రామ్మా! చిలకమ్మా
రామ్మా చిలకమ్మా అనేది 2001 తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా. సినిమా టైటిల్ చూడాలని వుంది (1998)లోని పాట ఆధారంగా రూపొందించబడింది.[1] రామ్మా చిలకమ్మా తమిళ చిత్రం ఎన్నమ్మ కన్ను (2000)కి రీమేక్.[2][3] తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన ఈ సిపిమాలో సుమంత్, లయ నటించారు. ఈ సినిమా 2001, జూలై 13న విడుదలైంది.[2] బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.[4]
రామ్మా చిలకమ్మా | |
---|---|
దర్శకత్వం | తమ్మారెడ్డి భరద్వాజ |
స్క్రీన్ ప్లే | తమ్మారెడ్డి భరద్వాజ |
నిర్మాత | కె సి శేఖర్ బాబు |
తారాగణం | సుమంత్ లయ ఆకాష్ |
ఛాయాగ్రహణం | వి.ఎన్. సురేష్ |
కూర్పు | మురళి-రామయ్య |
సంగీతం | ఆర్. పి. పట్నాయక్ |
విడుదల తేదీ | 13 జూలై 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సుమంత్ (కాశి)
- లయ (గాయత్రి)
- ఆకాష్ (విశ్వ)
- బ్రహ్మానందం (బ్రహ్మానందం - పోలీస్ ఆఫీసర్, ద్వంద్వ పాత్ర)
- తనికెళ్ల భరణి
- కోవై సరళ (సిమ్రాన్ - సింహు డార్లింగ్, ద్వంద్వ పాత్రలు)
- ఆహుతి ప్రసాద్
- ఢిల్లీ రాజేశ్వరి (రాజీ)
- జూ. రేలంగి (పోలీస్ ఆఫీసర్)
- అనంత్ (పోలీస్ ఇన్స్పెక్టర్)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: తమ్మారెడ్డి భరద్వాజ
- నిర్మాత: కె.సి. శేఖర్ బాబు
- సంగీతం: ఆర్. పి. పట్నాయక్
- పాటలు: కులశేఖర్, గురుచరణ్
నిర్మాణం
మార్చువెంకట్తో అదే పేరుతో వేరే సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ టైటిల్‌ను మళ్లీ ఉపయోగించాడు. టైటిల్ చూడాలని వుంది (1998)లోని పాట ఆధారంగా రూపొందించబడింది.[1] ఈ చిత్రం తమిళ చిత్రం ఎన్నమ్మ కన్ను (2000)కి రీమేక్.[2][3] ఆకాష్ తన తెలుగు అరంగేట్రంలో ఈ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు.[5]
పాటలు
మార్చుఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చాడు.[6] కులశేఖర్, గురుచరణ్ పాటలు రాశారు.[7]
- "మాక్సీలు బికిన్లు" - రవివర్మ
- "సమ్మలోరి కిల్లా" - ఆర్పీ పట్నాయక్
- "మనసా మనసు తలుపు" - ఉష
- "కొమ్మల గువ్వలు" - సందీప్, సునీత ఉపద్రష్ట
- "కొమ్మల గువ్వలు (విచారం)" - లెనినా చౌదరి
- "చెయ్ చెయ్ చెయ్" - చక్రి
విడుదల, స్పందన
మార్చుఈ సినిమా 2001, జూలై 13న విడుదలైంది.[2]
ఫుల్ హైదరాబాద్‌కు చెందిన అజయ్ బాష్యం ఇలా వ్రాశాడు, "ప్రధాన కథనం ప్రారంభమైన మొదటి 45 నిమిషాల తర్వాత రామ్మా చిలకమ్మ మెరుగుపడుతుంది, తరువాత ఏమి జరగబోతుందో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తుంది".[8] indiainfo నుండి ఒక విమర్శకుడు "ఇంతకుముందు మంచి సినిమాలు తీసిన తమ్మారెడ్డి భరద్వాజ, ఈసారి హాస్యాస్పదమైన కథ, చెడ్డ స్క్రీన్‌ప్లేతో ఒక డడ్ ఫిల్మ్‌గా మార్చారు" అని రాశాడు.[9]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Ramma Chilakamma – Sumanth teases Laya". Idlebrain.com. 21 November 2000. Archived from the original on 1 June 2022. Retrieved 2 August 2022.
- ↑ 2.0 2.1 2.2 2.3 "Ramma Chilakamma is releasing on 13th July". Idlebrain.com. 28 June 2001. Archived from the original on 1 June 2022. Retrieved 2 August 2022.
- ↑ 3.0 3.1 Jeevi. "Interview with Tammareddy Bharadwaja". Idlebrain.com. Archived from the original on 24 July 2013. Retrieved 2 August 2022.
- ↑ "Sumanth's Sabhash on the backtrack". Idlebrain.com. 28 November 2001. Archived from the original on 23 April 2021. Retrieved 2 August 2022.
- ↑ "Rekha's Anandam". Idlebrain.com. 5 September 2001. Archived from the original on 1 June 2022. Retrieved 2 August 2022.
- ↑ Jeevi. "Interview with RP Patnaik". Idlebrain.com. Archived from the original on 6 May 2022. Retrieved 2 August 2022.
- ↑ https://moviegq.com/movie/ramma-chilakamma-7521/songs
- ↑ Ajay Bashyam. "Raamma Chilakamma Review". Full Hyderabad. Archived from the original on 21 June 2022. Retrieved 2 August 2022.
- ↑ https://web.archive.org/web/20010813141108/http://movies.indiainfo.com/telugu/reviews/index.html