వివాహ భోజనంబు
1988 సినిమా
వివాహ భోజనంబు జంధ్యాల దర్శకత్వంలో 1988 లో విడుదలైన హాస్యచిత్రం.[1] రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, అశ్వని ప్రధాన పాత్రలు పోషించారు.
వివాహ భోజనంబు | |
---|---|
దర్శకత్వం | జంధ్యాల |
నిర్మాత | జంధ్యాల |
రచన | జంధ్యాల |
నటులు | రాజేంద్ర ప్రసాద్ , అశ్వని |
సంగీతం | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం |
నిర్మాణ సంస్థ | జె. జె. మూవీస్ |
విడుదల | 1988 |
భాష | తెలుగు |
ఈ సినిమా పేరును మాయాబజార్ సినిమాలోని ప్రసిద్ధిచెందిన వివాహ భోజనంబు వింతైన వంటకంబు స్ఫూర్తితో పెట్టారు.
విషయ సూచిక
కథసవరించు
సీతారాముడు స్త్రీలంటే ద్వేషిస్తూ ఉంటాడు. వారి చేతిలో మోసపోయిన వారికోసం ఒక సంఘం కూడా నడుపుతూ ఉంటాడు. తన తమ్ముడు కృష్ణని ఆడగాలి సోకనీయకుండా పెంచుతూ ఉంటాడు. సీతారాముడి అక్క తనతో ఉండటానికి వచ్చినా ఆమెను తనతో ఉండనీడు. తనకు స్త్రీల మీద ద్వేషం కలగడానికి ఓ సంఘటన కారణమై ఉంటుంది. సీతారాముడి అక్క భర్త తన బావమరిది జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుంటాడు.
తారాగణంసవరించు
- సీతారాముడు గా రాజేంద్ర ప్రసాద్
- అశ్వని
- చంద్రమోహన్
- కృష్ణ గా హరీష్
- శుభలేఖ సుధాకర్
- సుత్తి వీరభద్ర రావు
- బ్రహ్మానందం
- నిప్పు అప్పలసామి గా సుత్తివేలు
- నూట పదకొండు గా గుండు హనుమంతరావు
- శంకరాభరణం రాజ్యలక్ష్మి
- రజిత
- దుర్గ గా రమాప్రభ
- పొట్టి ప్రసాద్
- భీమరాజు
- ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
- థమ్
మూలాలుసవరించు
- ↑ "వివాహ భోజనంబు". naasongs.com. Retrieved 19 September 2016.