రంది (తెలంగాణ కథ 2013)


రంది (తెలంగాణ కథ 2013) అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన తొలి పుస్తకం ఇది. 2013లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలు రాసిన 18 మంచి కథలతో ఈ సంకలనంగా వెలువడింది.[1]

రంది (తెలంగాణ కథ 2013)
రంది (తెలంగాణ కథ 2013) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
స్కైబాబ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2014

సంపాదకులుసవరించు

పుస్తకం గురించిసవరించు

దళిత, బహుజన, ముస్లిం వర్గాల నుంచి కొత్తగా రాస్తున్న, కొత్త జీవితాలను చూపుతున్న రచయితలు రాసిన కథలు ఎంపికచేయబడ్డాయి. ఈ సంకలనంలో ప్రతి రచయిత పరిచయమూ ఇవ్వబడింది. అలాగే ప్రతి రచయితా ఉద్యమ సమయంలో ఏమేమీ పోరాటాలు చేశారో కూడా పుస్తకంలో వివరించబడింది.

ఆవిష్కరణసవరించు

2014, డిసెంబరు 29న హైదరాబాదులోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ లో ఈ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. స్కైబాబ అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆడెపు లక్ష్మీపతి పుస్తకాన్ని ఆవిష్కరించాడు. డా. ముదిగంటి సుజాతారెడ్డి, కె. శ్రీనివాస్‌, బోయ జంగయ్య, బి.ఎస్‌. రాములు, కాలువ మల్లయ్య, దిలావర్‌, దేవులపల్లి కృష్ణమూర్తి, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, సదానంద శారద, కందుకూరి రమేష్‌బాబు, కథకులు రచయితలు పాల్గొన్నారు.[2]

విషయసూచికసవరించు

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 పెంజీకటి డాక్టర్ పసునూరి రవీందర్
2 నల్లజెండా జూపాక సుభద్ర
3 ఝాన్సీ హెచ్.ఎం చెన్నూరి సుదర్శన్
4 బత్తెం గాదె వెంకటేష్
5 సంగీత కవిత. కె
6 దారి తెలిసిన వేకువ బెజ్జారపు వినోద్‌కుమార్
7 చివరి చూపు కె.వి. నరేందర్
8 బిందెడు నీళ్లు పెద్దింటి అశోక్ కుమార్
9 పరాయిగ్రహం బెజ్జారపు రవీందర్
10 బుగాడ బూతం ముత్యాలు
11 నాన్న.. ఒక వర్షం రోజు డా.కాంచనపల్లి
12 బిడ్డ పురిటికొచ్చింది హనీఫ్
13 ఉసురు పర్కపెల్లి యాదగిరి
14 మర్రిచెట్టు మన్నె ఏలియా
15 బిల్లి షాజహానా
16 గద్వాల్జాతర డా.కె.నాగేశ్వరాచారి
17 సాహిల్ వస్తాడు అఫ్సర్
18 అంటు స్కైబాబ

మూలాలుసవరించు

  1. "రంది: వెలుగు తెప్పించే తెలంగాణ కథలు..." Sakshi. 2015-02-13. Archived from the original on 2019-08-29. Retrieved 2021-12-03.
  2. "'రంది' తెలంగాణ కత 2013 ఆవిష్కరణ". m.andhrajyothy.com. 2014-12-22. Archived from the original on 2021-12-03. Retrieved 2021-12-03.