రాజేష్ చౌహాన్ (జననం 1966 డిసెంబరు 19) 1993 నుండి 1998 వరకు 21 టెస్టులు, 35 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మాజీ భారత క్రికెటరు. అతను 1990ల నాటి కుంబ్లే - రాజు - చౌహాన్‌ల స్పిన్ త్రయంలో భాగం.

రాజేష్ చౌహాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాజేష్ కుమార్ చౌహాన్
పుట్టిన తేదీ (1966-12-19) 1966 డిసెంబరు 19 (వయసు 57)
రాంచీ, జార్ఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 197)1993 జనవరి 29 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1998 మార్చి 18 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 87)1993 జూలై 25 - శ్రీలంక తో
చివరి వన్‌డే1997 డిసెంబరు 28 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు 21 35
చేసిన పరుగులు 98 132
బ్యాటింగు సగటు 7.00 10.15
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 23 32
వేసిన బంతులు 4,749 1,634
వికెట్లు 47 29
బౌలింగు సగటు 39.51 41.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగు 4/48 3/29
క్యాచ్‌లు/స్టంపింగులు 12/– 10/–
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4

ఆడిన 21 టెస్టుల్లో అతని తోడ్పాటు పరిమితమే అయినప్పటికీ, వాటిలో భారత్ ఏదీ ఓడిపోలేదు. [1] 1997లో కరాచీలో సక్లైన్ ముస్తాక్ వేసిన చివరి ఓవరులో సిక్స్ కొట్టి, పాకిస్థాన్‌పై భారత్‌కు నాలుగు వికెట్ల విజయాన్ని అందించడం ద్వారా అతను ఎక్కువగా గుర్తుంటాడు.

జీవిత విశేషాలు మార్చు

రాంచీలో నివసించే అతని తండ్రి గోవింద్ రాజా చౌహాన్ కూడా క్రికెటరే. అతను 1957లో రంజీ ట్రోఫీ,1964లో దులీప్ ట్రోఫీ ఆడాడు.[2] వారి పూర్వీకుల గ్రామం కచ్ ప్రాంతం లోని విడి. అతను కచ్ గుర్జర్ క్షత్రియ అనే చిన్న సమాజానికి చెందినవాడు. [2] [3] చౌహాన్ 1993-96 సంవత్సరాలలో కచ్ గుర్జార్ క్షత్రియ సంఘానికి ఆల్-ఇండియా యూత్ వింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు. చురుకైన సామాజిక సభ్యుడు. [2]

తరువాత జీవితంలో మార్చు

2007 ఏప్రిల్‌లో అతను కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనేక ఫ్రాక్చర్లతో పాటు అతని కాలు, వీపు, చేయి, తలపై గాయాలయ్యాయి.[4][5]

అతను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో నివసిస్తూ, భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యాపారాన్ని కూడా నడుపుతున్నాడు.


2014 జూలై 7 న, భిలాయ్‌లోని తన నివాసంలో గుండెపోటుకు గురై, ప్రాణాలతో బయటపడ్డాడు. [6]

మూలాలు మార్చు

  1. "Has Steven Smith made the fastest ODI hundred for Australia?". ESPN Cricinfo. Retrieved 1 December 2020.
  2. 2.0 2.1 2.2 Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory by Raja Pawan Jethwa. (2007)
  3. "कच्छ गुर्जर समाज का मिलन समारोह". Dainik Bhaskar. 1 November 2011. Archived from the original on 7 April 2014. Retrieved 2 August 2013.
  4. Rajesh Chauhan injured in road accident
  5. Ex-cricketer Rajesh Chauhan injured
  6. "Cricketer Rajesh Chauhan suffers cardiac arrest". ABP Live. Retrieved 7 July 2014.