రాధాకృష్ణ కుమార్
కెకె రాధాకృష్ణ కుమార్ (జననం. 2 ఆగస్టు, 1984) తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. యువి క్రియేషన్స్ నిర్మించిన జిల్[1][2][3][4][5] సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతకుముందు, సినీ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒక రోజు (2005),[6] ఒక్కడున్నాడు (2007), ప్రయాణం (2009),[7] సాహసం (2013)[8] మొదలైన సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేశాడు.
జీవిత విషయాలు
మార్చురాధాకృష్ణ కుమార్ 1984, ఆగస్టు 2న వైజాగ్ లో జన్మించాడు. వైజాగ్ లోని సెయింట్ జాన్స్ పారిష్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసి, 2003లో హైదరాబాదుకు వెళ్ళాడు.
సినిమారంగ ప్రస్థానం
మార్చుచంద్రశేఖర్ యేలేటి దగ్గర సహాయ దర్శకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించిన రాధాకృష్ణ, ప్రయాణం (2009), సాహసం (2013) సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశాడు. దీనికోసం 1వ సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. 2014లో జిల్ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టాడు.[1][2][3]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | రచయిత | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2007 | ఒక్కడున్నాడు | |||
2009 | ప్రయాణం | |||
2013 | సాహసం | |||
2015 | జిల్ | |||
2020 | రాధే శ్యామ్ | తెలుగు, హిందీ భాషలలో ద్విభాషా |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Gopichand like never before". 1 February 2015.
- ↑ 2.0 2.1 "Rashi Khanna to star opposite Gopichand". 7 July 2014.
- ↑ 3.0 3.1 "Radhakrishna to direct Gopichand - Times of India".
- ↑ "Jil censor completed, all set for a release on 27th - Telugu Movie News - IndiaGlitz".
- ↑ "Jil review by jeevi - Telugu cinema review - Gopichand & Rashi Khanna". www.idlebrain.com.
- ↑ "Personally, he is my favourite hero: Radha Krishna Kumar - Telugu Movie News - IndiaGlitz".
- ↑ "Prayanam". 29 May 2009 – via www.imdb.com.
- ↑ "Sahasam". 12 July 2013 – via www.imdb.com.