రన్ (2020 సినిమా)

లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ చలనచిత్రం.

రన్ 2020, మే 29న విడుదలైన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ చలనచిత్రం. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడిని నిర్మాణ సారథ్యంలో లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, పూజిత పొన్నాడ నటించిన ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం 2020, మే 29న ఆహా (ఓటిటి)లో విడుదలయింది.[1] ఈ చిత్రం ఓటిటిలో విడుదలచేసే తొలి తెలుగు చిత్రంగా ప్రకటించబడింది, కానీ దీనికంటే ఒక నెల ముందుగా అమృతరామమ్ సినిమా ఓటిటి ద్వారా విడుదలయింది.[2]

రన్
Run (2020) Movie Poster.jpg
రన్ సినిమా పోస్టర్
దర్శకత్వంలక్ష్మీకాంత్ చెన్నా
రచనసహన దత్త
కార్తీక్ అర్జున్(మాటలు)
నిర్మాతవై. రాజీవ్ రెడ్డి
సాయిబాబా జాగర్లమూడి
తారాగణంనవదీప్
పూజిత పొన్నాడ
ఛాయాగ్రహణంసాజీష్ రాజేంద్రన్
కూర్పురామకృష్ణ అర్రం
సంగీతంనరేష్ కుమారన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఆహా (ఓటిటి)
విడుదల తేదీ
2020 మే 29 (2020-05-29)
సినిమా నిడివి
87 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

శ్రుతి, సందీప్ దంపతులు. వారి వార్షికోత్సవం సందర్భంగా భోజనం ఏర్పాటు చేసుకుంటారు. అనుకోకుండా శృతి మరణిస్తుంది. ఆమె మరణానికి సందీప్ నిందితుడు అవుతాడు.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా
 • నిర్మాత: వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి
 • రచన: సహన దత్త
 • మాటలు: కార్తీక్-అర్జున్
 • సంగీతం: నరేష్ కుమారన్
 • సినిమాటోగ్రఫీ: సాజీష్ రాజేంద్రన్
 • కూర్పు: రామకృష్ణ అర్రం
 • నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్
 • పంపిణీదారు: ఆహా (ఓటిటి)

నిర్మాణంసవరించు

ఇది మొదట ఆహా (ఓటిటి) కోసం ప్రతి ఎపిసోడ్ 20 నిమిషాలు ఉండేలా 8-ఎపిసోడ్ సిరీస్‌గా (వెబ్ సిరీస్) రూపొందించాలనుకున్నారు. అల్లు అరవింద్ ఇది సినిమాగా తీయాలని సూచించాడు. 2019 అక్టోబరు, నవంబర నెలల్లో 24 రోజులు చిత్రీకరణ జరిగింది.[1]

విడుదలసవరించు

2020, మే 29న నేరుగా ఆహా (ఓటిటి)లో విడుదలైంది.[2]

స్పందనసవరించు

ది హిందూ పత్రికకు చెందిన సంగీత దేవి దుండూ ఈ చిత్రాన్ని "ఇది పేలవమైన మానసిక థ్రిల్లర్ అని, నవదీప్ నటన బాగుందని" పేర్కొన్నాడు.[3] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఈ చిత్రానికి 1.5/5 రేటింగ్ ఇచ్చింది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే బాలేదని పేర్కొంది.[4] ఫిల్మ్ కంపానియన్ ప్రతికకు చెందిన ప్రత్యుష్ పరశరామన్ కూడా ఈ చిత్రానికి ప్రతికూల సమీక్ష ఇచ్చింది.[5]

మూలాలుసవరించు

 1. 1.0 1.1 Parasa, Rajeshwari (2020-05-26). "'Run' will excite the audience: Director Lakshmikanth on first direct Telugu OTT release". The News Minute. Retrieved 2020-12-04.{{cite web}}: CS1 maint: url-status (link)
 2. 2.0 2.1 Dundoo, Sangeetha Devi (2020-05-25). "First OTT original Telugu film 'Run' to première on May 29". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-04.
 3. Dundoo, Sangeetha Devi (2020-05-29). "'Run' review: A lacklustre psychological thriller". The Hindu. ISSN 0971-751X. Retrieved 2020-12-06.
 4. "RUN Review: An insipid thriller". Retrieved 2020-12-06.     
 5. Parasuraman, Prathyush (2020-05-29). "'Run' On Aha Review: Few Things Are This Odd, Fewer This Bad". Film Companion. Retrieved 2020-12-06.

ఇతర లంకెలుసవరించు