రెడ్డి రాఘవయ్య

బాల సాహిత్యవేత్త

రెడ్డి రాఘవయ్య, (1940, జూలై 1 - 2022, జూలై 24) ప్రసిద్ధ బాల సాహిత్యవేత్త. బాలసాహిత్య రచనకే జీవితాన్ని అంకితం చేసిన రచయితల్లో ఇతను ఇకడు. తొలికథ 'సలహా' (పిల్లల కథ) విశాలాంధ్ర దినపత్రిక లోని 'చిన్నారిలోకం'లో 1955 డిసెంబరులో ప్రచురించబడింది. నాటినుండి బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్‌కథలు... బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో వ్రాసిన 32 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మణిదీపాలు అనే పుస్తకం ఆంగ్లంలోకి అనువదింపబడింది.[1]

రెడ్డి రాఘవయ్య
రెడ్డి రాఘవయ్య
జననం(1940-07-01)1940 జూలై 1
మరణం2022 జూలై 24(2022-07-24) (వయసు 82)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బాల సాహిత్యవేత్త
పిల్లలుఇద్దరు కుమారులు
కుమార్తె (రాజేశ్వరి)

జననం, విద్య

మార్చు

రాఘవయ్య 1940 జూలై 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, అమృతలూరు మండలంలోని ప్యాపర్రు గ్రామంలో జన్మించాడు. నిడుబ్రోలు బోర్డు హైస్కూలులో ఎస్‌.ఎస్‌.యల్‌.సి. వరకు చదివారు.[2]

ఉద్యోగం

మార్చు

ప్రభుత్వ 'పారిశ్రామిక శిక్షణ సంస్థ'లో శిక్షణానంతరం - బెంగుళూరులోని హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్సులో 'మెకానిక్‌'గా చేరి అదే సంస్థ హైదరాబాదు శాఖలో 'ఇంజనీరు'గా పనిచేసి 2000లో రిటైరయ్యాడు.

వ్యక్తిగత జీవితం

మార్చు

రాఘవయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె (రాజేశ్వరి) ఉన్నారు.

సాహిత్య ప్రస్థానం

మార్చు

1955 డిసెంబర్‌ 25వ తేదీన విశాలాంధ్ర దిన పత్రికలో వచ్చిన సలహా అనే కథ మొదటి రచనగా ప్రచురిమయింది. 1979లో పదాలు, పద్యాలు కలిపి 'బాల నీతిమాల' పేరుతో మొదటి పుస్తకం తీపుకువచ్చాడు. మణిదీపాలు, నవరత్నాలు, బాలల లోకం, పసిడి పాటలు, మంచి పూలు, జ్ఞానులు - విజ్ఞానులు, పూలతోట, రంగుల రాట్నం వంటి పుస్తకాలు వెలువడ్డాయి. ఎంతోమంది యువ బాలసాహితీ రచయితలను ప్రోత్సహించడమేకాకుండా బాలసాహిత్యంలో కృషి చేస్తున్న రచయితల వివరాలన్నీ సేకరించి, 1995 ప్రాంతంలో వార్త దినపత్రిక ద్వారా వారం వారం పరిచయం చేశాడు. ఆ వివరాలన్నీ కలిపి తెలుగు బాలల రచయితల సంఘం 2002లో పుస్తకంగా తీసుకువచ్చింది.[2][3]

రచనలు

మార్చు
 1. గాలిలో ప్రయాణం
 2. చిరుదివ్వెలు
 3. చాచా నెహ్రూ
 4. జ్ఞానులు - విజ్ఞానులు
 5. విజ్ఞానతరంగాలు
 6. విజ్ఞానవిజయాలు
 7. విజ్ఞానోదయం
 8. ఎందుకు?
 9. దివ్యమాత థెరిసా
 10. బాలలబొమ్మల ఇందిరాగాంధీ
 11. వేలంత వీరుడు
 12. మణిదీపాలు
 13. పూలపొట్లాలు[4]
 14. నేతాజీ సుభాష్ చంద్రబోస్
 15. చంద్రశిలానగరం
 16. పిల్లల బొమ్మల తెనాలి రామకృష్ణ సంపూర్ణ హాస్యకథలు
 17. పిల్లల బొమ్మల భారతం
 18. యూరీ అలెక్స్‌యేవిచ్‌ గగారిన్‌
 19. స్వామి వివేకానంద
 20. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్
 21. మంచిపూలు
 22. లాల్ బహదూర్ శాస్త్రి
 23. భారతరత్న రాజేంద్రప్రసాద్
 24. బాలసాహిత్య నిర్మాతలు
 25. పిల్లల బొమ్మల ప్రపంచ అద్భుతకథలు
 26. పిల్లల బొమ్మల అక్బర్-బీర్బల్ కథలు
 27. పిల్లల బొమ్మల పరమానందయ్య శిష్యుల కథలు
 28. పిల్లల బొమ్మల విక్రమ్‌ భేతాళ కథలు
 29. పిల్లల బొమ్మల రామాయణం
 30. పిల్లల బొమ్మల పంచతంత్రం
 31. పిల్లల బొమ్మల గలివర్ సాహసయాత్రలు
 32. పిల్లల బొమ్మల బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు
 33. పిల్లల బొమ్మల మర్యాదరామన్న కథలు
 34. బాల నీతిమాల

పురస్కారాలు

మార్చు

సాహిత్యరంగంలో అనేక పురస్కారాలు అందుకున్నాడు. వాటిలో కొన్ని:[1]

 • ఉత్తమ బాల సాహిత్య పురస్కారం (2003): నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పుస్తకం (తెలుగు విశ్వవిద్యాలయం)
 • కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం (2012): చిరుదివ్వెలు పుస్తకం
 • నన్నపనేని మంగాదేవి అవార్డు (చిలుమూరు, బాపట్ల జిల్లా)
 • చక్రపాణి - కొలసాని అవార్డు (తెనాలి)
 • మంచిపల్లి సత్యవతి జాతీయ అవార్డు (పార్వతీపురం)

రాఘవయ్య 2022, జూలై 24న హైదరాబాదులోని బాలనగర్ లో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
 1. 1.0 1.1 1.2 "బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య కన్నుమూత". EENADU. 2022-07-26. Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
 2. 2.0 2.1 "బాలల బంధువు రెడ్డి రాఘవయ్య". Prajasakti (in ఇంగ్లీష్). 2022-07-25. Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
 3. Web, Disha (2022-07-24). "బాల సాహితీ వేత్త రెడ్డి రాఘవయ్య కన్నుమూత". www.dishadaily.com. Archived from the original on 2022-07-27. Retrieved 2022-07-27.
 4. అంతర్జాలంలో పూలపొట్లాలు కథల పుస్తకం[permanent dead link]