రాత్రి 1992 లో తెలుగు, హిందీల్లో ఏకకాలంలో తీసిన సినిమా. రామ్ గోపాల్ వర్మ రచన, దర్శకత్వం వహించాడు. రేవతి, అనంత నాగ్, సయాజీ షిందే నటించారు. ఈ చిత్రం మంచి సమీక్షలను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.ఓ కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది. [2] [3] [4] మణి శర్మ సంగీతం అందించాడు.

రాత్రి
(1992 తెలుగు సినిమా)
దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ
తారాగణం అనంత్ నాగ్
రేవతి
సంగీతం మణి శర్మ
సంభాషణలు ఉత్తేజ్
ఛాయాగ్రహణం తేజ
రసూల్ ఎల్లోర్
ప్రసాద్
కూర్పు శంకర్
విడుదల తేదీ 1992 ఫిబ్రవరి 7[1]
భాష తెలుగు

హర్రర్ సినిమాకు అవసరమైనట్లుగా, గందరగోళం, అయోమయం, బాధిత వ్యక్తుల దుస్థితి మొదలైన వాటితో దర్శకుడు భయాన్ని సృష్టించాడు.

నలుగురు సభ్యులున్న ఓ కుటుంబం ఓ ఇంట్లో దిగుతుంది. అదొక దయ్యాల కొంప అని ఆ ఇంటికి పేరుంది. మనీషా శర్మ ( రేవతి ) అనే "మినీ" కాలేజీలో చదువుతున్న అమ్మాయి. ఆమె తండ్రి మిస్టర్ శర్మ ( ఆకాష్ ఖురానా ), తల్లి శాలిని శర్మ ( రోహిణి హట్టంగాడి ). దీపక్ (కుశాంత్) మినీకి క్లాస్‌మేటూ, బాయ్‌ఫ్రెండూను. మినీ మేనల్లుడు బంటీ (మాస్టర్ అతీత్) ఇంటి నేలమాళిగలో ఓ పిల్లిని చూస్తాడు. ఆ పిల్లి భయంకలిగించేలా చూస్తూ ఉంటుంది. ఒక రోజు తండ్రి కారు వెనక్కి తీస్తున్నపుడు పిల్లి వెనుక చక్రం కింద పడి ప్రమాదవశాత్తు చనిపోతుంది. బంటికి తెలియకుండా పిల్లిని పెరట్లో పాతిపెడతారు. వారి పొరుగున ఉన్న నిర్మలమ్మ మినీ క్లాస్‌మేట్ అయిన రష్మికి అమ్మమ్మ. మినీ తమ కొత్త పొరుగువారని తెలిసాక నిర్మలమ్మ తన ప్రతిస్పందనతో వారిని హడల గొడుతుంది.

చనిపోయిన పిల్లి లాగే ఉన్న మరొక పిల్లి బంటికి కనబడుతుంది. ఆ కుటుంబానికి మొదటి షాక్ అది. ఇంకోరోజు మినీ దీపక్ లు బైకుపై నగరం బయటికి జాలీ రైడ్‌కు వెళ్తారు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, దీపక్ బైకు వెనుక టైరుకు పంక్చరౌతుంది. మినీని అక్కడే ఉంచి, దీపక్ సమీపంలోని గ్రామం నుండి స్పేరు టైరు తీసుకు రావడానికి ఒక బాటసారి వెంట వెళ్తాడు. తిరిగి వచ్చేటప్పుడు మినీ, ఒక చెరువు దగ్గర చెట్టు పక్కన కూర్చొని, ముఖాన్ని దాచుకొని ఏడుస్తూ ఉంటుంది. దీపక్ ఆమె దగ్గరకు వెళ్ళి చూస్తే, ఆమె కళ్ళు ఎర్రగా (చనిపోయిన పిల్లి కళ్ళ లాగా) ఉంటాయి. దీపక్ అదిరిపడి చెరువులో పడిపోతాడు. వెంటనే మినీ మామూలుగా మారి, చెరువు నుండి బయటకు రమ్మని దీపక్‌కు పిలుస్తుంది.

\మరుసటి రోజు, మినీ తన క్లాస్మేట్ రష్మి వెంట ఆమె స్నేహితుడి పెళ్ళికి వెళ్తుంది. ఆ రోజు రష్మిని ఎవరో దారుణంగా చంపుతారు. ఆమె మెడను పూర్తిగా వెనక్కి తప్పి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి, విచారణ సమయంలో, మినీ తన బొమ్మ తలను రష్మీ మెడను తిప్పినట్టు మెలితిప్పడం గమనిస్తాడు. ప్రశ్నించడం కోసం మినీ ఇంటికి వెళ్లిన పోలీసు అధికారి బయటికి వెళ్లేటప్పుడు ప్రమాదానికి గురై మరణిస్తాడు. ఈ సంఘటనల కారణంగా మినీ తల్లిదండ్రులను ప్రొఫెషనళ్ళ సహాయం కోరతారు. షాలిని తమ పొరుగున ఉన్న వృద్ధురాలిని సంప్రదిస్తుంది. మిస్టర్ శర్మ ఒక మానసిక వైద్యుడి ( అనంత నాగ్ ) సహాయం తీసుకుంటాడు. వారి కుమార్తె భయానక ప్రవర్తనకు కారణం తన భార్య నమ్ముతున్న క్షుద్రశక్తులే కారణమనేది అర్ధంలేనిదని అతడి భావన. ఫలక్నుమాలో నివసించే షార్జీ ( ఓం పూరి ) సేవలను కోరమని పొరుగున ఉన్న వృద్ధురాలు షాలినికి సలహా ఇస్తుంది. షార్జీ మొదట తన "గురు" (విజయచందర్) ను సందర్శిస్తాడు. షార్జీ అప్పుడు మినీ ఇంటి నేలమాళిగలో ఉన్న దెయ్యాన్ని ( సునందను) చూస్తాడు. ఆ ఇంటి మునుపటి యజమాని ప్రియురాలు ఆమె. దారుణంగా హత్య చేయబడింది. తరువాత, హంతకుడు తన కొత్త ప్రియురాలితో ఉండగా, ఆ దెయ్యం అతన్ని చంపుతుంది. మంచం లోంచి చేతులు పొడుచుకు వచ్చి రష్మిని చంపినట్లుగానే అతని మెడను మెలితిప్పి చంపేస్తుంది.

దెయ్యం దీపక్‌ను చంపడానికి చేసిన భయంకరమైన ప్రయత్నాల తరువాత, షార్జీ చివరకు పవిత్ర శ్లోకాలు, బూడిద సహాయంతో దాన్ని బంధిస్తాడు. దెయ్యం చివరకు మినీ శరీరాన్ని ఉరుములతో మెరుపులతో వదిలి పోతుంది.

ఒక వైపు మినీపై MRI, ఇతర వైద్య విధానాలతో కూడిన శాస్త్రీయ పరీక్షలు చేస్తారు. మినీని "నయం" చేయగల ఏకైక మార్గం ఇదేనని మిస్టర్ శర్మ అభిప్రాయపడతాడు. అయితే, కాంతికి ఆవల ఉన్న చీకటి గురించి షార్జీకి తనదైన వివరణ ఉంది. ఆ చీకటి అంతరించిపోయేది కాదు, కొంతవరకు తగ్గుతుందంతే.

నటవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. NTV (7 February 2022). "పాతికేళ్ళ 'రాత్రి'". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  2. "Spookiest of them all". The Hindu.
  3. "RAAT (1992) - A masterpiece from RGV which gave birth to BHOOT in 2003. (Movies To See Before You Die - Horror)". bobbytalkscinema.com. Archived from the original on 2015-04-02. Retrieved 2020-08-08.
  4. "Following RGV". The Hindu.