రోషం బాలు
రోషం బాలు తెలుగు సినిమా నటుడు.[1] రోషం చిత్రం ద్వారా హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.[2]
రోషం బాలు | |
---|---|
జననం | పెండెం బాలకృష్ణ జూలై 6, 1977 |
వృత్తి | సినీనటుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సినీనటుడు |
జీవిత భాగస్వామి | సంధ్య |
పిల్లలు | శ్రీ గణేష్ చంద్రశేఖర్ రావు (కుమారుడు) ఆముక్త (కుమార్తె) |
తల్లిదండ్రులు |
|
జీవిత విశేషాలు
మార్చురోషం బాలు 1977, జూలై 6న జగిత్యాల జిల్లా, బండలింగాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పెండెం లక్ష్మినారాయణ, తల్లి పెండెం లక్ష్మి. రోషం బాలుకు 2012, నవంబర్ 30న సంధ్యతో వివాహం జరిగింది. వారికీ ఒక కొడుకు పెండెం శ్రీ గణేష్ చంద్రశేఖర్ రావు.
విద్యాభ్యాసం
మార్చుబండలింగాపూర్, జగిత్యాలలో ఉన్నత విద్య పూర్తిచేసిన బాలు, మెట్‌పల్లిలోని కనక సోమేశ్వర జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్, సాయి ఐ.టి.ఐ. కళాశాలలో ఎలక్ట్రికల్ డిప్లొమా చదివాడు. హైదరాబాదులోని నోబెల్ డిగ్రీ కళాశాలో డిగ్రీ, ఎన్.ఎం.డి.సి. ఎడ్యుకేషనల్ కళాశాలో బీఈడీ పూర్తి చేశాడు. ఐ.ఏ.ఎస్.ఈ. డీమ్డ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పట్టా పొందాడు.
సినిమారంగం
మార్చుసినిమారంగంపై మక్కువతో 2004లో హైదరాబాదుకు వచ్చిన బాలు సాయి కిరణ్ హీరోగా నటించిన 'మానస' సినిమాలో తొలిసారిగా నటించాడు. తరువాత సక్సెస్, ప్రామిస్, ధడాల్, ఇటు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, రెడ్, కమలతో నా ప్రయాణం, దక్షిణ మధ్య రైల్వే జట్టు, బిక్కు రాథోడ్, జై బోలో తెలంగాణా, జై తెలంగాణ, నివురు, పరిత్యాగి, బి.హౌస్, బాక్స్, బందూక్, జననేత చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా నటించాడు. సాయి గీత ఫిలిమ్స్ పతాకంపై 2007లో బాలు హీరోగా, నిర్మాతగా 'రోషం' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలను పోషించాడు.[3]
తెలంగాణ ఉద్యమం
మార్చుతెలుగు చిత్రసీమలో తెలంగాణ వారికి జరుగుతున్న వివక్ష పట్ల గొంతెత్తి, టిఆర్ఎస్ అధినేత పిలుపునందుకొని తెలంగాణ ఫిలిం జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో సినీరంగం నుండి పాల్గొన్నాడు. తన సినీ ఆకాంక్షను పక్కకు పెట్టి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్ని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పోరాడాడు. తెలంగాణ పొలిటికల్ జేఏసీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్, సకలజనుల సమ్మె, ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థి గర్జన, సంసద్ యాత్ర, వంటావార్పు లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
నటించిన చిత్రాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ సాక్షి, సినిమా (14 May 2014). "దెయ్యాలపై పరిశోధన". Sakshi. Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019.
- ↑ Telugu One, Rosham Movie Hero Balu Guest Hour (Mar 1, 2010). "Interview With Rosham Movie Hero Balu" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2019. Retrieved 3 September 2019.
- ↑ Sakshi (14 May 2014). "దెయ్యాలపై పరిశోధన". Sakshi. Archived from the original on 12 July 2021. Retrieved 12 July 2021.
- ↑ నమస్తే తెలంగాణ (July 6, 2017). "జననేత విజయగాథ - NTNEWS". web.archive.org. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
- ↑ ఆంధ్రప్రభ, సినిమా (June 3, 2016). "సందేశాత్మక 'మునుము'". Archived from the original on 11 September 2019. Retrieved 11 September 2019.