రామన్నగూడ (శేరిలింగంపల్లి)

రామన్నగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[1] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 110వ వార్డు నంబరులో ఉంది.[2] హైదరాబాద్ నుండి ఉత్తరాన 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా సరిహద్దులో ఉంది.

రామన్నగూడ
సమీపప్రాంతం
రామన్నగూడ is located in Telangana
రామన్నగూడ
రామన్నగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 050
Vehicle registrationటిఎస్ 07
లోక్‌సభ నియోజకవర్గంచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

సమీప ప్రాంతాలు మార్చు

రామన్నగూడ చుట్టూ తూర్పు వైపు శంకరపల్లి మండలం, ఉత్తరం వైపు కొండాపూర్ మండలం, దక్షిణం వైపు చేవెళ్ల మండలం, పడమర వైపు మోమిన్‌పేట మండలం ఉన్నాయి.

గణాంకాలు మార్చు

ఇక్కడి తెలుగు స్థానిక భాష. రామన్నగూడ మొత్తం జనాభా 4266 మంది కాగా అందులో పురుషులు 2184 మంది, స్త్రీలు 2,082 మంది ఉన్నారు. మొత్తం గృహాల సంఖ్య 825. రామన్నగూడ మొత్తం విస్తీర్ణం 2102 హెక్టార్లుగా ఉంది.

ప్రజా రవాణా మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో రామన్నగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడికి సమీపంలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ఉంది.

ప్రార్థనా మందిరాలు మార్చు

  • పార్వతి పరమేశ్వర దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • పాండురంగస్వామి దేవాలయం
  • మసీదు ఇ మహమ్మద్ ఇబ్రహీం

విద్యాసంస్థలు మార్చు

  • శ్రీ జాగృతి డిగ్రీ కళాశాల
  • శ్రీ సాయి జూనియర్ కళాశాల
  • వాసవి కళాశాల
  • ప్రభుత్వం ప్రాథమిక పాఠశాల

మూలాలు మార్చు

  1. "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 7 ఏప్రిల్ 2022. Retrieved 23 September 2021.
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 23 September 2021.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "Hyderabad Local APSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 23 September 2021.

ఇతర లింకులు మార్చు