రేకందార్ ఉత్తరమ్మ
రేకందార్ ఉత్తరమ్మ రంగస్థల నటి.
రేకందార్ ఉత్తరమ్మ | |
---|---|
జననం | రేకందార్ ఉత్తరమ్మ డిసెంబరు 10, 1948 వలపర్ల, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
తండ్రి | వనారస జయరామారావు |
తల్లి | భూలక్ష్మిదేవి |
జననం
మార్చుఉత్తరమ్మ 1948, డిసెంబరు 10న వనారస జయరామారావు, భూలక్ష్మిదేవి దంపతులకు కృష్ణాజిల్లా, వలపర్ల గ్రామంలో జన్మించింది.
రంగస్థల ప్రస్థానం
మార్చుచిన్నవయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టిన ఉత్తరమ్మ 1987 సంవత్సరం వరకు నాటకరంగంలో అనేక పాత్రలు ధరించింది.
నటించిన పాత్రలు
మార్చుఅనసూయలో (లక్ష్మి, అనసూయ, సరస్వతి, మన్మథుడు), శ్రీ కృష్ణ లీలలులో (దేవకి, మాయాపూతన, యశోద, కృష్ణుడు), హరిశ్చంద్రలో (మాతంగ కన్య, చంద్రమతి), మాయాబజార్ లో (శశిరేఖ), సావిత్రి లో (సావిత్రి), కాంతామతిలో (కాంతామతి), గంగావతరణంలో (గంగ), కురుక్షేత్రంలో (అశ్వథ్థామ), పాతాళభైరవిలో (ఇందుమతి), బొబ్బిలియుద్ధం లో (విజయరామరాజు, మల్లమాంబ), బాలనాగమ్మలో (సంగు, బాలనాగమ్మ, మాణిక్యాలదేవి), లవకుశలో (కుశుడు, సీత), స్త్రీ సాహసంలో (ప్రమద), దశావతారాలులో (మోహిని, సీత), కనక్తారాలో (రుక్మిణీ), చింతామణి లో (రాధ), రామాంజనేయ యుద్ధం లో (నారద, శాంతిమతి), భక్తరామదాసులో (కమల), సక్కుబాయిలో (రాధ), బ్రహ్మంగారి చరిత్రలో (అచ్చమాంబ), రంగూన్ రౌడీ లో (అన్నపూర్ణ) నటించింది. ఈవిడకు హరికథలో కూడా ప్రవేశం ఉంది.
మూలాలు
మార్చు- రేకందార్ ఉత్తరమ్మ, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 28.