చెమ్మీన్
చెమ్మీన్ 1965లో విడుదలైన మలయాళ సినిమా. ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాలలో దక్షిణ భారతదేశం నుండి తొలిసారి ఉత్తమ చలనచిత్రంగా ఎన్నికైనది.[1] ఈ సినిమా తకళి శివశంకర పిళ్ళై వ్రాసిన చెమ్మీన్ (ఎర్రచేప) నవల ఆధారంగా తీయబడింది. రాము కారియత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సముద్రం, కెరటాలు, ఇసుకతిన్నెలు, కొబ్బరితోపులు, పాటలు పాడే పల్లెవారు, కల్లాకపట మెరుగని కన్నెపిల్లల చిరునవ్వులు సుందరంగా చిత్రీకరించబడింది. సముద్రతీరంలోని పల్లెప్రజల కథ ఇది. తనకంటూ స్వంతంగా ఒక పడవ కొనుక్కోవాలని తాపత్రపడే ఒక ఇంటి పెద్ద, జీవితంలో వసంతకాలం లాంటి యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ, ఆమె ముస్లిం ప్రియుడు, భార్యను ఎంతో గాఢంగా ప్రేమించే భర్త ఈ చిత్రంలోని ముఖ్యపాత్రలు. చేపల వేటకని సముద్రంలో వెళ్లిన భర్తకు భార్య ద్రోహం తలపెడితే ఆ భర్త తిరిగి రాడని ఆ పల్లెటూరి వాళ్ల నమ్మకం. కాని చివరకు జరిగింది అదే.
చెమ్మీన్ | |
---|---|
![]() చెమ్మీన్ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | Ramu Kariat |
నిర్మాత | Babu Ismail Sait (Chemmeen Babu) |
స్క్రీన్ ప్లే | S. L. Puram Sadanandan |
ఆధారం | Chemmeen by Thakazhi Sivasankara Pillai |
తారాగణం | Sheela Madhu Kottarakkara Sreedharan Nair Sathyan |
సంగీతం | Salil Chowdhury |
సినిమెటోగ్రఫీ | మార్కస్ బార్ట్లే, యు.రాజగోపాల్ |
కూర్పు | Hrishikesh Mukherjee, Hariprasad.M |
స్టుడియో | Kanmani Films |
విడుదలైన తేదీలు | 1965 ఆగస్టు 19 |
దేశము | India |
భాష | మలయాళం |
ఈ సినిమా 13వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికయ్యింది. ఈ పురస్కారం క్రింద నిర్మాతకు స్వర్ణపతకం, 20,000 రూపాయల నగదు దర్శకునికి 5000 రూపాయల నగదు బహూకరించారు.
మూలాలు మార్చు
- ↑ అరందై, నారాయణన్ (1 March 1971). "మలయాళ చిత్రకథలు - ఒక పరిశీలన". విజయచిత్ర. 5 (9): 18.