ఠాకూర్ రాంలాల్

(రామ్ లాల్ నుండి దారిమార్పు చెందింది)

ఠాకూర్ రాంలాల్, కాంగ్రెసు పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1], ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు. ఈ సమయములో, 1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, అప్పటి గవర్నరు రాంలాల్, ప్రధానమంత్రి ఇందిరా గాంధీల లోపాయికారీ సహకారంతో రామారావును అధికారం నుండి తొలగించి, తాను దొడ్డిదారిన గద్దెనెక్కడం.

ఠాకూర్ రాంలాల్
ఠాకూర్ రాంలాల్

ఠాకూర్ రాంలాల్

నియోజకవర్గం జుబ్బల్, కోట్‌ఖాయ్

పదవీ కాలం
28 జనవరి 1977 – 30 ఏప్రిల్ 1977
ముందు యశ్వంత్ సింగ్ పార్మార్
తరువాత శాంతకుమార్
పదవీ కాలం
14 ఫిబ్రవరి 1980 – 7 ఏప్రిల్ 1983
ముందు శాంతకుమార్
తరువాత వీరభద్ర సింగ్

పదవీ కాలం
15 ఆగష్టు 1983 – 29 ఆగష్టు 1984
ముందు కె.సి.అబ్రహాం
తరువాత శంకర్ దయాళ్ శర్మ

వ్యక్తిగత వివరాలు

జననం 15 జనవరి 1929
మరణం 2002 జూలై 6(2002-07-06) (వయసు 72)
సిమ్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
వృత్తి రాజకీయవేత్త

రాంలాల్ 1929, జనవరి 15న జుబ్బల్ లోని భర్తాట గ్రామములో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం సిమ్లా, అమృత్‌సర్ లలో జరిగింది. లా డిగ్రీ కలిగిన ఈయన రాజకీయాలలో చేరక మునుపు కొంతకాలము న్యాయవాద వృత్తిలో కొనసాగాడు. ప్రజాదరణ కలిగిన నాయుకునిగా, ఠాకూర్ రాంలాల్ 1957లో తొలిసారిగా రాష్ట్ర శాసనసభలో స్వతంత్ర అభ్యర్థిగా అడుగిడినప్పటి నుండి 1998 ఎన్నికల వరకు పోటీ చేసిన అన్ని శాసనసభా ఎన్నికలలో గెలుపొందిన అరుదైన ఘనత సాధించాడు. ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పరచుకొని జుబ్బల్, కోట్‌ఖాయి నియోజకవర్గాలను తనకు పెట్టనికోటలా మలచుకొన్నాడు. ఇక్కడి నుండే ఈయన 9 పర్యాయాలు ఎన్నికైనాడు. 1990 లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీచేస్తూ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ను కూడా ఎన్నికలలో ఓడించాడు.

రాంలాల్ 2002 జూలై 6న సిమ్లాలో తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు.[2]

మూలాలు

మార్చు
  1. జనవరి 25, 1971 కి మునుపు హిమాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్రులు ఉన్నా, అప్పుడది కేంద్రపాలిత ప్రాంతముగానే ఉన్నది.
  2. "HP ex-CM Thakur Ramlal dead". Chandigarh: The Times of India. 8 July 2002. Retrieved 10 January 2010.

బయటి లింకులు

మార్చు