యల్లారెడ్డి పురపాలకసంఘం

యల్లారెడ్డి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] యల్లారెడ్డి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

యల్లారెడ్డి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
యల్లారెడ్డి పురపాలకసంఘం is located in తెలంగాణ
యల్లారెడ్డి పురపాలకసంఘం
యల్లారెడ్డి పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°13′02″N 78°02′33″E / 18.2172580°N 78.0423683°E / 18.2172580; 78.0423683
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి
మండలం ఎల్లారెడ్డి
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 8.66 km² (3.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 14,923
 - పురుషుల సంఖ్య 7,493
 - స్త్రీల సంఖ్య 7,430
 - గృహాల సంఖ్య 3,131
పిన్ కోడ్ - 503122
Area code(s) ఎస్.టి.డి కోడ్ - 08465
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

భౌగోళికం మార్చు

యల్లారెడ్డి 8.66 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°11′42″N 78°00′58″E / 18.195°N 78.016°E / 18.195; 78.016 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 144 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం కామారెడ్డి నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 14,923 మంది కాగా, అందులో 7,493 మంది పురుషులు, 7,430 మంది మహిళలు ఉన్నారు. 3131 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[3] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. అల్లం శ్రీనివాస్
  2. ఎం. మహేశ్వరి
  3. జీనథ్ సుల్తానా
  4. ఎరుకల శైలు
  5. ముస్త్యాల సుజాత
  6. సంగని బాలమణి
  7. కె. సత్యనారాయణ
  8. నునుకొండ భూదేవి
  9. గాదే విజయలక్ష్మి
  10. పద్మ శ్రీకాంత్
  11. భుంగరి రాములు
  12. జంగం నీలకంఠం

మూలాలు మార్చు

  1. "Yellareddy Municipality". yellareddymunicipality.telangana.gov.in. Archived from the original on 2021-06-25. Retrieved 2021-06-13.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 June 2021.
  3. admin (2020-05-16). "Yellareddy municipality Councillors list 2020". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-13.

వెలుపలి లంకెలు మార్చు