రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం)
రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, ప్రొద్దుటూరు, రామేశ్వరములో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనము. [1] దీని వైశాల్యం సుమారు 2.4 చదరపు కిలోమీటర్లు. [2] ఇది పెన్నా నది ఉత్తర ఒడ్డున ఉంది. దీనికి గల ఒక ప్రత్యేకత - ఇది ఒక ఇసుకదిబ్బల పర్యావరణ వ్యవస్థ. వెలిగొండ, పాలకొండ, లంకమల్ల, ఎర్రమల కొండల మధ్యన ఉన్న మైదాన భూముల్లో ఉంది ఈ జాతీయ వనం.[1]
రాజీవ్ గాంధీ జాతీయ ఉద్యానవనం (రామేశ్వరం) | |
---|---|
Nearest city | కడప |
Coordinates | 14°43′37″N 78°33′39″E / 14.72694°N 78.56083°E |
Area | 2.4 కి.మీ2 (0.93 చ. మై.) |
Established | 2005 |
చరిత్ర
మార్చుఈ ప్రాంతం మొదట 2005 నవంబరు 19 న "రామేశ్వరం నేషనల్ పార్క్" గా గుర్తించబడింది, 26 డిసెంబర్ 2005 న పేరును "రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్" గా మార్చారు. 2017 మే 15 న పార్కు చుట్టూ 500 మీటర్ల ఎకో జోన్ గుర్తించబడింది.
జీవవైవిధ్యం
మార్చుఈ అడవి పొడి ఆకురాల్చే రకానికి చెందినది. ఇది ఇసుక నేల; ఇరిడి, యూకలిప్టస్ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా చెనుల చెట్టు (గ్రీవియా విల్లోసా), పొడపత్రి వంటి 25 చెట్ల జాతులు ఇక్కడ ఉన్నాయి.[1]
రక్త పింజరి, రెండు తలల పాము రాజీవ్ గాంధీ జాతీయ వనానికి సంబంధించిన సూచక జాతులు. ఇక్కడ ఉండే మరికొన్ని జంతుజాతులు తేళ్ళు, సాలెపురుగులు, చిమటలు, సీతాకోకచిలుకలు, రకరకాల కప్పలు, దుప్పులు, ముంగిసలు, కుందేళ్ళు. నెమళ్ళు, కొంగలు, చిలుకల వంటి 50కి పైగా జాతుల పక్షులు ఇక్కడ నివసిస్తున్నాయి.[1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "A.P.Forest Department". forests.ap.gov.in. Retrieved 2023-05-11.
- ↑ "National Parks". www.wiienvis.nic.in. Retrieved 2023-05-11.