో అమెరికాలో వరుసగా ఐటి ప్రొఫెషనల్స్ ను చంపుతుంటారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.[10][11]
తెలుగు సినిమాలు మార్చు
మూలాలు మార్చు
- ↑ "Interview with Bhavana". Idlebrain. 8 September 2008. Archived from the original on 23 August 2017. Retrieved 19 January 2014.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;10 things
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Tamil Actress Bhavana Balachandran Photo Gallery | Bhavana's Latest Movie in Telugu is Ontari with P.Gopichand". Actress.telugucinemastills.com. 1986-06-06. Archived from the original on 2012-07-01. Retrieved 2011-01-02.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-21. Retrieved 2017-01-06.
- ↑ 5.0 5.1 5.2 Y. Sunita Chowdhary (2011-07-16). "Arts / Cinema : New-look Bhavana's dream comes true". The Hindu. Retrieved 2011-10-03.
- ↑ "Bhavana going glamorous in film". Times of India. Archived from the original on 2013-04-04. Retrieved 2017-01-06.
- ↑ "Bhavana debuts in Kannada today – Tamil Movie NEWS". IndiaGlitz. Retrieved 2011-10-03.
- ↑ cinema (2011-09-03). "Actress bhavana is all set to make her bollywood debut. | Kottaka.com Blog". Kottaka.com. Archived from the original on 2011-10-04. Retrieved 2011-10-03.
- ↑ "chitraloka | kannada Movies | Kannada Film | News | Reviews | Interviews | Movie Image | Movie Gallery". chitraloka.com. 2011-12-17. Archived from the original on 2013-06-14. Retrieved 2012-09-29.
- ↑ "Watch Making of Prithviraj, Nivin Pauly, Bhavana Starrer 'Ivide' [VIDEO]". International Business Times, India Edition. 30 March 2015.
- ↑ "Shyamaprasad gives artistes their space". The Times of India.