రామారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలానికి చెందిన గ్రామం.[1]

రామారెడ్డి
—  రెవిన్యూ గ్రామం  —
రామారెడ్డి is located in తెలంగాణ
రామారెడ్డి
రామారెడ్డి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°24′26″N 78°22′06″E / 18.407331°N 78.368424°E / 18.407331; 78.368424
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కామారెడ్డి
మండలం సదాశివనగర్‌
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 8,249
 - పురుషుల సంఖ్య 3,914
 - స్త్రీల సంఖ్య 4,335
 - గృహాల సంఖ్య 1,928
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 11 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని సదాశివనగర్ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన రామారెడ్డి మండలం లోకి చేర్చారు.[2]

గ్రామ జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1928 ఇళ్లతో, 8249 జనాభాతో 1938 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3914, ఆడవారి సంఖ్య 4335. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 773 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 212. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 571326.[3]

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల కామారెడ్డిలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నిజామాబాద్లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కామారెడ్డిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు నిజామాబాద్లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

రామారెడ్డిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

రామారెడ్డిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.

ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

గ్రామంలో జన్మించిన ప్రముఖులు

మార్చు

దేవాలయాలు, విశేషాలు

మార్చు

ఈ గ్రామంలో కాలభైరవ స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కాలభైరవస్వామి విగ్రహం చాలా పురాతనమైంది. ప్రతి ఏటా డిసెంబరులో పెద్ద జాతర జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం రామాలయం.ఇక్కడ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో గ్రంథాలయం, పాఠశాలలు, పోలీస్ ఠాణా ఉన్నాయి.

తెలంగాణా కామారెడ్డి జిల్లా రామన్నపల్లి మండలం ఇసన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం ప్రసిద్ధమైంది .కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు . శివుని ఆత్మస్వరూపంతో ఇక్కడ కాలభైరవస్వామి కొలువై ఉన్నాడు .ఇదికామారెడ్డికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం .

పంటపొలాలమధ్య పింక్ రంగు దేవాలయం దూరం నుంచే ఆకర్షిస్తుంది .దోమకొండ సంస్థానాదధీశులకాలంలో 200 ఏళ్ళక్రితం పునర్నిర్మింప బడింది .కాశీ తర్వాత కాలభైరవునికి అంతటి విశిష్టమైన దేవాలయమిది .13 శతాబ్దం నాటి ఆలయంగా గుర్తింపు పొందింది

స్వామికి మొక్కుకుంటే తీర్చే భక్తులపాలిటి కొంగుబంగారం స్వామి .రామారెడ్డి గ్రామాన్ని రథాల రామారెడ్డి పేట అనేవారు. అక్కడ రంగ రంగ వైభవంగా దేవతా రథోత్సవాలు జరిగేవి .17 వ శతాబ్దం దాకా ఇది దోమకొండ సంస్థానం అధీనంలో ఉండేది .1550- నుండి 1600 వరకు పాలించిన రెండవ కామి రెడ్డి కొడుకు రెండవ మల్లారెడ్డి కొడుకు రామా రెడ్డి పేరుతొ నిర్మించబడిన గ్రామం రామారెడ్డి .మల్లారెడ్డి ఇక్కడే శ్రీ సీతారామస్వామి దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాలు నిర్మించాడు .ఈ రెండు గుడులలో ప్రతి ఏడాది బ్రహ్మాండంగా రథోత్సవాలు జరిగేవి . ఈ దేవాలయాల నిత్యపూజా మహోత్స వాలకు,నిర్వహణకు సంస్థానాధిపతి రాసిచ్చిన అగ్రహారమే ఇస్సన్న పల్లి .ఇది రామారెడ్డికి ఈశాన్యంలో ఉంటుంది .

మల్లారెడ్డి అన్న ఎల్లారెడ్డి తనకొడుకు విస్సా రెడ్డి పేరుతొ కట్టించినది విస్సన్నపల్లి,కాలక్రమంలో ఇసన్న పల్లి అయింది .ఈ ఊరి మొదట్లోనే కాలభైరవాలయం ఉంది .ఇందులో 8 దిక్కులలో 8 మంది భైరవులుఉండేవారు . ..అందులో ఈశాన్యం లోని ‘’ఈవానుడు’’ అనే కాలభైరవుడే ముఖ్యం .ఈశాన్య దిక్కులో ఉన్నాడుకనుక ఈశాన్యపల్లి అనే పేరు క్రమంగా ఇసన్నపల్లిగా కూడా మారి ఉంటుందని స్థానిక కథనం .అసితంగ భైరవ,రురు భైరవ,చండ్ర భైరవ,క్రోధ భైరవ,ఉన్మత్త భైరవ,కాపాలభైరవ,భీషణ భైరవ,సంహార భైరవ అని భైరవులు ఎనిమిది మంది . కాని ఈక్షేత్ర కథనం ప్రకారం అతిసాంగ,సంసార,రురు,,కాల,క్రోధ,తామ్ర చూడ, చంద్ర చూడ,మహాభైరవులు .ఇందులో ముఖ్యుడైన కాలభైరవస్వామే ఇక్కడ కొలువై ఉన్నాడు .మిగిలిన 7 భైరవ విగ్రహాల ఆచూకీ ఇప్పుడు లేదని చెపుతున్నారు. ఈ కాలభైరవ విగ్రహం క్రీశ13 వశతాబ్ది కాకతీయులకాలం నాటిదని విశ్వసిస్తారు .స్వామి దిగంబరంగా ఉండటంతో ఈ విగ్రహాన్ని దిగంబర జైన విగ్రహం అని కూడా అపోహ ఉంది .ఇసన్నపల్లి,రామారెడ్డి గ్రామాలు 1550 -60 కాలంలో ఏర్పడ్డాయికనుక,ఇది జైన విగ్రహం కాదన్నారు .పురాణాలు కాలభైరవుని దిగంబరునిగానే వర్ణించాయి కనుక ఇది సనాతన వైదిక దేవతా విగ్రహమే నని స్పష్టంగా చెప్పవచ్చు.

స్థానిక కథనాలు కొన్ని చూద్దాం .ఇక్కడకాలభైరవ విగ్రహం ప్రతిస్టించటానికి కాశీలో విగ్రహం చెక్కించి ఎడ్ల బండీ మీద తెస్తుంటే ఇక్కడికి రాగానే బండీ ఆగిపోయింది ఎడ్లు బెదిరిపారిపోయి బండీ విరిగి పోయి అప్పటిదాకా పడుకోబెట్టబడిన విగ్రహం అమాంతం లేచినిలబడి అదే తాను ఉండాల్సిన చోటుఅని చెప్పింది . ఆ ప్రకారమే ఊరి మొదట్లో అక్కడవదిలేసి వెళ్ళిపోయారు ..అక్కడే ఎండకూ వానకూ ఆచ్చాదన,లేకుండా ఉంటె,గ్రామస్థులు భీకరారకారమైన ఆ విగ్రహానికి పూజ చేయటానికి ఝడిసేవారు .కరువుకాటకాలు వస్తే మాత్రం ఆవు పేడ తెచ్చి విగ్రహానికి పూసేవారు .ఆ పేడ కరిగిపోయేదాకా కుంభ వృష్టి కురిసేది .లోకకల్యాణానికి తనవిగ్రహానికి పేడ రుద్దినా సహించిన కరుణామయుడు ఈ కాలభైరవుడు .
భక్తుల మనోభావంలో మార్పు వచ్చిఎన్నో ఏళ్ళ తర్వాత ప్రజలు పూజ చేయటం మొదలు పెట్టారు .తర్వాత విశాలమైనప్రాంగణ౦ లో గొప్ప ఆలయం కట్టి స్వామిని ప్రతిష్ఠించారు .సి౦ధూరవర్ణంతో స్వామినిలువెత్తు విగ్రహం తో మెరిసిపోతూ దర్శనమిస్తాడు .ధ్వజస్తంభం శివలింగం లింగం ముందు కాలభైరవ (శునక )విగ్రహం కనిపిస్తాయి. గర్భ గుడిలో శిలారూప కాలభైరవ స్వామి దర్శనమిస్తాడు, భీకర రూపం కనబడకుండా ముఖానికి వెండి తొడుగు వేస్తారు .ఆయనకు ముందు నంది విగ్రహం ఉంటుంది .భక్తులుకోరికలుతీరటానికి కొబ్బరికాయముడుపులు,వస్త్రాలు, తొట్టెలు,కడతారు .దుస్ట శక్తుల నివారణకోసం 10,20, 50, 100 రూపాయల నోట్ల దండలు కడతారు .స్వయంభుగా వెలసిన ఏకైక కాలభైరవ విగ్రహం కనుక మహా మహిమాన్వితం .పూజలు శైవ సంప్రదాయంలో జరుగుతాయి .మహారాష్ట్ర,కర్నాటక ను౦డి కూడా భక్తులు వస్తారు .శనిప్రభావం తొలగటానికీ ఈస్వామి దర్శనం చేస్తారు .ఆరోగ్య సమస్యలున్నవారు రెండుపూటలా స్నానం చేసి స్వామివారిని దర్శించిపూజిస్తారు .నిత్యపూజలతోపాటు ప్రతిమంగళవారం విశేషపూజలు,
[15/08, 2:08 PM] Hi: రామారెడ్డి బస్ స్టాండ్ ఆలయానికి కేవలం 750 మీటర్ల దూరంలో ఉంది. రహదారి, రైలు మార్గాల ద్వారా తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన సమీప నగరం కామారెడ్డి. నిజామాబాద్ నుండి 54 కిలోమీటర్లు, సిరిసిల్లా జిల్లా నుండి 55 కిలోమీటర్లు, ఇది కామారెడ్డి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

భూమి వినియోగం

మార్చు

రామారెడ్డిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • అడవి: 329 హెక్టార్లు
 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 83 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 3 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 103 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 18 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 80 హెక్టార్లు
 • బంజరు భూమి: 47 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1275 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 1236 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 166 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

రామారెడ్డిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 166 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

రామారెడ్డిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

మొక్కజొన్న, చెరకు, వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బీడీలు

మూలాలు

మార్చు
 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-08-08.
 2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 4. అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్[permanent dead link]

వెలుపలి లంకెలు

మార్చు