మాధవపెద్ది సురేష్

మాధవపెద్ది సురేష్ ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులు. టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో పరివర్తన సినిమాలో SP బాలు పాటకి ఎకార్డియన్ వాయించి సినీ రంగ ప్రవేశం చేశారు.[1]

మాధవపెద్ది సురేష్
జననం
మాధవపెద్ది సురేష్ చంద్ర

సెప్టెంబరు 8, 1951
తెనాలి (పెరిగింది విజయవాడ)
ఇతర పేర్లుభైరవద్వీపం సురేష్
వృత్తిసినీ సంగీత దర్శకుడు
జీవిత భాగస్వామినిర్మల
పిల్లలుఅబ్బాయి (నాగసాయి శరత్‌చంద్ర), అమ్మాయి (నాగలక్ష్మి)
తల్లిదండ్రులు
  • నాగేశ్వరరావు (తండ్రి)
  • వసుంధరాదేవి (తల్లి)

జీవితం

మార్చు

సురేష్ 1951 సెప్టెంబరు 8 న తెనాలిలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు వసుంధరా దేవి, నాగేశ్వరరావు. తల్లి సంగీతంలో, భరతనాట్యంలో కళాకారిణి. తండ్రి నటుడు. చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి పెంచుకున్న సురేష్ 1967 లో విజయవాడ శ్రీరామనవమి ఉత్సవాల్లో హార్మోనియం వాయించాడు. అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. సోదరుడు రమేష్ నేపథ్య గాయకుడిగా కెరీర్ ప్రారంభించాడు.

టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన పరివర్తన సినిమాలో సురేష్ మొదటిసారిగా అకార్డియన్ అనే పరికరాన్ని వాయించాడు. తర్వాత కీబోర్డు ప్లేయరుగా పెండ్యాల, సాలూరి రాజేశ్వరరావు, ఎం. ఎస్. విశ్వనాథన్, కె. వి. మహదేవన్, రమేష్ నాయుడు, జె. వి. రాఘవులు, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, బప్పీలహరి, హంసలేఖ మొదలైన సంగీతదర్శకుల దగ్గర సుమారు 1000 చిత్రాలకు పనిచేశాడు. 1979 నుంచి 1985 దాకా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం బృందంతో పాటు కీబోర్డు ప్లేయరుగా ప్రదర్శనలిచ్చాడు.

జంధ్యాల సినిమా హై హై నాయకా సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. బృందావనం సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది. భైరవద్వీపం చిత్రానికి సురేష్ అందించిన సంగీతం అతని కెరీర్ లో అత్యున్నతమైన స్థాయి.

సినిమాలు

మార్చు

ఇతడు దర్శకత్వం వహించిన సినిమాల జాబితా:

సీరియళ్ళు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమి


బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. మధురవాణి. "మాధవపెద్ది సురేష్ గారి సంగీత స్వర్ణోత్సవం సందర్భంగా." www.madhuravani.com. Archived from the original on 6 జూలై 2017. Retrieved 31 August 2017.