యముడికి మొగుడు (2012 సినిమా)

2012 సినిమా

యముడికి మొగుడు 2012 లో వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం, ఇ. సత్తి బాబు దర్శకత్వంలో, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌లో చంటి అడ్డాల నిర్మించాడు. అల్లరి నరేష్, రిచా పనాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రమ్య కృష్ణ, నరేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లోని పాటలను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచాడు. ఛాయాగ్రహణంని రవీంద్ర బాబు నిర్వహించాడు. ఈ చిత్రం 2012 డిసెంబరు 27 న విడుదలైంది. [1]

యముడికి మొగుడు
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం ఈ. సత్తి బాబు
నిర్మాణం చంటి అడ్డాల
కథ జయ సిద్ధు
చిత్రానువాదం ఈ. సత్తి బాబు
తారాగణం అల్లరి నరేష్
రిచా పనాయ్
సాయాజీ షిండే
రమ్యకృష్ణ
సంగీతం కోటి
గీతరచన రామజోగయ్య శాస్త్రి
సంభాషణలు క్రాంతి రెడ్డి నక్కిన
ఛాయాగ్రహణం రవీంద్ర బాబు
కూర్పు గౌతం రాజు
నిర్మాణ సంస్థ ఫ్రెండ్లీ మూవీస్
నిడివి 157 నిమిషాలు
భాష తెలుగు

కథ మార్చు

బ్రహ్మ దేవుడు చేసిన పొరపాటు వల్ల, నరేష్ ( అల్లరి నరేష్ ) 'తలరాత' లేకుండా ఒక నెల ముందుగానే జన్మించాడు. ఈ కారణంగా, నరేష్‌కు మరణం లేదా వ్యాధి వంటి సాధారణ మానవ లక్షణాలు లేవు. అవి అతని శరీరానికి తెలియనే తెలియవు. అతను పౌరాణిక నాటకాలంటే అతడికి వ్యసనం. వాటిలో చురుకుగా పాల్గొంటాడు. అలాంటి ఒక స్వయంవరం నాటకంలో, యముడి కుమార్తె యమజ ( రిచా పనాయ్ ) ను ఉద్దేశపూర్వకంగా నారద మహర్షి ( నరేష్ ) తీసుకువస్తాడు. యమజ ఆ నాటకంలో నరేష్‌ను వివాహం చేసుకుంటుంది. నిజ జీవితంలో కూడా తన భర్తగా భావించి అతడి వెంటపడుతుంది. ఆమె అతన్ని వేధిస్తూనే ఉంటుంది నెమ్మదిగా, నరేష్ ఆమె భావాలను పంచుకుంటాడు. యముడు ( సయాజీ షిండే ) ఈ విషయం తెలుసుకుని, ఆమెను తిరిగి తీసుకురావడానికి తన కుమారుడు యమగండ (మాస్టర్ భరత్)ను, చిత్ర గుప్తుణ్ణీ ( కృష్ణ భగవాన్ ) పంపుతాడు.

ఈ పనిలో వాళ్ళిద్దరూ విఫలమైనప్పుడు, యముడు స్వయంగా భూమికి వెళ్లి ఆమెను తిరిగి తీసుకువెళతాడు. కానీ నరేష్ యముడి మహిషపు తోకను పట్టుకుని త్రిశంకు స్వర్గానికి వెళతాడు. మారువేషంలో ఉన్న నారదుడి ఆశీర్వాదంతో యమలోకం చేరుకుంటాడు. అక్కడ అతను యముడి భార్య అయో ( రమ్య కృష్ణ ) తో స్నేహం చేస్తాడు. అతని కథ చెప్పి ఆమె మద్దతు సంపాదిస్తాడు. అతడు యమజను వెతకడం, వాళ్ళిద్దరూ కలవాలనుకోవడం, యముడు వాళ్ళిద్దరినీ కలవనీయక పోవడం వగైరాలతో మిగతా సినిమా నడుస్తుంది.

తారాగణం మార్చు

పాటలు మార్చు

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "ఓరోరి మగధీర"  శ్రీకృష్ణ, అంజనాసౌమ్య్ 04:17
2. "పిస్తోలు పిల్లదానివో"  హేమచంద్ర, శ్రావణ భార్గవి 03:39
3. "నరోత్తమా"  వసుంధరా దాస్ 03:31
4. "అత్తో అత్తమ్మ కూతురో"  రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి 03:56
5. "ఝనక్ ఝనక్"  కార్తిక్ 04:44
6. "గోటితో పెకలించు"  రోహిత్ 01:09
7. "మమహో యమ"  చంద్ర తేజ 00:54
22:10

మూలాలు మార్చు

  1. "Yamudiki Mogudu going strong at the box office". 123telugu.com. Retrieved 30 Dec 2012.