లక్ష్మీనరసింహాపురం (నందివాడ)
లక్ష్మీనరసింహాపురం, కృష్ణా జిల్లా నందివాడ మండలానికి చెందిన గ్రామం.
లక్ష్మీనరసింహాపురం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°34′08″N 81°05′01″E / 16.568979°N 81.083710°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | నందివాడ |
ప్రభుత్వం | |
- సర్పంచి | ఎరికిపాటి రత్నప్రసాదు |
పిన్ కోడ్ | 521 321 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
సమీప గ్రామాలు
మార్చుగుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన, ఏలూరు
సమీప మండలాలు
మార్చుగ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చువెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 43 కి.మీ
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
మార్చువిజయవాడలోని పటమటలంకలోని జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాలలో ఇటీవల జిల్లాస్థాయి సదరన్ ఇండియన్ సైన్స్ డ్రామా ఫెస్టివల్-2015 పోటీలను నిర్వహించారు. ఈ పోటెలలో ఈ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన, "పాపం పంటచేలు" అను నాటిక ప్రథమస్థానం దక్కించుకున్నది. అక్టోబరు మొదటివారంలో నిర్వహించు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనుటకు వీరు అర్హత సంపాదించుకున్నారు. [2]
ఈ పాఠశాల ఆవరణలో, 2016,అక్టోబరు-6వతేదీ గురువారంనాడు చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని దాతలు శ్రీ కూన సత్యనారాయణ, శ్రీమతి జయశ్రీ దంపతులు, తవిటయ్య, సరస్వతి దంపతుల ఙాపకార్ధం అందజేసినారు. [3]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుఈ గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు ఉంది.
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామం ఇలపర్రు గ్రామానికి శివారు గ్రామం.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:- ఈ పురాతన ఆలయం, చిన్నదిగా ఉండి, శిథిలావస్థకు చేరడంతో, భక్తులే పూనుని, నూతన ఆలయం నిర్మించారు. ఈ నూతన ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ సందర్భంగా 2015,జూన్-12వ తేదీ శుక్రవారంనాడు, ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. పెద్ద యెత్తున శాంతిహోమం నిర్వహించారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ, సిద్ధమూర్తి వారల విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భక్తి భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకున్నది. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ఈ గ్రామంనుండియేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా, అధికసంఖ్యలో విచ్చేసి, స్వామివారలను దర్శించుకొని, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. [1]
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
వెలుపలి లింకులు
మార్చు[1] ఈనాడు అమరావతి; 2015,జూన్-13; 29వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,ఆగష్టు-27; 7వపేజీ.[3] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,అక్టోబరు-7; 1వపేజీ.