రాక్షసుడు (2015 సినిమా)

రాక్షసుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. మేధా క్రియోష‌న్స్ బ్యానర్ పై ఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు (కృష్ణారెడ్డి) నిర్మించిన ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. సూర్య, నయనతార, ప్రణీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘మాసు ఎంగిర మసిలమణి’ పేరుతో, తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో మే 29, 2015న విడుదలైంది.

రాక్షసుడు
దర్శకత్వంవెంకట్ ప్రభు
రచనవెంకట్ ప్రభు
నిర్మాతఎం.ఎస్.ఆర్, మిర్యాల రాజాబాబు
నటవర్గంసూర్య, నయనతార, ప్రణీత
ఛాయాగ్రహణంఆర్.డి.రాజశేఖర్
కూర్పుప్రవీణ్.కె.ఎల్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
మేధా క్రియోష‌న్స్
విడుదల తేదీలు
2015 మే 29 (2015-05-29)
నిడివి
120 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

చిన్ననాటి మిత్రులు మధుసూదన్ అలియాస్ మాస్(సూర్య), జెట్టు(ప్రేమ్ జీ అమరెన్) ఇద్దరూ చిన్న చిన్న మోసాలు, దొంగతనాలు చేసుకుంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అలా సాఫిగా సాగుతున్న సమయంలో వీరికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా మాస్ కి యాక్సిడెంట్ అవుతుంది. దీంతో మాస్ ఓ రెండు క్షణాల్లో చచ్చి బ్రతుకుతాడు. హాస్పిటల్లో కోలుకున్న తర్వాత మాస్ కు ఆత్మలు కనిపించడం మొదలవుతాయి. ఆ ఆత్మలు తమ కోరికలను తీర్చమంటాయి. మాస్ ఇదే అదునుగా భావించి, హెల్ప్ చేయాలంటే తనకు హెల్ప్ చేయాలని చెప్పి, ఆ ఆత్మలను అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదిస్తుంటాడు. ఇదే సమయంలో మాలిని(నయనతార)తో పరిచయం ఏర్పడటం, ప్రేమలో పడతాడు. మాస్ లైఫ్ లోకి అనుకోకుండా శివకుమార్(సూర్య) ఎంట్రీ ఇస్తాడు. మాస్ జీవితం పూర్తిగా మారిపోతుంది. తెలియకుండానే మాస్ పలు మర్డర్ కేసులు, రాబరీ కేసులలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి ఏమయ్యింది? అసలు శివ ఎవరు? అసలు మాస్, శివలకు ఏంటి సంబంధం? శివ మనిషా లేక దెయ్యమా ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

మూలాలుసవరించు

  1. Sakshi (30 May 2015). "'రాక్షసుడు' రివ్యూ". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.