చూపులు కలిసిన శుభవేళ

1988 సినిమా

చూపులు కలిసిన శుభవేళ 1988 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా.[1] ఇందులో మోహన్, నరేష్, అశ్విని, సుధ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది సుత్తి వీరభద్రరావు ఆఖరి సినిమా కూడా. సినిమా పూర్తికాకముందే ఆయన చనిపోతే ఆయన పాత్రకు జంధ్యాల గాత్రం అందించారు. రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించారు.

చూపులు కలసిన శుభవేళ
దర్శకత్వంజంధ్యాల
రచనఆదివిష్ణు (కథ),
జంధ్యాల (మాటలు/దర్శకత్వం)
నిర్మాతకోనేరు రాధాకుమారి
తారాగణంనరేష్,
మోహన్,
గాయత్రి,
అశ్వని (నటి),
సుత్తి వీరభద్రరావు,
నూతన్ ప్రసాద్
ఛాయాగ్రహణందివాకర్
కూర్పుగౌతంరాజు
సంగీతంరాజన్ - నాగేంద్ర
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1988
భాషతెలుగు

ఆనంద మోహన్ పాండురంగం ఆఫీసులో పనిచేస్తుంటాడు. పాండురంగం అన్న నాగలింగం కూతురు పద్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. మోహన్ ఆమె ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. మోహన్ తన స్నేహితుడైన లక్ష్మీ ప్రసాద్ రాసిన లేఖ అందుకుని అతని ఉండే ఊరు వెళ్ళి అప్పుల బాధ భరించలేక చనిపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్న అతన్ని పట్నంలో ఏదైనా ఉద్యోగం చూపిస్తానని తన వెంట తీసుకుని వస్తాడు.

మోహన్ తన ప్రేమ విషయం పాండురంగానికి తెలియజేయడానికి భయపడుతూ ఉంటాడు. అందుకోసం లక్ష్మీ ప్రసాద్ ను పాండురంగం చేతిలో పలు ఇబ్బందులకు గురి చేస్తాడు. చివరికి పాండురంగానికి విషయం తెలిసి వారి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ అన్న నాగలింగానికి మాత్రం ప్రేమంటే పడదు. దాంతో వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి ఆస్తులు పంచుకుంటారు. ఇది చూసి వారి కన్నతల్లి చాలా బాధ పడుతుంది. వారినందరినీ కలపడానికి మోహన్, లక్ష్మీ ప్రసాద్ లు తమ ప్రియురాళ్ళతో కలిసి ఎలా నాటకం ఆడారన్నది మిగతా కథ.

తారాగణం

మార్చు

పాండురంగానికి నడక అంటే ఎంతో ఇష్టం. తనకోసం వచ్చిన వాళ్ళని చాలా దూరం నడిపించి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి ఆయన కారులో ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ సన్నివేశాలు హాస్యం పండిస్తాయి. ఆనంద్ తండ్రి కోట శ్రీనివాసరావు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష కూడా హాస్యం పండించింది.

పాటలు

మార్చు

రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సి. నారాయణ రెడ్డి, జొన్నవిత్తుల, మల్లెమాల, ముళ్ళపూడి శాస్త్రి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది రమేష్, జానకి, చిత్ర పాటలు పాడారు.

మూలాలు

మార్చు
  1. "చూపులు కలిసిన శుభవేళ (1988)". doregama.info. Retrieved 19 September 2016.[permanent dead link]