రంభ రాంబాబు 1990 లో వచ్చిన తెలుగు ఫాంటసీ కామెడీ చిత్రం, శ్రీ లక్ష్మి దుర్గా మూవీస్ పతాకంపై జి. మట్టయ్య, ఎంఎస్ఆర్ ప్రసాద్ నిర్మించారు. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు . ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, పారిజాత ప్రధాన పాత్రల్లో నటించారు. మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[2]

రంభ రాంబాబు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం రేలంగి నరసింహారావు
నిర్మాణం జి.మట్టయ్య
ఎం..ఎస్.ఆర్.ప్రసాద్
కథ రేలంగి నరసింహారావు
చిత్రానువాదం రేలంగి నరసింహారావు
సంగీతం మాధవపెద్ది సురేష్
సంభాషణలు పాటిబండ్ల ఆనందరావు
ఛాయాగ్రహణం కబీర్ లాల్
కూర్పు మురళి రామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి దుర్గా మూవీస్
భాష తెలుగు

రాంబాబు (రాజేంద్ర ప్రసాద్) ఒక అమాయక వ్యక్తి. తాను అప్సరస రంభను పెళ్ళి చేసుకుంటానని అతనికి బలమైన నమ్మకం. అందరూ అతనిని ఎగతాళి చేస్తూంటారు. ఒక వైపు, అతని తల్లి జానకమ్మ (కాకినాడ శ్యామల) సంబంధాలు చూస్తూంటే, మరోవైపు అతని మేనమామ గరళకంఠం (సుత్తి వేలు) తన కుమార్తె చిట్టితల్లి (శ్రీదేవి) ని అతడికిచ్చి, అతడి ఆస్తిని లాక్కోవడానికి ప్లానేస్తూంటాడు. ఆలయ పూజారి (సాక్షి రంగారావు) సలహా మేరకు, రాంబాబు తపస్సు చేసి, రంభ (పరిజాత) ను భూమికి తీసుకువస్తాడు. వారిద్దరూ నారద ముని (చంద్ర మోహన్) ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకుంటారు. కానీ జానకమ్మ దానిని నమ్మదు. వారిద్దరినీ విడదీసేందుకు గరళకంఠంతో కలిసి అనేక ప్రణాళికలు వేస్తుంది. అన్నీ విఫలమౌతాయి.

ఒకసారి రంభ, రంబాబు నారదుడిని అవమానిస్తారు. అతను తెలివిగా ఇంద్రునితో వారి వివాహ రహస్యాన్ని వెల్లడిస్తాడు. రంభను జైలులో పెడతారు. రాంబాబు, తన సంకల్ప శక్తితో, స్వర్గానికి చేరుకుంటాడు. ఇంద్రుడిని ఓడించి, రంభను తిరిగి పొందుతాడు. చివరికి, రాంబాబు నరకానికి కూడా వెళతాడు. అక్కడ అతను యమ ధర్మరాజు (దాసరి నారాయణరావు) సభను రహస్యంగా గమనించి, మానవుని పాపాలను చదువుతాడు. భూమికి తిరిగి వచ్చిన తరువాత, అతను దానిని ప్రజలకు వెల్లడిస్తాడు. నివారణలు కూడా చెబుతాడు. అందువల్ల, పాపులు ఎవరూ నరకంలోకి ప్రవేశించరు. నారదముని యముణ్ణి ఇంద్రుని పైకి రెచ్చగొట్తడంతో వారి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. కానీ దీనంతటికీ కారణం రంభ, రాంబాబులని వారు గ్రహిస్తారు. కాబట్టి, వారు వారిద్దరినీ స్వర్గానికి పిలుస్తారు. ఇక్కడ, ఇంద్రుడు రాంబాబును శిక్షించడానికి ప్రయత్నిస్తాడు. రంభ అతణ్ణి అడ్డుకుంటుంది. కాబట్టి, ఇంద్రుడు రాంబాబును శిలగా మారుస్తాడు. చివరికి ఇదంతా రాంబాబు కల అని తేలుతుంది. ఇప్పుడు జానకమ్మ బలవంతంగా అతడికి పెళ్ళి ఏర్పాట్లు చేస్తుంది. అదృష్టవశాత్తూ, వధువు కలలో చూసిన అమ్మాయే కావడంతో రాంబాబు సంతోషంగా ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు

మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[3]

ఎస్. పాట సాహిత్యం గాయనీ గాయకులు నిడివి
1 "రంభా రంభా" అచ్రయ ఆత్రేయ మనో, ఎస్పీ శైలజ 4:52
2 "ప్రియతమా పిలువకుమా" ముళ్ళపూడి శాస్త్రి పి. సుశీలా 4:22
3 "కూరా కూరా గోంగూరా" అచ్రయ ఆత్రేయ ఎస్పీ బాలు, పి.సుశీల 4:29
4 "బాలామణీ రావే" అచ్రయ ఆత్రేయ మనో 4:45
5 "వాగ్దానములు" (పద్యం) పాతిబండ్ల ఆనంద రావు మాధవపెద్ది రమేష్ 1:09

బయటిలింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Ramba Rambabu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-07-20. Retrieved 2020-08-10.
  2. "Ramba Rambabu (Review)". The Cine Bay. Archived from the original on 2022-01-24. Retrieved 2020-08-10.
  3. "Ramba Rambabu (Songs)". Cineradham.