యూఫ్రటీస్
యూఫ్రటీస్ పశ్చిమ ఆసియాలో అత్యంత పొడవైన నది. చారిత్రికంగా అత్యంత ముఖ్యమైన నదులలో ఒకటి. టైగ్రిస్‌తో కలిసి, మెసొపొటేమియాను ("నదుల మధ్య భూమి").నిర్వచించే నదులలో ఇది ఒకటి.అర్మేనియన్ హైలాండ్స్ ( తూర్పు టర్కీ ) లో ఉద్భవించిన యూఫ్రటీస్ సిరియా, ఇరాక్ గుండా ప్రవహించి, షట్ అల్-అరబ్‌లోని టైగ్రిస్‌లో కలుస్తుంది. పెర్షియన్ గల్ఫ్‌లో సముద్రంలో సంగమిస్తుంది
యూఫ్రటీస్ | |
---|---|
పేరు ఉత్పత్తి | from Greek, from Old Persian Ufrātu, from Elamite ú-ip-ra-tu-iš |
స్థానం | |
దేశం | Turkey, Iraq, Syria |
Basin area | Turkey, Syria, Iraq, Saudi Arabia, Kuwait, Iran |
Cities | Birecik, Raqqa, Deir ez-Zor, Mayadin, Haditha, Ramadi, Habbaniyah, Fallujah, Kufa, Samawah, Nasiriyah |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | Murat Su, Turkey |
• ఎత్తు | 3,520 మీ. (11,550 అ.) |
2nd source | |
• స్థానం | Kara Su, Turkey |
• ఎత్తు | 3,290 మీ. (10,790 అ.) |
Source confluence | |
• స్థానం | Keban, Turkey |
• ఎత్తు | 610 మీ. (2,000 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | Shatt al-Arab |
• స్థానం | Al-Qurnah, Basra Governorate, Iraq |
• అక్షాంశరేఖాంశాలు | 31°0′18″N 47°26′31″E / 31.00500°N 47.44194°E |
పొడవు | 2,800 కి.మీ. (1,700 మై.)approx. |
పరీవాహక ప్రాంతం | 500,000 కి.మీ2 (190,000 చ. మై.)approx. |
ప్రవాహం | |
• స్థానం | Hīt |
• సగటు | 356 m3/s (12,600 cu ft/s) |
• కనిష్టం | 58 m3/s (2,000 cu ft/s) |
• గరిష్టం | 2,514 m3/s (88,800 cu ft/s) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | Balikh, Khabur |
• కుడి | Sajur |
మార్గం
మార్చుపశ్చిమ ఆసియాలో పొడవైన నది యూఫ్రటీస్.[1] ఇది ఆగ్నేయ టర్కీలోని కేబాన్ పట్టణానికి 10 కిలోమీటర్లు ఎగువన, కారా సు లేదా వెస్ట్రన్ యూఫ్రటీస్ (459 కి.మీ.) నది, మురాత్ సు లేదా తూర్పు యూఫ్రటీస్ (650 కి.మీ.) నదుల సంగమంతో ఉద్భవించింది.[2] డౌడీ, ఫ్రెంకెన్‌లు యూఫ్రటీస్ నది పొడవును మురాత్ నది మూలం నుండి టైగ్రిస్‌తో సంగమమయ్యేవరకు లెక్కించి 3000 కి.మీ. అని తేల్చారు. ఇందులో 1230 కి.మీ. టర్కీలోను, 710 కి.మీ. సిరియాఅ లోను, 1060 కి.మీ. ఇరాక్ లోనూ ప్రవహిస్తుంది.[3][4] ఇసేవ్, మిఖైలోవాలు కూడా ఇవే లెక్కలు చెప్పారు.[5] యూఫ్రటీస్, టైగ్రిస్‌లను పెర్షియన్ గల్ఫ్‌తో కలిపే షట్ అల్-అరబ్ పొడవు 145 నుండి 195 కి.మీ. ఉంటుందని వివిధ వర్గాలు చెప్పాయి.[6]
కారా సు, మురాత్ సు రెండూ 3,290 మీటర్లు, 3,520 మీటర్ల ఎత్తున లేక్ వాన్ నుండి వాయవ్య దిశలో ఉద్భవిస్తాయి.[7] కేబాన్ ఆనకట్ట ఉన్న ప్రదేశంలో, యూఫ్రటీస్‌గా కలిసిపోయిన ఈ రెండు నదుల ఎత్తు 693 మీటర్లు ఉంటుంది.కేబాన్ నుండి సిరియా-టర్కీసరిహద్దు వరకుఉన్నసుమారు600 కి.మీ.దూరంవెళ్ళేటప్పటికి నదిఎత్తుమరో368 మీటర్లు తగ్గుతుంది.ఎగువ మెసొపొటేమియామైదానంలోకి ప్రవేశించిన తర్వాత, దాని వాలు గణనీయంగా పడిపోతుంది; సిరియాలో నదిఎత్తు 163 మి. తగ్గుతుంది.హిట్,షట్ అల్-అరబ్ మధ్య చివరిఅంగలోనది55 మీ. మాత్రమే పడిపోతుంది.[2][8]
ప్రవాహం
మార్చుయూఫ్రటీస్ నీటిలో ఎక్కువ భాగం వర్షపాతం, కరిగే మంచు రూపంలో చేరుతుంది. దీని ఫలితంగా ఏప్రిల్ నుండి మే వరకు నదిలో నీరు గరిష్ఠ పరిమాణంలో ఉంటుంది. సంవత్సరంలో ప్రవహించే మొత్తం నీటిలో 36%ఈ రెండు నెలల్లోనే ప్రవహిస్తుంది.మరో అంచనా ప్రకారంఇది60-70 శాతంవరకూ ఉంటుంది. వేసవి, శర్గృతువుల్లో అతి తక్కువ ప్రవాహం ఉంటుంది.[5][9] ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ, మధ్య కాల రికార్డుల ప్రకారం యూఫ్రటీస్ సగటు వార్షిక ప్రవాహం, కేబన్ వద్ద 20.9 క్యూబిక్ కిలోమీటర్లు, హిట్ వద్ద 36.6 క్యూబిక్ కిలోమీటర్లు, హిండియా వద్ద 21.5 క్యూబిక్ కిలోమీటర్లూ ఉంటుంది.[10] అయితే, అత్యధిక అత్యల్ప ప్రవాహాల స్థాయిల మధ్య చాల అంతరం ఉంటూంటుంది. ఉదాహరణకు, సిరియా, టర్కీ సరిహద్దుకు ఉత్తరాన ఉన్న బిరెసిక్ వద్ద, 1963 లో వార్షిక ప్రవాహం అత్యల్పంగా 15.3 క్యూబిక్ కిలోమీటర్లు, అత్యధికంగా 42.7 క్యూబిక్ కిలోమీటర్లు ఉంది.[11]
1970 లలో మొదటి ఆనకట్టల నిర్మాణం నుండి యూఫ్రటీస్ ప్రవాహ ధోరణులు గణనీయంగా మారిపోయాయి.1990 తరువాత సేకరించిన యూఫ్రటీస్ ప్రవాహ డేటాను పరిశీలిస్తే, యూఫ్రటీస్‌లోని అనేక ఆనకట్టల నిర్మాణం, సాగు కోసం నీటిని వాడకాల ప్రభావం కనిపిస్తుంది. చూపుతుంది.1990 తరువాత హిట్ వద్ద వార్షిక సగటు ప్రవాహం 11.2క్యూబిక్ కిలోమీటర్లకు పడిపోయింది.కాలానుగుణంగా ప్రవాహంలో వచ్చే హెచ్చుతగ్గులు కూడా మారాయి.1990 కి పూర్వం హిట్ వద్ద నమోదైన గరిష్ఠప్రవాహం7,510 క్యూ.మీటర్లు/సెకండు కాగా,1990 తరువాత ఇది2.514 క్యూ.మీటర్లు/సెకండుకు పడిపోయింది.హట్ వద్ద కనీస ప్రవాహంలోపెద్దగా మార్పు రాలేదు.[12][13]
ఉపనదులు
మార్చుసిరియాలో సాజుర్, బలిఖ్, ఖబూర్ అనే మూడు నదులు యూఫ్రటీస్‌లో కలుస్తాయి.ఈ నదులు సిరియా-టర్కీ సరిహద్దు వెంబడి ఉన్న టారస్ పర్వతాల పాదాల వద్ద పుడతాయి. వీటిద్వారా యూఫ్రటీస్‌లో కలిసే నీరు పెద్ద మొత్తంలో ఏమీ ఉండదు.ఈ ఉపనదులలో సజుర్ అతి చిన్నది;ఇది టిష్రిన్ ఆనకట్ట యొక్క జలాశయంలో కలుస్తుంది. బలిఖ్ నది రక్కా వద్ద యూఫ్రటీస్ లో కలుస్తుంది.పొడవు, ప్రవాహం, పరీవాహక ప్రాంతాల పరిమాణంలో ఖబూర్ ఈ మూడింటిలోకీ అతిపెద్దది. ఇదిబుస్సేరా సమీపంలో యూఫ్రటీస్ లోకి ప్రవహిస్తుంది.ఇరాక్‌లోకి ప్రవేశించిన తర్వాత, యూఫ్రటీస్‌కు సహజ ఉపనదులు లేవు. కానీ, యూఫ్రటీస్ బేసిన్‌ను టైగ్రిస్ బేసిన్‌తో కలిపే కాలువలు ఉన్నాయి.[14][15]
పేరు | పొడవు | వాటర్‌షెడ్ పరిమాణం | డిశ్చార్జ్ | బ్యాంక్ |
---|---|---|---|---|
కారా సు | 450 కి.మీ. (280 మై.) | 22,000 కి.మీ2 (8,500 చ. మై.) | కూడలి | |
మురత్ నది | 650 కి.మీ. (400 మై.) | 40,000 కి.మీ2 (15,000 చ. మై.) | కూడలి | |
సాజుర్ నది | 108 కి.మీ. (67 మై.) | 2,042 కి.మీ2 (788 చ. మై.) | 4.1 మీ 3 / సె (145 క్యూ అడుగులు / సె) | కుడి |
బలిఖ్ నది | 100 కి.మీ. (62 మై.) | 14,400 కి.మీ2 (5,600 చ. మై.) | 6 మీ 3 / సె (212 క్యూ అడుగులు / సె) | ఎడమ |
ఖబూర్ నది | 486 కి.మీ. (302 మై.) | 37,081 కి.మీ2 (14,317 చ. మై.) | 45 మీ 3 / సె (1,600 క్యూ అడుగులు / సె) | ఎడమ |
పారుదల బేసిన్
మార్చునది
మార్చుబ్రిటీష్ సివిల్ ఇంజనీర్ విలియం విల్కాక్స్ ప్రణాళికల ఆధారంగా ఇరాకీ యూఫ్రటీస్ పై హిండియా బ్యారేజ్ 1913 లో పూర్తయింది. ఇది టైగ్రిస్-యూఫ్రటీస్ నదీ వ్యవస్థలో నిర్మించిన మొట్టమొదటి ఆధునిక నీటి మళ్లింపు నిర్మాణం.[16] హిందీయా బ్యారేజీ తరువాత, 1950 లలో రమాది బ్యారేజ్, సమీపంలోని అబూ డిబ్బిస్ రెగ్యులేటర్లను నిర్మించారు. యూఫ్రటీస్ ప్రవాహాన్ని నియంత్రించడానికి, అధిక వరద నీటిని హబ్బానియా సరస్సు లోకి విడుదల చేయడానికీ ఇవి ఉపయోగపడతాయి.యూఫ్రటీస్ మీద ఇరాక్ కట్టిన అతిపెద్ద ఆనకట్ట, 9 కిలోమీటర్ల పొడవైన హదీతా ఆనకట్ట. ఈ ఆనకట్ట వలన ఖాదీసియా జలాశయం ఏర్పడింది.[17] సిరియా, టర్కీలు 1970 లలో యూఫ్రటీస్‌పై తమ మొదటి ఆనకట్టలను నిర్మించాయి.సిరియాలోని తబ్కా ఆనకట్ట 1973 లో పూర్తయింది, టర్కీ 1974 లో కేబన్ ఆనకట్టను పూర్తి చేసింది. ఈ కేబన్ ఆనకట్ట, భారీ ఆగ్నేయ అనటోలియా ప్రాజెక్టుకు మూలమైంది. ఆ తరువాతసిరియా,యూఫ్రటీస్పైబాత్, టిష్రిన్ అనే మరో రెండు ఆనకట్టలను నిర్మించింది.నాల్గవ ఆనకట్ట - హలాబియే ఆనకట్ట - రక్కా,డీర్ ఇజ్ -జోర్లమధ్య నిర్మించాలని యోచిస్తోంది.[18] తబ్కా ఆనకట్ట సిరియా లోని అతిపెద్ద ఆనకట్ట. దాని జలాశయం (సరస్సు అస్సాద్) సాగునీటికి, తాగునీటికీ ముఖ్యమైన వనరు. అస్సాద్ సరస్సు నుండి6 లక్షల40 వేలహెక్టార్లకు సాగునీరు ఇవ్వాలని తలపెట్టారు. కానీ, 2000 లోలక్ష-లక్షానలభైవేలహెక్టార్ల వరకు మాత్రమే ఇవ్వగలిగారు.[19][20] సిరియా ఖబూర్ నదిపైన, దాని ఉపనదులపైన మూడు చిన్న ఆనకట్టలను కూడా నిర్మించింది.[21]
నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం టైగ్రిస్, యూఫ్రటీస్ జలాలను ఉపయోగించుకోవటానికీ, దాని ఆగ్నేయ ప్రావిన్సులకు ఆర్థిక ఉద్దీపనను అందించడానికి 1970 లలో టర్కీ ఒక ప్రతిష్ఠాత్మక ప్రణాళికను ప్రారంభించింది. అదే ఆగ్నేయ అనటోలియా ప్రాజెక్టు (టర్కీ భాషలోGAP) [22] GAP మొత్తం 75,000 చ.కి.మీ. ప్రాంతాన్ని, సుమారు 70 లక్షల మంది ప్రజలనూ ప్రభావితం చేస్తుంది. ఇది, టర్కీ మొత్తం ఉపరితల వైశాల్యంలోను, జనాభాలోనూ 10 శాతానికి సమానం. ఈ ప్రాజెక్టుపూర్తయినప్పుడు, ఇందులో 22 ఆనకట్టలుంటాయి- కెబాన్ ఆనకట్టతో సహా.19 విద్యుత్ ప్లాంట్లుఉంటాయి. 17 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందిస్తుంది. ఇది,టర్కీలోనిమొత్తంసాగు భూమిలో 20 శాతం.[23] ఇందులో, 9,10,000 హెక్టార్లు యూఫ్రటీస్ బేసిన్లో ఉంది.[24] GAP లో ఇప్పటివరకు కట్టిన అతిపెద్ద ఆనకట్ట అటాటుర్క్ డ్యామ్, ఇది సన్‌లుర్ఫా నుండి వాయవ్యంగా 55 కి.మీ. దూరంలో ఉంది. 184 మీ. ఎత్తు, 1,820 మీటర్ల పొడవు ఉన్న ఈ ఆనకట్ట 1992 లో పూర్తైంది.టర్కీలో మూడవ అతిపెద్ద జలాశయాన్ని సృష్టించింది. దీనిగరిష్ఠ సామర్థ్యం 48.7 క్యూబిక్ కిలోమీటర్లు. యూఫ్రటీస్ నదిలో ఒక సంవత్సరంలో ప్రవహించే మొత్తం నీటిని నిలపగలిగేంత పెద్దది ఈ జలాశయం.[25] యూఫ్రటీస్, టైగ్రిస్‌ల నీటి వినియోగంపై దిగువ దేశాలతో టర్కీకి ఒప్పందం కుదుర్చుకోక పోవడంతో ప్రపంచ బ్యాంకు నిధులను నిలిపివేసింది. అందువల్ల 2010 లోG పూర్తి కావాల్సిన AP పఆలస్యమౌతోంది [26] అమలుతో ఇరాక్ లో బ్యారేజీలు, ఆనకట్టలు కట్టడమే కాకుండా, హబ్బానియా సరస్సు, థార్తార్ సరస్సు అబూ డిబ్బిస్ జలాశయాలను యూఫ్రటీస్‌తో కలిపే కాలువల నెట్‌వర్క్‌ను కూడా సృష్టించింది. ఇవన్నీ అదనపు వరదనీటిని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి.షాట్ అల్-హేయ్ ద్వారా, యూఫ్రటీస్ టైగ్రిస్‌తో అనుసంధానించబడి ఉంది.ఈ నెట్‌వర్క్‌లోని అతిపెద్ద కాలువ, మెయిన్ అవుట్‌ఫాల్ డ్రెయిన్. దీన్ని "మూడవ నది" అంటారు. దీన్ని 1953 - 1992 మధ్య నిర్మించారు.ఈ565కిలోమీటర్లకాలువ,నీటిపారుదలవలననేల లవణీకరణంచెందకుండా,నీటిని డ్రెయిన్ చేసేందుకు ఉద్దేశించారు.ఇది బాగ్దాద్ వరకు పెద్ద సరుకు రవాణా పడవల ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.[27][28][29]
చరిత్ర
మార్చుపాలియోలిథిక్ నుండి చాల్‌కోలిథిక్ కాలాలు
మార్చుయూఫ్రటీస్ బేసిన్లో తొలి మానవ ఆవాసాలు దాని ఎగువ ప్రాంతాలకు పరిమితమై ఉండేవి. అంటే, సారవంతమైన నెలవంకగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. సజూర్ బేసిన్లోను, మధ్య సిరియా స్టెప్పీల్లోని ఎల్ కౌన్ ఒయాసిస్ వద్దనూ అషూలియన్ రాతి పనిముట్లు దొరికాయి.ఎల్ కౌన్ వద్ద 4,50,000 సంవత్సరాల నాటి హోమో ఎరెక్టస్ అవశేషాలతో సహా దొరికాయి.[30][31] టారస్ పర్వతాల్లో, సిరియన్ యూఫ్రటీస్ లోయ ఎగువ భాగంలో, అబూ హురేరా వంటి తొలి శాశ్వత గ్రామాలు ఉన్నాయి. మొదట్లో వేటాడి, సేకరించుకునే మానవులు ఉండేవారు. తరువాత వ్యవసాయం చేసే మానవులు ఆక్రమించారు. జెర్ఫ్ ఎల్-అహ్మర్, మురీబెట్, నెవాల్ ఓరి నుండి స్థాపించారు క్రీస్తుపూర్వం పదకొండవ సహస్రాబ్దిలో విలసిల్లాయి.[32] నీటిపారుదల లేనందున, ఈ తొలి వ్యవసాయ సమాజాలు వర్షాధార వ్యవసాయం సాధ్యమయ్యే ప్రాంతాలకే, అనగా సిరియన్ యూఫ్రటీస్, టర్కీ ఎగువ భాగాలకే, పరిమితమయ్యారు.[33] క్రీస్తుపూర్వం 7 వ సహస్రాబ్ది ప్రారంభంలో కుండల వాడకం మొదలైన చివరి కొత్తరాతియుగంలో ఈ ప్రాంతమంతటా గ్రామాలు వచ్చాయి.[34] దిగువ మెసొపొటేమియాలో ఆవాస స్థావరాలు 6 వ సహస్రాబ్దిలో ప్రారంభమయ్యాయి. నీటిపారుదల సౌకర్యంతో ఇవి ముడిపడి ఉండేవి. ఎందుకంటే ఈ ప్రాంతంలో పడే వర్షపాతం మెట్ట వ్యవసాయానికి సరిపోదు.టెల్ ఎస్-సావాన్తో సహా ఈ కాలానికి చెందిన అనేక సైట్లలో నీటిపారుదల జరిగేదని చెప్పే ఆధారాలు కనిపించాయి.[35] క్రీస్తుపూర్వం 5 వ సహస్రాబ్దిలో లేదా ఉబైద్ చివరిలో, ఈశాన్య సిరియాలో చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. వాటిలో 25 ఎకరాల పరిమాణానికి పెరిగాయి.[36] ఇరాక్‌లో, ఉబైద్ కాలంలో ఎరిడు, ఉర్ వంటి సైట్లలో అప్పటికే నివాసాలుండేవి.[37] ఖబూర్ వెంట టెల్ మష్నాకా వద్ద దొరికిన క్లే బోట్ నమూనాలు ఈ కాలంలో ఇప్పటికే నదీ రవాణా సాధనలో ఉన్నాయని సూచిస్తున్నాయి.[38] క్రీస్తుపూర్వం 4 వ సహస్రాబ్ది నాటి ఉరుక్ కాలంలో, మెసొపొటేమియా అంతటా అసలైన పట్టణ స్థావరాలు వెలుగు చూసాయి.టెల్ బ్రాక్, ఉరుక్ వంటి నగరాలు 250 ఎకరాల పరిమాణానికి పెరిగాయి. స్మారక నిర్మాణ కళను ప్రదర్శించాయి.[39] దక్షిణ మెసొపొటేమియన్ కుండలు, వాస్తుశిల్పం, సీలింగ్‌లను టర్కీ, ఇరాన్‌లలోకి విస్తరించడాన్ని బట్టి విస్తృతమైన వాణిజ్య వ్యవస్థ ఉండేద్ని తెలుస్తోంది.
పురాతన చరిత్ర
మార్చుజెమ్డెట్ నాస్ర్ కాలం లోను (క్రీ.పూ. 3600–3100), తొలి రాజవంశాల కాలం లోనూ (క్రీ.పూ. 3100–2350), దక్షిణ మెసొపొటేమియా ఆవాస స్థావరాలు సంఖ్య లోనూ, పరిమాణంలోనూ పెరిగాయి. ఇది బలమైన జనాభా పెరుగుదలను సూచిస్తుంది.సిప్పార్, ఉరుక్, అడాబ్, కిష్ వంటి సుమేరో అక్కాడియాన్ వంటి సైట్లతో సహా, ఈ స్థావరాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడే నగర రాజ్యాలుగా ఏర్పాటయ్యాయి.[40] ఈ నగరాల్లో చాలావరకు, యూఫ్రటీస్, టైగ్రిస్ ల కాలువల వెంట ఉన్నాయి. ఈ కాలువలు తరువాతి కాలంలో ఎండిపోయాయి. కాని రిమోట్ సెన్సింగ్ ఇమేజరీ ద్వారా ఇప్పటికీ వాటిని గుర్తించవచ్చు.[41] ఇదే విధమైన అభివృద్ధి ఎగువ మెసొపొటేమియా, సుబార్టు, అస్సిరియాల్లోనూ జరిగింది -కాకపోతే, ఇది 3 వ సహస్రాబ్ది మధ్య నుండి జరిగింది, దిగువ మెసొపొటేమియా కంటే తక్కువ స్థాయిలో జరిగింది.ఈ కాలంలో ఎబ్లా, మారి, టెల్ లీలాన్ వంటి సైట్లు మొదటిసారిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.[42]
యూఫ్రటీస్ బేసిన్ లోని విశాలమైన ప్రాంతాలు మొదటిసారిగా అక్కాడియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 2335–2154), ఉర్ III సామ్రాజ్యాలలో ఒకే పాలకుడి క్రింద ఐక్యమయ్యాయి. ఇవి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా సామంతుల ద్వారా గానీ ఆధునిక ఇరాక్‌ను, ఈశాన్య సిరియానూ పాలించారు.[43] వారి పతనం తరువాత, పాత అస్సీరియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 1975–1750), మారి ఈశాన్య సిరియా, ఉత్తర మెసొపొటేమియాపై ఆధిపత్యాన్ని సాధించారు. దక్షిణ మెసొపొటేమియాను ఇసిన్, కిష్, లార్సా వంటి నగర-రాజ్యాలు పాలించాయి. క్రీ.పూ. 18 వ శతాబ్దం ప్రారంభం నుండి మధ్యకాలం లోపు హమ్మురాబి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన బాబిలోనియా రాష్ట్రంలో ఇవి కలిసిపోయాయి.[44]
సా.పూ. 2 వ సహస్రాబ్ది రెండో అర్ధ భాగంలో, యూఫ్రటీస్ బేసిన్‌లో దక్షిణాన కస్సైట్ బాబిలోన్ సాఅమ్రాజ్యం, ఉత్తరాన మిటాన్నీ, అష్షూరు, హిట్టైట్ సామ్రాజ్యాలు ఉండేవి. హిట్టైట్లను, మిటాన్నీ, కస్సైట్ బాబిలోనియన్లను మధ్య అస్సీరియన్ సామ్రాజ్యం (1365-1020 BC) తనలో కలిపేసుకుంది.[45] క్రీస్తుపూర్వం 11 వ శతాబ్దం చివరలో మధ్య అస్సీరియన్ సామ్రాజ్యం అంతరించాక, ఇరాకీ యూఫ్రటీస్ బేసిన్‌పై నియంత్రణ కోసం బాబిలోనియా, అస్సిరియాల మధ్య పోరాటాలు జరిగాయి. చివరికినియో-అస్సీరియన్ సామ్రాజ్యం (క్రీ.పూ. 935-605) విజయం సాధించింది. క్రీస్తుపూర్వం 1 వ సహస్రాబ్ది మొదటి భాగంలో ఉత్తర యూఫ్రటీస్ బేసిన్‌పై కూడా నియంత్రణ సాధించడంలో విజయవంతమైంది.[46]
ఆ తరువాతి శతాబ్దాలలో యూఫ్రటీస్ బేసిన్ పై నియంత్రణ నియో-అస్సిరియన్ సామ్రాజ్యం నుండి (ఇది క్రీ.పూ. 612 - 599 మధ్య కుప్పకూలింది) కొద్దికాలం పాటు మెడెస్ సామ్రాజ్యం చేతిలోకి (క్రీ.పూ. 612–546), ఆ తరువాత, క్రీస్తుపూర్వం 7 వ శతాబ్దం చివరి సంవత్సరాల్లో కొద్ది కాలం పాటు నియో-బాబిలోనియన్ సామ్రాజ్యం (612– 539 BC) చేతుల్లోకీ వెళ్ళింది. చివరికి అకెమెనీడ్ సామ్రాజ్యం (క్రీ.పూ. 539–333) హస్తగతమైంది.[47] అకెమెనీడ్ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ జయించాడు. అతను అకెమినీడ్ల చివరి రాజు డారియస్ III ను ఓడించాడు. అలెగ్జాండరు క్రీ.పూ 323 లో బాబిలోన్లో మరణించాడు.[48]
దీని తరువాత, ఈ ప్రాంతం సెల్యూసిడ్ సామ్రాజ్యం (క్రీ.పూ. 312–150), పార్థియన్ సామ్రాజ్యాలు (సా.శ. 150–226) (ఈ సమయంలో అడియాబెనే వంటి అనేక నియో-అస్సిరియన్ రాజ్యాలు యూఫ్రటీస్ లోని కొన్ని ప్రాంతాలను పాలించాయి) పాలించాయి. దాని తరువాత వచ్చిన బైజాంటైన్ సామ్రాజ్యం, సస్సానిడ్ సామ్రాజ్యాల (సా.శ. 226–638) తరువాత రోమన్ల చేతుల్లోకి వెళ్ళింది. క్రీస్తుశకం 7 వ శతాబ్దం మధ్యలో ఇస్లామిక్ ఆక్రమణల వరకూ రోమన్ సామ్రాజ్యం చేతుల్లోనే ఉంది.సా.శ. 680 లో ఈ నది ఒడ్డునేకర్బాలా యుద్ధం జరిగింది.
ఉత్తరాన, ఈ నది గ్రేటర్ అర్మేనియా (క్రీ.పూ. 331 -428), లెస్సర్ అర్మేనియాల మధ్య సరిహద్దుగా పనిచేసింది. (లెస్సర్ అర్మేనియాల క్రీ.పూ 1 వ శతాబ్దంలో రోమన్ ప్రావిన్స్‌గా మారింది).
ఆధునిక యుగం
మార్చుమొదటి ప్రపంచ యుద్ధం తరువాత, ఒట్టోమన్ సామ్రాజ్యం విభజించబడినప్పుడు, నైరుతి ఆసియాలోని సరిహద్దులను లౌసాన్ ఒప్పందంలో (1923) తిరగరాసారు.ఒప్పందం లోని 109 వ నిబంధన ప్రకారం, యూఫ్రటీస్ యొక్క మూడు పరీవాహక దేశాలు (ఆ సమయంలో టర్కీ, సిరియా తరపున ఫ్రాన్స్, ఇరాక్ తరపున యునైటెడ్ కింగ్‌డమ్ ) దాని నీటి వినియోగం గురించి, దానిపై కట్టే ఆనకట్టల గురించి పరస్పర ఒప్పందం కుదుర్చుకోవలసి వచ్చింది.ఉల్లేఖన లోపం: చెల్లని <ref>
ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి 1946 లో సంతకాలైన టర్కీ ఇరాక్ ల మధ్య ఒప్పందం ప్రకారం టైగ్రిస్-యూఫ్రటీస్ నదీ వ్యవస్థపై టర్కీ ఏమైనా హైడ్రాలిక్ మార్పులు చేస్తే ఇరాక్‌కు నివేదించవలసి ఉంది. యూఫ్రటీస్ ప్రవాహాన్ని నియంత్రించడానికి గాను, టర్కీ భూభాగంలో ఆనకట్టలను నిర్మించడానికి ఇరాక్‌ను అనుమతించింది.[49]
ఈ నది 1932 నుండి 1959 వరకు ఇరాక్ యొక్క కోట్ ఆఫ్ ఆర్స్మ్ మీద ఉంది.
టర్కీ, సిరియాలు యూఫ్రటీస్‌పై తమ మొదటి ఆనకట్టలను - కేబాన్ ఆనకట్ట, తబ్కా ఆనకట్టలను - ఒక సంవత్సరం తేడాలో పూర్తి చేశాయి. జలాశయాలను నింపడం 1975 లో ప్రారంభమైంది.అదే సమయంలో, ఈ ప్రాంతం తీవ్ర కరువుతో దెబ్బతింది. ఇరాక్ వైపు నదీ ప్రవాహం 1973 నాటి 15.3 క్యూబిక్ కిలోమీటర్ల నుండి 1975 లో 9.4 క్యూబిక్ కిలోమీటర్లకు తగ్గిపోయింది.ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసింది.ఈ సమయంలో ఇరాక్ తబ్కా ఆనకట్టపై బాంబు దాడి చేస్తానని బెదిరించింది.సౌదీ అరేబియా, సోవియట్ యూనియన్ ల జోక్యంతో సిరియా, ఇరాక్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.[50][51] టర్కీలో జలవిద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా పెంచడానికి, కేబాన్ డ్యామ్ రిజర్వాయరును దాదాపుగా ఖాళీ చేసిన తరువాత, 1981 లో తిరిగి నింపవలసి వచ్చినప్పుడు, ఇదే విధమైన సంక్షోభం తలెత్తింది. కానీ, సైనిక బెదిరింపుల వరకు పెరగలేదు.[52] ఏడాదికి కనీసం 16 క్యూబిక్ కిలోమీటర్ల ప్రవాహం సిరియా లోకి ఉండేలా చూస్తామని1984 లో టర్కీ టర్కీ ఏకపక్షంగా ప్రకటించింది. ఈ మేరకు 1987 లో టర్కీ, సిరియాల మధ్య ఒప్పందం కుదిరింది.[53] సిరియా, ఇరాక్ ల మధ్య 1989 లో జరిగిన మరో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, సిరియా టర్కీ నుండి వచ్చే నీటి మొత్తంలో 60 శాతాన్ని ఇరాక్‌లోకి వదిలేస్తుంది.[49][51][54] 2008 లో, టర్కీ, సిరియా, ఇరాక్ టైగ్రిస్-యూఫ్రటీస్ బేసిన్లో నీటి నిర్వహణపై ఉమ్మడి త్రైపాక్షిక కమిటీ (జెటిసి) ను తలపెట్టి, 2009 సెప్టెంబరు 3 న ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.[55] 2014 ఏప్రిల్ 15 న, టర్కీ, సిరియా లోకీ ఇరాక్‌లోకీ యూఫ్రటీస్ ప్రవాహాన్ని తగ్గించడం ప్రారంభించింది. 2014 మే 16 న ఈ ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఫలితంగా యూఫ్రటీస్ టర్కీ-సిరియా సరిహద్దు వద్దే ఆగిపోయింది.[56] ఇది 1987 లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించింది.ఉల్లేఖన లోపం: చెల్లని <ref>
ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి
సిరియన్ అంతర్యుద్ధం, ఇరాకీ అంతర్యుద్ధం సమయంలో, 2014 నుండి 2017 లో బాఘౌజ్ యుద్ధంలో ఓడిపోయే వరకు యూఫ్రటీస్ చాలావరకు ఇస్లామిక్ స్టేట్ నియంత్రణలో ఉంది.[57]
ఆర్థికం
మార్చుచరిత్ర అంతటా, యూఫ్రటీస్ దాని ఒడ్డున నివసించేవారికి జీవధారగా ఉండేది.పెద్ద జలవిద్యుత్ కేంద్రాలు, నీటిపారుదల పథకాలు, పైప్‌లైన్ల నిర్మాణంతో చాలా దూరాలకు నీటిని రవాణా చేయగల సామర్థ్యం ఉన్నందున, గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు ప్రజలు విద్యుత్తు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఈ నదిపై ఆధారపడుతున్నారు.సిరియాలోని అస్సాద్ సరస్సు అలెప్పో నగరానికి తాగునీటిని అందించే అతి ముఖ్యమైన వనరు. ఈ సరస్సు ఈ నదీ లోయకు పశ్చిమాన 75 కి.మీ. దూరంలో ఉంది.[58] ఈ సరస్సు కొద్దిపాటి ఫిషింగ్ పరిశ్రమకు మద్దతు ఇస్తుంది.[59] కొత్తగా పునరుద్ధరించబడిన విద్యుత్ లైన్ ద్వారా, ఇరాక్‌లోని హదీతా ఆనకట్ట బాగ్దాద్‌కు విద్యుత్తును అందిస్తుంది.[60]
మూలాలు
మార్చు- ↑ Zarins 1997, p. 287
- ↑ 2.0 2.1 Iraqi Ministries of Environment, Water Resources and Municipalities and Public Works 2006a, p. 71
- ↑ Daoudy 2005, p. 63
- ↑ Frenken 2009, p. 65
- ↑ 5.0 5.1 Isaev & Mikhailova 2009, p. 384
- ↑ Isaev & Mikhailova 2009, p. 388
- ↑ Mutin 2003, p. 2
- ↑ Bilen 1994, p. 100
- ↑ Iraqi Ministries of Environment, Water Resources and Municipalities and Public Works 2006a, p. 91
- ↑ Isaev & Mikhailova 2009, p. 385
- ↑ Kolars 1994, p. 47
- ↑ Isaev & Mikhailova 2009, p. 386
- ↑ Iraqi Ministries of Environment, Water Resources and Municipalities and Public Works 2006a, p. 94
- ↑ Hillel 1994, p. 95
- ↑ Hole & Zaitchik 2007
- ↑ Kliot 1994, p. 117
- ↑ Iraqi Ministries of Environment, Water Resources and Municipalities and Public Works 2006b, pp. 20–21
- ↑ Jamous 2009
- ↑ Elhadj 2008
- ↑ Mutin 2003, p. 4
- ↑ Mutin 2003, p. 5
- ↑ Kolars & Mitchell 1991, p. 17
- ↑ Jongerden 2010, p. 138
- ↑ Frenken 2009, p. 62
- ↑ Isaev & Mikhailova 2009, pp. 383–384
- ↑ Jongerden 2010, p. 139
- ↑ Kolars 1994, p. 53
- ↑ Daoudy 2005, p. 127
- ↑ Hillel 1994, p. 100
- ↑ Muhesen 2002, p. 102
- ↑ Schmid et al. 1997
- ↑ Sagona & Zimansky 2009, pp. 49–54
- ↑ Akkermans & Schwartz 2003, p. 74
- ↑ Akkermans & Schwartz 2003, p. 110
- ↑ Helbaek 1972
- ↑ Akkermans & Schwartz 2003, pp. 163–166
- ↑ Oates 1960
- ↑ Akkermans & Schwartz 2003, pp. 167–168
- ↑ Ur, Karsgaard & Oates 2007
- ↑ Adams 1981
- ↑ Hritz & Wilkinson 2006
- ↑ Akkermans & Schwartz 2003, p. 233
- ↑ van de Mieroop 2007, p. 63
- ↑ van de Mieroop 2007, p. 111
- ↑ van de Mieroop 2007, p. 132
- ↑ van de Mieroop 2007, p. 241
- ↑ van de Mieroop 2007, p. 270
- ↑ van de Mieroop 2007, p. 287
- ↑ 49.0 49.1 Geopolicity 2010, pp. 11–12
- ↑ Shapland 1997, pp. 117–118
- ↑ 51.0 51.1 Kaya 1998
- ↑ Kolars 1994, p. 49
- ↑ Daoudy 2005, pp. 169–170
- ↑ Daoudy 2005, pp. 172
- ↑ Geopolicity 2010, p. 16
- ↑ Anjarini, Suhaib (30 May 2014). "A new Turkish aggression against Syria: Ankara suspends pumping Euphrates' water". Al Akhbar. Archived from the original on 16 June 2018. Retrieved 20 June 2014.
- ↑ "Mideast Water Wars: In Iraq, A Battle for Control of Water" (in అమెరికన్ ఇంగ్లీష్).
- ↑ Shapland 1997, p. 110
- ↑ Krouma 2006
- ↑ O'Hara 2004, p. 3