ప్రణీత సుభాష్
ప్రణీత సుభాష్ (జ. 17 అక్టోబరు 1992) కన్నడ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించిన భారతీయ నటి. ప్రణీత అని పిలవబడే ఈమె 2010లో పూరి జగన్నాథ్ తెలుగులో తీసిన పోకిరి సినిమా కన్నడ రీమేక్ పోర్కి సినిమాతో కన్నడలో, ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది. పోర్కి హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన బావ (2010) సినిమా తనకు మంచి పేరును తీసుకొచ్చింది.
ప్రణీత సుభాష్ | |
---|---|
![]() | |
జననం | ప్రణీత సుభాష్ 1992 అక్టోబరు 17 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ఇప్పటివరకు |
ఆపై 2011లో ఉదయన్ సినిమాతో తమిళంలో తెరంగేట్రం చేసింది. ఉదయన్ ఫ్లాప్ అయినా జరాసంధ (2011), భీమ తీరడల్లి (2012), విజిల్ (2013), బ్రహ్మ (2014) సినిమాలతో కన్నడ పరిశ్రమలో పెద్ద కథానాయికగా ఎదిగింది. తెలుగులో అత్తారింటికి దారేది (2013) సినిమా ద్వారా ఇక్కడ కూడా పెద్ద తారగా ఎదిగింది. ఆ తర్వాత తను నటించిన పాండవులు పాండవులు తుమ్మెద (2014) సినిమా కూడా తనకు మంచి పేరును తెచ్చిపెట్టింది. 2012లో, ఆమె సినీ విమర్శకులచే ప్రశంసలు పొందిన కళాత్మక చిత్రం, భీమ తీరలదల్లైలో నటించింది. దీనిలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాల్లో ఉత్తమ నటి-కన్నడగా, సీమా అవార్డుకు కన్నడ భాషలో ఉత్తమ నటి పురస్కారానికి నామినేట్ అయింది.
బాల్యం, కుటుంబంసవరించు
ప్రణీత సుభాష్ 17 అక్టోబర్ 1992న బెంగుళూరులో వైద్యుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి వైద్యుడు, తల్లి స్త్రీ ప్రసూతి వైద్యనిపుణురాలు. వారు బెంగళూరులో ఓ ఆసుపత్రిని నడిపుతూంటారు. ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. ఆర్యన్ ప్రెసిడెన్సీ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.[1] ఆమె తన డిగ్రీ బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రారంభించి, మోడలింగ్, సినిమా రంగాల్లో కెరీర్ కారణంగా మధ్యలో వదిలివేసింది.
తెలుగులో నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చిత్రం | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
2010 | ఏం పిల్లో ఏం పిల్లడో | భద్ర | |
2010 | బావ | వరలక్ష్మి | |
2013 | అత్తారింటికి దారేది | ప్రమీల | |
2014 | పాండవులు పాండవులు తుమ్మెద | కుచల కుమారి | |
2014 | రభస | ||
2015 | డైనమైట్ (సినిమా) |
పెళ్ళి, పిల్లలుసవరించు
ప్రణీత వివాహం బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో 2021 మే 30న జరిగింది.[2][3] ఆమె 2022 జూన్ 10న పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది.
మూలాలుసవరించు
- ↑ "Pranitha Subhash biography". Veethi.com. 2014.
- ↑ Andhrajyothy (31 May 2021). "సర్‌ప్రైజ్: బిజినెస్ మ్యాన్‌ని పెళ్లాడిన ప్రణీత". www.andhrajyothy.com. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ The Times of India (31 May 2021). "Actress Pranitha Subhash ties the knot on Sunday - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.